Chiranjeevi: 40ఏళ్లలో బెంగళూరువాసులు ఎప్పుడూ ఎదుర్కోనంత నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సర్వత్రా ఆందోళన కలిగిస్తోన్న సమస్యకు ప్రాంతాలతో సంబంధంలేదని.. నీటి వాడకం, పొదుపుపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అనేకమంది సూచిస్తున్నారు. ఈక్రమంలో మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) సమస్యపై స్పందించారు. నీటి సంరక్షణ, విలువ తెలియజేస్తూ బెంగళూరు (Bengaluru) లోని తన ఫామ్ హౌస్ లో చేసిన ఏర్పాట్లను వివరించారు. ఇంకుడు గుంతలు, చిన్నపాటి బావులు నిర్మించుకోవాలని సూచిస్తూ కన్నడ భాషలోనే పోస్ట్ చేశారు.
‘నీరు అత్యంత విలువైన వస్తువు, నీటి కొరత రోజువారీ జీవితాన్ని కష్టతరం చేస్తుంది. బెంగళూరులో నేడు ఏర్పడిన నీటి కొరత రేపు ఎక్కడైనా జరగవచ్చు. కాబట్టి నీటి సంరక్షణకు ప్రాధాన్యమిస్తూ ఇళ్లను నిర్మించాల్సిన అవసరం ఉంది. బెంగుళూరులోని నా ఫామ్ హౌస్ లో రీఛార్జ్ బావులు ఏర్పాటు చేశాం. వడపోత వ్యవస్థ ఉంటుంది. ఇసుక, పొరల గుండా నీరు వెళ్లేందుకు వీలుగా ఉంటుంది. పెర్మాకల్చర్ సూత్రాలను అమలు చేసామ’ని అన్నారు. ఈక్రమంలో పలు ఫొటోలు పంచుకున్నారు. చిరంజీవి సూచనలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ಈ ಪೋಸ್ಟ್ ಸ್ವಲ್ಪ ಉದ್ದವಾಗಿದ್ದರೂ, ಪಾಯಿಂಟ್ ಚಿಕ್ಕದಾದರೂ… ಬಹಳ ಮುಖ್ಯ.
ನಮಗೆಲ್ಲರಿಗೂ ತಿಳಿದಿರುವಂತೆ, ನೀರು ಅತ್ಯಂತ ಅಮೂಲ್ಯವಾದ ವಸ್ತು, ನೀರಿನ ಕೊರತೆಯು ದೈನಂದಿನ ಜೀವನವನ್ನು ಕಷ್ಟಕರವಾಗಿಸುತ್ತದೆ. ಇಂದು ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ನೀರಿನ ಕೊರತೆ ಎದುರಾಗಬಹುದು. ನಾಳೆ ಎಲ್ಲಿ ಬೇಕಾದರೂ ಸಂಭವಿಸಬಹುದು.ಆದ್ದರಿಂದ ನೀರನ್ನು ಸಂರಕ್ಷಿಸಲು ಸಹಾಯ… pic.twitter.com/HwoWhSiZW5
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 26, 2024