Switch to English

‘ఆచార్య’ రివ్యూ : మెగా ఫ్యాన్స్ కు మాత్రమే

Critic Rating
( 2.25 )
User Rating
( 2.00 )

No votes so far! Be the first to rate this post.

Movie ఆచార్య
Star Cast చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డే
Director కొరటాల శివ
Producer నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, రామ్ చరణ్
Music మణి శర్మ
Run Time 2 గం 34 నిమిషాలు
Release 29 ఏప్రిల్ 2022

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన మెగాస్టార్‌ ఆచార్య చిత్రం ఎట్టకేలకు వచ్చేసింది. ఈ సినిమా లో చరణ్ ను చిన్న పాత్ర కోసం తీసుకుని ఆయన పాత్ర పరిధిని పెంచారు. చిరంజీవితో కాస్త అటు ఇటుగా సమానమైన రోల్‌ ను చరణ్ కు ఇవ్వడం జరిగిందట. మెగాస్టార్‌ చిరు, మెగా పవర్ స్టార్‌ చరణ్‌ కలిసి నటించిన సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. మరి అంచనాలను దర్శకుడు కొరటాల శివ అందుకున్నాడా..? తన సక్సెస్ జర్నీని కొనసాగించాడా? అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

పూర్తి కథ ధర్మస్థలి బ్యాక్ డ్రాప్ లో అక్కడి జనాల పై సాగుతుంది. సిద్దవనం అనే ప్రాంతం తో అక్కడి జనాలు మమేకం అయ్యి ఉంటారు. అలాంటి సిద్దవనం ను మరియు ధర్మస్థలిని దక్కించుకోవాలని బసవ( సోనూసూద్‌) ప్రయత్నిస్తాడు. అప్పుడే ఆచార్య అక్కడకు వస్తాడు. సిద్దవనం మరియు ధర్మస్థలిని కాపాడే ప్రయత్నం చేస్తాడు. ధర్మస్థలికి ఆచార్య కు సంబంధం ఏంటీ? ఈ కథలో సిద్ద (చరణ్‌ ) పాత్ర ఏంటీ ? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులుః

మెగా స్టార్‌ చిరంజీవి తన అద్బుతమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేయగలిగాడు. ఆయన స్క్రీన్‌ పై కనిపించినంత సమయం కూడా ప్రేక్షకులు మరెవ్వరిని కూడా చూడకుండా చేశాడు. తనదైన మార్క్ డైలాగ్ డెలవరీ మరియు డాన్స్ లతో చిరంజీవి ఆకట్టుకున్నాడు.

సిద్ద పాత్రకు చరణ్ పూర్తి న్యాయం చేశాడు. మంచి లుక్‌ తో పాటు ఎమోషనల్‌ సన్నివేశంలో చరణ్ కనబర్చిన నటన ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంది. ఆయన స్క్రీన్‌ ప్రజెన్స్‌ అద్బుతంగా ఉంది.

అభిమానులకు చిరంజీవి మరియు చరణ్‌ ల కాంబో సన్నివేశాలు కన్నుల పండుగ. వారిద్దరు కలిసి నటిస్తూ ఉంటే.. కలిసి డాన్స్ చేస్తూ ఉంటే అభిమానులు చూపు తిప్పుకోలేక పోతారు. ఇక పూజా హెగ్డే పాత్ర చిన్నదే అయినా కూడా ఉన్నంతలో నటించి మెప్పించింది. విలన్ గా సోనూ సూద్‌ నటన చాలా బాగుంది. ఆయన లుక్ ను బాడా డిజైన్ చేశారు. ఇతర నటీ నటులు వారి పాత్రల పరిధిలో నటించి మెప్పించారు.

సాంకేతిక నిపుణులుః

దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్‌ విషయంలో ఇంకాస్త వర్క్‌ చేయాల్సి ఉంది. సోషల్‌ డ్రామా ను వీక్ స్క్రిప్ట్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేశాడు. ఇప్పటి వరకు అపజయం అంటూ ఎరగని కొరటాల శివ నుండి అభిమానులు చాలా ఆశించారు. కాని ఆ స్థాయిని అందుకోవడంలో విఫలం అయ్యాడు. కథ మరియు స్క్రీన్‌ ప్లే విషయంలో కొరటాల శివ పట్టు కనిపించలేదు. ఇద్దరు సూపర్‌ స్టార్స్ ను ఉపయోగించి కూడా జనాలను ఆకట్టుకునేలా సినిమాను మల్చడంలో విఫలం అయ్యాడని చెప్పక తప్పడం లేదు. స్క్రీన్‌ ప్లే ఏమాత్రం ఆకట్టుకోలేదు.. దర్శకత్వం చాలా వీక్ గా ఉంది.

మణిశర్మ అందించిన సంగీతం సాదా సీదాగా ఉంది. పాటలు పర్వాలేదు అనిపించినా బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్ విషయంలో నిరాశ తప్పదు. మణిశర్మ అంటే మంచి బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఇస్తాడనే నమ్మకం ఉంది. కాని ఆ నమ్మకం వమ్ము అయ్యింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా ధర్మస్థలి మరియు సిద్దవనం లను చక్కగా చూపించారు. ఎడిటర్‌ నవీన్‌ పూర్తిగా విఫలం అయ్యాడు. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.

పాజిటివ్‌ పాయింట్స్ :

  • చిరు, చరణ్ సాంగ్‌,
  • తండ్రి కొడుకుల మద్య సన్నివేశాలు,
  • ఆర్ట్ వర్క్

మైనస్ పాయింట్స్ :

  • స్క్రీన్‌ ప్లే,
  • ఎంటర్‌ టైన్మెంట్‌ లోపించడం,
  • నెమ్మదిగా కథ సాగడం.

చివరగా :

ఆచార్య సినిమా 1990 ల్లో వచ్చిన కొన్ని సినిమాలను పోలి ఉంది. వీక్ కథ మరియు స్క్రీన్‌ ప్లే తో ప్రేక్షకులకు ఎంటర్‌ టైన్మెంట్‌ ను అందించలేక పోతుంది. చిరంజీవి మరియు చరణ్‌ కలిసి నటించిన సన్నివేశాల కోసం మెగా అభిమానులు ఈ సినిమా ను చూడవచ్చు. కొరటాల శివ గత సినిమాలతో పోల్చితే పూర్తిగా నిరాశ పర్చాడు. మెగా ఫ్యాన్స్‌ కు కన్నుల విందు అయినా కూడా సాదారణ ప్రేక్షకులకు మాత్రం ఒకింత అసంతృప్తి తప్పదు.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: మాస్ కు కేరాఫ్ అడ్రెస్ గా...

కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉండే మాస్ కథాంశాల్ని చిరంజీవి ఎక్కువగా చేశారు. పాత్రను అన్వయం చేసుకుని తనదైన శైలిలో నటించి హీరోగా చిరంజీవి ఎలివేట్ అయిన...

కార్తికేయ 2 మూవీ రివ్యూ: డీసెంట్ థ్రిల్లర్

నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది....

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనకు కీర్తి కిరీటం ‘ఆపద్భాంధవుడు

మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్,...

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్...

రాజకీయం

కొత్త సమస్య.. ఆ నదిపై ప్రాజెక్టు వద్దని ఏపీ సీఎంకు తమిళనాడు సీఎం లేఖ

ఏపీ-తమిళనాడు సరిహద్దులో కుశస్థలి అంతర్రాష్ట్ర నదిపై జలాశయాల నిర్మాణం చేపట్టొద్దని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఓ లేఖలో కోరారు. ‘కుశస్థలి నదిపై ఏపీ ప్రభుత్వం 2చోట్ల...

ఎలక్షన్ ఫీవర్.! అసెంబ్లీ నియోజకవర్గానికి 30 కోట్లు ఖర్చు మాత్రమేనా.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఎన్నికలంటే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయిందన్నది నిర్వివాదాంశం. అసెంబ్లీ నియోజకవర్గానికే 150 కోట్ల పైన ఖర్చు చేసిన ప్రబుద్ధులున్నారు రాజకీయాల్లో.. అంటూ 2019 ఎన్నికల సమయంలో ప్రచారం...

వైఎస్ విజయమ్మకి రోడ్డు ప్రమాదం.! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అనుమానం.!

కారు టైర్లు పేలిపోవడం అనేది జరగకూడని విషయమేమీ కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంటుంది. కార్ల టైర్లను సరిగ్గా మెయిన్‌టెయిన్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. మామూలు వ్యక్తుల...

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.!

ఎవరో తిడితే, ఇంకెవరో క్షమాపణ చెప్పాలట.! ఇదెక్కడి పంచాయితీ.? ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టబడాలనే ఆలోచనతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వున్నట్టున్నారు. లేకపోతే, అద్దంకి దయాకర్ తన మీద చేసిన...

ఛీరెడ్డి బూతులు.! ‘బూతుల శాఖ’ దక్కుతుందా.?

బూతులు తిట్టారు, నానా యాగీ చేశారు.. చివరికి కొడాలి నాని పరిస్థితి ఏమయ్యింది.? మంత్రి పదవి ఊడింది.! ఇది చూసైనా, వైసీపీలో చాలామందికి బుద్ధి రావాలి కదా.? కానీ, అంతకు మించి ఎగిరెగిరి...

ఎక్కువ చదివినవి

సల్మాన్ రష్దీపై హత్యాప్రయత్నం.. కన్ను కోల్పోయి.. నరాలు తెగిపోయి..

ప్రముఖ రచయిత, బుకర్ ప్రైజ్ గ్రహీత సల్మాన్ రష్దీపై నిన్న అమెరికాలోని న్యూయార్క్ లో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో ఆయన ఒక...

రోజా లక్షలు వర్సెస్ పవన్ కళ్యాణ్ కోట్లు.! ఎవరి నిజాయితీ ఎంత.?

వైసీపీ నేత, మంత్రి రోజా.. జబర్దస్త్ షో ద్వారా లక్షల్లో సంపాదించారట. ఆ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకున్నారు. సినిమా హీరోయిన్‌గా బోల్డంత సంపాదించినట్లు కూడా చెప్పుకున్నారామె.! ఔను, నిజమే.. ఒకప్పుడు తెలుగు...

నాగార్జున ది ఘోస్ట్ చిత్రీకరణ పూర్తి

గత కొంత కాలంగా వరస పరాజయాలతో అక్కినేని నాగార్జున ఇబ్బందిపడుతున్నాడు. భారీ హిట్ తో కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే నాగ్ ప్రస్తుతం చేస్తోన్న ది ఘోస్ట్ పై చాలా నమ్మకంగా...

డిస్నీప్లస్ హాట్ స్టార్ లో “వారియర్” సంచలనం!!

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇప్పుడు ఆడియన్స్ ని ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా ఉర్రూతలూగిస్తోంది. దాని పేరు "వారియర్". ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని రెండు క్యారక్టర్లతో సంచలనం సృష్టించారు. హీరో...

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పదేళ్ల సినీ ప్రయాణం పూర్తి

అతి కొద్ది కాలంలోనే ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న చిత్రనిర్మాణ సంస్థలు 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్', 'సితార ఎంటర్టైన్మెంట్స్'. ఈ రెండు నిర్మాణ సంస్థలు నేటితో పదేళ్ల సినీ ప్రయాణాన్ని...