Switch to English

జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ కార్డులు పంపిణీ చేసిన మెగాస్టార్ చిరంజీవి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టి ఎఫ్ జె) సభ్యులు అందరికీ ఇన్సూరెన్స్ కార్డులను మెగాస్టార్ చిరంజీవి తన చేతుల మీదుగా పంపిణీ చేసారు. గురువారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. జర్నలిస్టులు అందరికీ కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, మరికొందరు ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ జర్నలిస్టులతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ, “జర్నలిస్టులతో ఉంటే నా బంధువులతో ఉన్న భావన కలుగుతుంది. నా కెరీర్ ప్రారంభంలో, అంటే ప్రాణం ఖరీదు కంటే ముందు నా గురించి ఎవరైనా రాస్తే బాగుంటుంది అని అనుకుంటున్న సమయంలో పసుపులేటి రామారావు గారు నా గురించి ఒక ఆర్టికల్ రాసారు. అది నన్ను ఎంతో కదిలించింది. దాంతో నేను ఆయనకు 100 రూపాయలు ఇవ్వబోగా, ఆయన సున్నితంగా తిరస్కరిస్తూ వద్దు సార్ ఇది నా బాధ్యత అని అన్నారు. ఈ చర్య జర్నలిస్టులపై నాకున్న గౌరవాన్ని అమాంతం పెంచింది. ఇంకా నా కెరీర్ లో విలువైన సలహాలు ఇస్తూ వచ్చిన గుడిపూడి శ్రీహరి, విఎస్ఆర్ ఆంజనేయులు, నందగోపాల్ వంటివారు నుండి నేను ఎంతో నేర్చుకున్నాను. ఆ గౌరవంతోనే ఈరోజు కమిటీ ఆహ్వానిస్తే వచ్చాను. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి సూచన మేరకు ప్రతీ సినిమాకూ లక్ష రూపాయలు టి.ఎఫ్.జె అసోసియేషన్ కు ఇచ్చేలా నేను చూసుకుంటాను. ఈ రోజు హెల్త్ కార్డులు పంపిణీ నా చేతుల మీదుగా జరిగింది. భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా నేను ముందుంటాను,” అని భరోసా ఇచ్చారు.

జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ కార్డులు పంపిణీ చేసిన మెగాస్టార్ చిరంజీవి

ఇక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, “సినిమా జర్నలిస్టులు సినిమా ప్రమోషన్స్ లో భాగమవుతారు. వారికి రాజకీయాలు తెలీవు. క్రమశిక్షణతో మెలగడం గొప్ప విషయం. ప్యాండెమిక్ సమయంలో చిరంజీవి గారు జర్నలిస్టుల కష్టసుఖాలు పంచుకున్నారు. నేను కూడా వందల మందికి నిత్యావసరాలు అందజేసాను. ప్రతీ సినిమాకూ లక్ష రూపాయల చొప్పున టి.ఎఫ్.జె అసోసియేషన్ కు ఇస్తే బాగుంటుంది అన్నది నా భావన. నా వంతుగా రేపు ఐదు లక్షల రూపాయలు అందజేస్తాను. ప్రభుత్వం సినిమా రంగానికి చేదోడువాదోడుగా ఉంది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా చేపడుతున్నాం,” అని తెలిపారు.

ఇంకా ఈ కార్యక్రమంలో అనిల్ రావిపూడి, ఎతికా ఇన్సూరెన్స్ సి.ఓ.ఓ రాజేంద్ర, టి.ఎఫ్.జె అధ్యక్షుడు వి.లక్ష్మి నారాయణ, కోశాధికారి నాయుడు సురేంద్ర, ప్రధాన కార్యదర్శి వై.జె. రాంబాబు, మాట్లాడారు.

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కొత్తగా ఎన్నికైన బాడీ లిస్ట్

ప్రెసిడెంట్

వి లక్ష్మీనారాయణ

ఉపాధ్యక్షులు

1. ఎం చంద్ర శేఖర్
2. జి శ్రీనివాస్ కుమార్

జనరల్ సెక్రటరీ

వై జె రాంబాబు

జాయింట్ సెక్రటరీలు

1.జి వి రమణ
2. వంశీ కాకా

కోశాధికారి

నాయుడు సురేంద్ర కుమార్

కార్య నిర్వాహక కమిటీ

1. పి రఘు
2. వై రవిచంద్ర
3. జి జలపతి
4. కె ఫణి
5. కె సతీష్
6. రెంటాల జయదేవ్
7. వడ్డి ఓం ప్రకాష్
8. సురేష్ కొండి

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...