Switch to English

బ్రహ్మాస్త్ర మూవీ రివ్యూ – విఎఫ్ఎక్స్ ఎక్కువ, విషయం తక్కువ

Critic Rating
( 2.50 )
User Rating
( 2.50 )

No votes so far! Be the first to rate this post.

91,319FansLike
57,010FollowersFollow
Movie బ్రహ్మాస్త్రం
Star Cast అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, అలియా భట్, మౌని రాయ్, నాగార్జున అక్కినేని
Director అయాన్ ముఖర్జీ
Producer కరణ్ జోహార్, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా, రణబీర్ కపూర్, మరిజ్కే డిసౌజా, అయాన్ ముఖర్జీ
Music సైమన్ ఫ్రాంగ్లెన్, ప్రీతమ్
Run Time 2 గం 47 నిమిషాలు
Release 9 సెప్టెంబర్ 2022

యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ సినిమా అందరికంటే బాలీవుడ్ కు ఎక్కువ ముఖ్యం. గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న బాలీవుడ్ ఈ చిత్రంపై చాలానే ఆశలు పెట్టుకుంది. తెలుగులో కూడా భారీ లెవెల్లో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసారు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా.

కథ:

ఈ లోకాన్ని సంరక్షించే బ్రహ్మాస్త్రను మూడు భాగాలుగా చేసి జాగ్రత్త చేస్తారు బ్రహ్మన్ష్ గ్రూప్. మొదటి భాగం అనీష్ (నాగార్జున) వద్ద, రెండో భాగం మోహన్ భార్గవ్ (షారుఖ్ ఖాన్) వద్ద ఉంటాయి. మరి మూడో భాగం ఎక్కడ ఉందనేది సస్పెన్స్. వీటికి సంబంధం లేకుండా పూర్తిగా భిన్నంగా, డీజే శివ (రన్బీర్ కపూర్), ఈషా (అలియా భట్) ను ప్రేమిస్తాడు.

మరి ఈ బ్రహ్మాస్త్ర విషయంలో శివ ఎలా ప్రవేశించాడు? వారి ప్రేమకథ ఈ మెయిన్ స్టోరీకి ఎలా లింక్ అయింది?

మరోవైపు ఈ బ్రహ్మాండమైన శక్తి కలిగిన బ్రహ్మాస్త్రను చేజిక్కించుకోవడానికి విలన్ బృందం శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. మరి చివరికి ఏమైంది?

నటీనటులు:

బ్రహ్మాస్త్రకు మెయిన్ ప్లస్ పాయింట్ అంటే రన్బీర్ కపూర్, అలియా భట్ ల మధ్య నడిచే కెమిస్ట్రీ. రన్బీర్ తన పెర్ఫార్మన్స్ తో మెప్పిస్తాడు. అలాగే అలియాకు కూడా పెర్ఫర్మ్ చేసేందుకు స్కోప్ దక్కింది. ఇండియన్ సినిమాలో దిగ్గజాలు అయిన అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, నాగార్జునలు కీలక పాత్రల్లో కనిపించారు. వారు ఈ సినిమాకు కచ్చితంగా ఉపయోగపడ్డారు.

విలన్ గా మౌని రాయ్ పర్వాలేదు. మిగిలిన వారందరూ మాములే.

సాంకేతిక నిపుణులు:

బ్రహ్మాస్త్రలో విఎఫ్ఎక్స్ వర్క్ అబ్బురపరుస్తుంది. ఇండియన్ సినిమాలో ఇంత స్థాయి గ్రాఫిక్స్ మనం చూసింది లేదు. ఇక చిత్రానికి సంగీతం ప్రధానంగా ప్లస్ అయింది. అన్ని సాంగ్స్ బాగున్నాయి. అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొంత నిరుత్సాహపరుస్తుంది. నెక్స్ట్ లెవెల్ కు వెళ్లే స్కోప్ ఉన్న సీన్స్ కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్ల ఫ్లాట్ అయ్యాయి.

సినిమాటోగ్రఫీ బాగానే సాగింది. ప్రకాష్ కురుప్ ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండొచ్చు. దర్శకుడు అయాన్ ముఖర్జీ, కథ మీద తక్కువ, విఎఫ్ఎక్స్ వర్క్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు అనిపిస్తుంది.

పాజిటివ్ పాయింట్స్:

  • రన్బీర్, అలియా
  • విఎఫ్ఎక్స్
  • పాటలు

నెగటివ్ పాయింట్స్:

  • రైటింగ్
  • స్క్రీన్ ప్లే
  • ఎడిటింగ్
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

విశ్లేషణ:

విజువల్ గా గ్రాండ్ గా సాగే చిత్రం బ్రహ్మాస్త్ర. పెర్ఫార్మన్స్ ల పరంగా అంతా ఓకే అనిపిస్తుంది కూడా. అయితే ప్రధానంగా కథ చెప్పాల్సిన చోట బ్రహ్మాస్త్ర వీక్ అయింది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ప్రేమకథ మీద సాగుతుంది. మెయిన్ కథ ఉన్న సెకండ్ హాఫ్ నిరుత్సాహపరుస్తుంది. ఇక క్లైమాక్స్ అయితే ఎంతకీ అవ్వక మన సహనాన్ని పరీక్షిస్తుంది.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఫైమాని సేవ్ చేసి.. రాజ్‌ని బలిపశువుగా మార్చేసి.!

బిగ్ బాస్ రియాల్టీ షోలో రియాల్టీ గురించి అస్సలు ఆలోచించకూడదు. రాజ్ ఎలిమినేట్ అయిపోయాడు.! కానీ, వికెట్ పడాల్సింది ఫైమాది. ఫైమా వద్ద ఎవిక్షన్ ఫ్రీ...

స్వామి మాల వేసినా ఆటిట్యూడ్ తగ్గించుకోని ప్రభాకర్ తనయుడు… మరోసారి ట్రోల్స్

ఈటివి ప్రభాకర్ గా పేరు తెచ్చుకున్న ప్రముఖ బుల్లితెర నటుడు ప్రభాకర్ తన కొడుకు చంద్రహాస్ ను హీరోగా పరిచయం చేసిన ప్రెస్ మీట్ ట్రోలర్స్...

నాన్నగారు నాకు చాలా ఇచ్చారు.. సూపర్ స్టార్ మహేష్ బాబు

సూపర్‌స్టార్‌ కృష్ణ గారి పెద్దకర్మను ఆదివారం కుటుంబ సభ్యులు నిర్వహించారు. పెద్దకర్మకు భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్‌ బాబు...

మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారు: వివాదాస్పదమైన రామ్ దేవ్ వ్యాఖ్యలు

ప్రముఖ యోగ గురు రామ్ దేవ్ బాబా మహిళలపై చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదమయ్యాయి. మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారని అన్నారు. మహారాష్ట్రలోని ఠాణేలో పతంజలి...

కీర్తి భట్‌పై సింపతీ వేవ్.! బిగ్ బాస్ విన్నర్‌ని చేస్తుందా.?

కీర్తి భట్.! బుల్లితెర నటీమణి.! ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్‌లో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ అని చెప్పొచ్చు. చేతి వేలికి...

రాజకీయం

పవన్ కళ్యాణ్‌ని విమర్శించేవాళ్ళెవరైనా పది పైసలు ‘సాయం’ చెయ్యగలరా.?

రాజకీయ నాయకుడంటే ఎలా వుండాలి.? అసలు రాజకీయం అంటే ఏంటి.? రాజకీయమంటే సేవ.! రాజకీయ నాయకుడంటే సేవకుడు.! అధికార పీఠమెక్కి, ప్రజా ధనాన్ని సొంత పార్టీ నేతలకు పప్పూ బెల్లం పథకాల్లా పంచెయ్యడం...

‘లేకి’ జర్నలిజం.! పవన్ కళ్యాణ్‌పై ఏడవడమే పాత్రికేయమా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కులాల ప్రస్తావన తెస్తున్నారు. ఏం, ఎందుకు తీసుకురాకూడదు.? పేరు చివర్న రెడ్డి, చౌదరి.. ఇలా తోకలు పెట్టుకున్న నాయకులు, కులాల పేరుతో రాజకీయాలు చేయొచ్చుగానీ, కులాల్ని కలిపే...

టీడీపీ ఎమ్మెల్యే గంటా వైసీపీలో చేరబోతున్నారా.?

మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో, సూచనలతో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారట. అసలు గంటా శ్రీనివాసరావు టీడీపీలోనే వున్నారా.? చాలామందికి వస్తోన్న డౌట్ ఇది. 2019...

ఛాలెంజ్ విసురుతున్నా.. ఈసారి మీరెలా గెలుస్తారో చూస్తా..: పవన్ కల్యాణ్

‘ఎవరికి అన్యాయం జరిగినా స్పందిస్తాం.. మాకు ఓట్లు వేసినా.. వేయకపోయినా అండగా ఉంటాం’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత బాధితులకు...

‘సీకే పల్లి పీఎస్ ముందు పరిటాల సునీత, శ్రీరామ్ బైఠాయింపు..’ పరిస్థితి ఉద్రిక్తత

సత్యసాయి జిల్లా సీకే పల్లి పోలిస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్ధసారధి...

ఎక్కువ చదివినవి

పవర్ స్టార్ కు బాస్ పార్టీ పిచ్చ పిచ్చగా నచ్చేసిందిట

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న వాల్తేర్ వీరయ్య సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానున్న విషయం తెల్సిందే. ఇదిలా ఉంటే చిత్ర ప్రమోషన్స్ షురూ అవుతున్నాయి. ఈ...

పవన్ కళ్యాణ్‌ని విమర్శించేవాళ్ళెవరైనా పది పైసలు ‘సాయం’ చెయ్యగలరా.?

రాజకీయ నాయకుడంటే ఎలా వుండాలి.? అసలు రాజకీయం అంటే ఏంటి.? రాజకీయమంటే సేవ.! రాజకీయ నాయకుడంటే సేవకుడు.! అధికార పీఠమెక్కి, ప్రజా ధనాన్ని సొంత పార్టీ నేతలకు పప్పూ బెల్లం పథకాల్లా పంచెయ్యడం...

అమ్మకానికి బిస్లరీ వాటర్..! రేసులో టాటా గ్రూప్ సహా పలు కంపెనీలు..

ప్రముఖ మంచినీటి వ్యాపార సంస్థ బిస్లరీ కంపెనీని విక్రయిస్తున్నట్టు చైర్మన్ రమేశ్ చౌహాన్ వెల్లడించారు. ఇప్పటికే కొన్ని కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. ఇందులో టాటా కన్సూమర్ ప్రొడక్ట్స్ కూడా ఉందని తెలిపారు. అయితే.....

‘ఫోన్ కాల్ వస్తే డొనేషన్లు కట్టలేదని చెప్పండి.. ప్లీజ్’ తల్లిదండ్రులకు ఫోన్లు

‘మీ అబ్బాయి/అమ్మాయి మా కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఎవరైనా ఫోన్ చేసి డొనేషన్ కట్టారా..? అంటే కట్టలేదని చెప్పండి..’ అని తల్లదండ్రులకు ఓ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. తెలంగాణ మంత్రి...

శ్రీహాన్‌తో సిరి.! ఈ ముద్దుల గోలేంటి బిగ్ బాస్.!

అసలే బిగ్ బాస్ రియాల్టీ షో మీద ‘బ్రోతల్ హౌస్’ అనే విమర్శలు వచ్చాయి, వస్తూనే వున్నాయి. ఆ విమర్శలు అత్యంత జుగుప్సాకరమే అయినా, ఆ మచ్చని చెరిపేసుకునేందుకు ఏమాత్రం ప్రయత్నించడంలేదు బిగ్...