Switch to English

ఒకే ఒక జీవితం మూవీ రివ్యూ – ఎమోషనల్ రైడ్

Critic Rating
( 2.75 )
User Rating
( 3.10 )

No votes so far! Be the first to rate this post.

91,319FansLike
57,013FollowersFollow
Movie ఓకే ఒక జీవితం
Star Cast శర్వానంద్, రీతూ వర్మ, అమల అక్కినేని
Director శ్రీ కార్తీక్
Producer ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు
Music జేక్స్ బిజోయ్
Run Time 2 గం 37 నిమిషాలు
Release 9 సెప్టెంబర్ 2022

వరస ప్లాపులతో సతమతమవుతోన్న శర్వానంద్ నుండి వచ్చిన లేటెస్ట్ మూవీ ఒకే ఒక జీవితం. మరి ఈ సినిమాతోనైనా శర్వా హిట్ అందుకోగలడా? చూద్దాం.

కథ:

ఆది (శర్వా), చైతన్య (వెన్నెల కిషోర్), శీను (ప్రియదర్శి)లు చిన్నతనం నుండే మంచి స్నేహితులు. మరోవైపు పాల్ (నాజర్) అనే సైంటిస్ట్ టైం ట్రావెల్ పై ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. అయితే ఒకానొక సందర్భంలో ఆది అండ్ బ్యాచ్, పాల్ ను కలుస్తారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ ను నమ్మిస్తాడు.

వారి పూర్తవ్వని కలల్ని సాకారం చేసుకోవడానికి వారిని తమ బాల్యపు రోజులకు పంపిస్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది? ఆది అండ్ బ్యాచ్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు?

నటీనటులు:

ఎప్పట్లానే శర్వానంద్ చాలా సహజంగా తన పాత్రను చేసుకుంటూ పోయాడు. సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో శర్వా ఎంత మంచి నటుడు అన్నది మరోసారి ప్రూవ్ అవుతుంది. అమల అక్కినేని, తన కొడుకుపై అపారమైన ప్రేమ ఉన్న తల్లిగా బాగా చేసింది. ముఖ్యంగా అమల-శర్వా మధ్య వచ్చే సన్నివేశాలు సహజంగా ఉంటాయి.

ప్రియదర్శి, వెన్నెల కిషోర్… శర్వానంద్ స్నేహితులుగా మంచి కామెడీ పంచారు. ముగ్గురి స్నేహ బంధం రియలిస్టిక్ గా చూపించాడు దర్శకుడు. రీతూ వర్మకు పెద్దగా స్కోప్ దక్కలేదు. ఉన్నంతలో పర్వాలేదు. నాజర్ కూడా బాగానే చేసాడు. ఇక ముగ్గురు చైల్డ్ ఆర్టిస్ట్ లు చాలా సహజంగా నటించడం విశేషం.

సాంకేతిక నిపుణులు:

ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో ఎమోషనల్ యాంగిల్ ను మిక్స్ చేయాలన్న దర్శకుడి ఆలోచనను మెచ్చుకోవాల్సిందే. తన మదిలో మెదిలిన ఆలోచనను తెర మీదకు తీసుకురావడంలో విజయవంతమయ్యాడు.

సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ నీట్ గా సాగింది. రెండు టైమ్ ఫ్రేమ్స్ ను చక్కగా చూపించాడు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ చిత్రానికి కచ్చితంగా ప్లస్ అయింది. తరుణ్ భాస్కర్ అందించిన తెలుగు డైలాగ్స్ మెప్పిస్తాయి. ఇక గ్రాఫిక్స్ వర్క్ కూడా డీసెంట్ గానే ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

పాజిటివ్ పాయింట్స్:

  • కాన్సెప్ట్
  • దర్శకత్వం
  • స్క్రీన్ ప్లే

నెగటివ్ పాయింట్స్:

  • ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లో వచ్చే ల్యాగ్ సీన్స్

విశ్లేషణ:

మొత్తంగా చూసుకుంటే ఒకే ఒక జీవితం డీసెంట్ గా సాగే సైన్స్ ఫిక్షన్ చిత్రం. మధ్యమధ్యలో వచ్చే ఎమోషనల్ ఎపిసోడ్స్ చిత్రానికి ప్లస్ గా మారాయి. శర్వానంద్ ఎప్పటినుండో చూస్తోన్న విజయం ఈ చిత్రం ద్వారా దక్కే అవకాశాలున్నాయి.

తెలగుబులెటిన్ రేటింగ్: 2.75/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారు: వివాదాస్పదమైన రామ్ దేవ్ వ్యాఖ్యలు

ప్రముఖ యోగ గురు రామ్ దేవ్ బాబా మహిళలపై చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదమయ్యాయి. మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారని అన్నారు. మహారాష్ట్రలోని ఠాణేలో పతంజలి...

కీర్తి భట్‌పై సింపతీ వేవ్.! బిగ్ బాస్ విన్నర్‌ని చేస్తుందా.?

కీర్తి భట్.! బుల్లితెర నటీమణి.! ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్‌లో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ అని చెప్పొచ్చు. చేతి వేలికి...

కాంతారా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..! ఓటీటీలో ‘వరాహరూపం’లో ఒరిజినల్ వెర్షన్

సంచలన విజయం సాధించిన ‘కాంతారా’ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా క్లైమాక్స్ లో వచ్చే ‘వరాహరూపం’ సినిమాకే హైలైట్ గా నిలిచింది. అయితే.. తమ...

మోక్షజ్ఞ ఎంట్రీ షురూ..! సినిమాపై.. దర్శకుడిపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

నందమూరి అభిమానుల ఎదురుచూపులకు తెర దించుతూ నటసింహం బాలకృష్ణ కీలక అనౌన్స్ మెంట్ చేశారు. తనయుడు నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రానికి ముహూర్తం కుదిరిందనే కీలక అప్డేట్...

నటీమణులపై అసభ్యకర పోస్టులు… అనసూయ ఫిర్యాదు… నిందితుడి అరెస్ట్

సినీ నటులు, యాంకర్లు అని తేడా లేకుండా సెలబ్రిటీల ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్య పదజాలంతో సామజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతోన్న వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు...

రాజకీయం

టీడీపీ ఎమ్మెల్యే గంటా వైసీపీలో చేరబోతున్నారా.?

మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో, సూచనలతో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారట. అసలు గంటా శ్రీనివాసరావు టీడీపీలోనే వున్నారా.? చాలామందికి వస్తోన్న డౌట్ ఇది. 2019...

ఛాలెంజ్ విసురుతున్నా.. ఈసారి మీరెలా గెలుస్తారో చూస్తా..: పవన్ కల్యాణ్

‘ఎవరికి అన్యాయం జరిగినా స్పందిస్తాం.. మాకు ఓట్లు వేసినా.. వేయకపోయినా అండగా ఉంటాం’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత బాధితులకు...

‘సీకే పల్లి పీఎస్ ముందు పరిటాల సునీత, శ్రీరామ్ బైఠాయింపు..’ పరిస్థితి ఉద్రిక్తత

సత్యసాయి జిల్లా సీకే పల్లి పోలిస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్ధసారధి...

ముఖ్యమంత్రి అజ్ఞానంలో వుంటారు.! జనసేనాని సంచలన వ్యాఖ్యలు.!

‘నేను ఉద్దానం ఎప్పుడు వెళ్ళానో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియకపోవడం శోచనీయం. ఏమీ తెలియకుండానే ఆయన ఏవేవో మాట్లాడేస్తుంటారు నా గురించి. ఆయన అలా అజ్ఞానంలో వుంటారు....

జస్ట్ ఆస్కింగ్: క్రమశిక్షణ అంటే బూతులు తిట్టడమా.?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాలుగు మంచి మాటలు చెప్పారు. ఉన్నత పదవుల్లో వున్నవాళ్ళు మంచి మాటలు చెప్పాలి. వాటిని ప్రజలు ఆచరించేలా చూడాలి. అంతకన్నా...

ఎక్కువ చదివినవి

‘ఫోన్ కాల్ వస్తే డొనేషన్లు కట్టలేదని చెప్పండి.. ప్లీజ్’ తల్లిదండ్రులకు ఫోన్లు

‘మీ అబ్బాయి/అమ్మాయి మా కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఎవరైనా ఫోన్ చేసి డొనేషన్ కట్టారా..? అంటే కట్టలేదని చెప్పండి..’ అని తల్లదండ్రులకు ఓ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. తెలంగాణ మంత్రి...

బెంబేలెత్తిస్తున్న ‘అవతార్-2’ టికెట్ ధరలు..! దేశంలో ఎంతంటే..

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా అవతార్2.  ది వే ఆఫ్ వాటర్ పేరుతో విడుదలవుతున్న సినిమాకు జేమ్స్ కామెరూన్ దర్శకుడు. ఇటివల రిలీజైన రెండో టీజర్ హీట్ పెంచుతోంది....

‘విలక్షణ వ్యక్తిత్వం మీ సొంతం’.. చిరంజీవికి ప్రధాని మోదీ ప్రశంసలు..

మెగాస్టార్ చిరంజీవిపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల జల్లులు కురిపించారు. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో భాగంగా చిరంజీవికి ‘ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్...

లవ్యూ నాన్నా..! తండ్రి మృతిపై మహేశ్ బాబు ఎమోషనల్ పోస్ట్

సినీ దిగ్గజం సూపర్ స్టార్ కృష్ణ మృతి తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. అంతకంటే ఎక్కువగా తండ్రి మృతి హీరో మహేశ్ బాబుకు మరింత వేదన మిగిల్చింది...

కాపు సంక్షేమ భవనానికి స్థలం కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం

కాపు సామాజికవర్గ సంక్షేమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని గాజులరామారం గాలిపోచమ్మ బస్తీలో ‘శ్రీకృష్ణ దేవరాయ కాపు సంక్షేమ భవనం’ కోసం రెండు ఎకరాల స్థలం...