Bill Gates: ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఈక్రమంలో ‘చాయ్’ తాగుతూ ఎంజాయ్ చేశారు. భారత్ లో ఎక్కడికక్కడే ఆవిష్కరణలు కనిపిస్తాయని కొనియాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఫేమస్ అయిన డాలీ చాయ్ వాలా వద్దకు బిల్ గేట్స్ వెళ్లారు. ‘వన్ చాయ్ ప్లీజ్’ అని టీ ఆర్డర్ చేశారు. దీంతో డాలీ తనదైన శైలిలో టీ తయారు చేశాడు. దీనిని బిల్ గేట్స్ ఆసక్తిగా తిలకించారు. అనంతరం చాయ్ తాగారు. టీ తాగుతూ ‘చాయ్ పే చర్చా కోసం ఎదురు చూస్తున్నా. అద్భుతమైన ఆవిష్కరణలెన్నో భారత్ లో ఉన్నాయి. చివరకి కప్ టీలో కూడా. ఎంతో అందంగా టీ చేశాడ’ని’ అన్నారు.
డాలీ టీ చేసే విధానానాన్ని బిల్ ఎంతో ఆసక్తిగా తిలకించారు. తన పర్యటనలో భాగంగా హైదరాబాద్ లోని మైక్రోసాఫ్ట్ డెవలెప్ మెంట్ సెంటర్ ను సందర్శించారు.
View this post on Instagram