Switch to English

దత్త పుత్రుడు వర్సెస్ నాలుగో పెళ్ళాం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘కార్లన్నాడు.. పెళ్ళాలన్నాడు.. ఇంట్లో ఇల్లాలన్నాడు.. భార్యలన్నాడు.. నోటికి ఏదొస్తే అది.. నోటికొచ్చినట్లు వాగేశాడు. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాడు. చివరికి నాలుగో పెళ్ళాం అయి కూర్చున్నాడు..’ ఇదీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి, ఆఫ్ ది రికార్డుగా వైసీపీ నాయకులే వాపోతున్న తీరు.

పైకి గట్టిగా అనలేరు.! అందుకే, లోలోపల గింజుకుంటున్నారు. తమలో తాము రగిలిపోతున్నారు. వైసీపీ అభిమానులైతే, నోరెత్తలేకపోతున్నారు.! ఇదంతా ‘నాలుగో పెళ్ళాం’ ఎఫెక్ట్.!

తెగేదాకా లాగితే ఏమవుతుంది.? ఇదిగో, నాలుగో పెళ్ళాం అయి.. మూలన కూర్చోవాల్సి వస్తుంది.! ప్యాకేజీ స్టార్.. దత్త పుత్రుడు.. ఇలా పవన్ కళ్యాణ్ మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన రాజకీయ విమర్శలు అన్నీ ఇన్నీ కావు.

సరే, ప్యాకేజీ స్టార్.. అదో లెక్క. దత్త పుత్రుడన్నమాట సబబు కాదుగానీ, అదీ సరిపెట్టుకోవచ్చు.. దిక్కుమాలిన రాజకీయాలు కదా.. దిగిజారుడు విమర్శ.. అని సరిపెట్టుకోవచ్చు.

కానీ, ‘హైద్రాబాద్‌లో ఇల్లు.. కానీ, ఆ ఇంట్లో ఇల్లాలు మూడేళ్ళకోసారి మారిపోతుంది..’ అనడమేంటి.? ‘కార్లు మార్చినట్లు భార్యల్ని మార్చుతాడు..’ అనడమేంటి.? ‘నలుగురు నలుగురు పెళ్ళాలు..’ అని విమర్శించడమేంటి.?

నిన్ను కన్నది ఓ ఆడది.! ఆమె కూడా ఇంకొకరికి భార్య. ఆమెను పెళ్ళాం అంటే బావుంటుందా.? ఈమాత్రం ఇంగితం లేకుండా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలా ముఖ్యమంత్రి అయిపోయారు.? అలాంటి వ్యక్తిని ఎలా జనం ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారు.? ఈ విషయాలన్నీ చర్చనీయాంశమవుతున్నాయిప్పుడు.

‘ముఖ్యమంత్రిని పట్టుకుని పెళ్ళాం.. అంటావా.?’ అంటూ వైసీపీ గుస్సా అవుతోంది.! విపక్ష నేతను పట్టుకుని, ‘దత్త పుత్రుడు’, ‘ప్యాకేజీ స్టార్’ అనడం సబబా.? ఓ రాజకీయ పార్టీ అధినేత భార్య మీద ‘పెళ్ళాం’ అనే కామెంట్ ఎలా పాస్ చేస్తావ్.?

పవన్ కళ్యాణ్ గట్టిగానే అడిగారు.. అదీ, వైఎస్ జగన్ సతీమణి భారతి గార్ని.! ‘మేడమ్ భారతిగారూ.. మీ భర్త, మా ఇంట్లోని ఆడవాళ్ళపై పెళ్ళాలనే కామెంట్ చేస్తున్నారు. మేం, మిమ్మల్ని అలా అంటే బాగోదు కదా..’ అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడాన్ని ఎవరు మాత్రం తప్పు పట్టగలరు.?

వైసీపీ క్యాడర్ ఇప్పుడు ఏడ్చి ఉపయోగం లేదు. వైసీపీ నేతలు ఇప్పుడు బుకాయించి లాభం లేదు.! కంట్రోల్ చేయడానికి వీల్లేనంతగా వైఎస్ జగన్ ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది.! ‘నాలుగో పెళ్ళాం’ అనే మాట, రాజకీయాల్లో ఇంతవరకు ఏ రాజకీయ ప్రముఖుడూ పడలేదు. అందునా, ముఖ్యమంత్రి పదవిలో వున్న వ్యక్తికి.. ఇది ఏమాత్రం జీర్ణించుకోలేని పరిస్థితి. చేసుకున్నోడికి చేసుకున్నంత.!

ఇక్కడితో ఆగితే మంచిదే.! లేదూ, వైఎస్ జగన్ ఇంకా చెలరేగిపోతే, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నోటి నుంచి ఇంకెంత తీవ్రమైన మాటలు వస్తాయో.! అవి విన్నాక వైసీపీ క్యాడర్ ఇంకేమైపోతుందో.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...