అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే ట్రంప్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న బైడెన్ ఇటీవల మరోసారి ట్రంప్ ను అసమర్థ పాలకుడు అంటూ విమర్శించాడు. కరోనా ఈ స్థాయిలో పెరగడంకు కారణం ట్రంప్ అసమర్థత అన్నాడు.
తాను అధికారంలోకి వస్తే కరోనా నియంత్రణ కోసం వెంటనే ఓ జాతీయ విధానాన్ని రూపొందిస్తాను అంటూ హామీ ఇచ్చాడు. కరోనాతో పోరాడుతున్న ప్రతి ఒక్కరి బాధ్యతను తాను తీసుకుంటానంటూ చెప్పుకొచ్చాడు. అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే వ్యాక్సిన్ తయారీ కోసం ఎక్కవ శ్రద్ద పెట్టడంతో పాటు ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామంటూ హామీ ఇచ్చాడు. ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరీ చిల్లరగా అయ్యాయి అంటూ అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఒక వైపు ట్రంప్ మరో వైపు బైడెన్లు ఇద్దరు కూడా చాలా చీప్ గా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న ట్రంప్ మరియు బైబెన్ లు ఇద్దరు కూడా హోరా హోరీగా ప్రచారం అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువ అనే విషయంలో క్లారిటీ రావడం లేదు.
861962 300231An intriguing discussion will probably be worth comment. I feel that you basically write much much more about this subject, it may become a taboo topic but generally consumers are inadequate to communicate in on such topics. To yet another. Cheers 294380
494482 501310Thank her so a lot! This line is move before dovetail crazy, altarpiece rather act like habitual the economizing – what entrepreneur groovy night until deal with starting a trade. 999680