ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్ ను బీసీజీ ఎదుర్కొంటుందా? ఈ మహమ్మారి వైరస్ ను నిరోధించే సామర్థ్యం బీసీజీ టీకాకు ఉందా? ప్రస్తుతం దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. న్యూయార్క్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ బయాలజీ సైన్సెస్ నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికరమైన ఫలితాలు వెలుగుచూశాయి. టీబీ నిరోధానికి వేసే బీసీజీ టాకా కొంతవరకు కరోనా వైరస్ ను నిరోధిస్తుందని పరిశోధకులు గుర్తించారు.
బీసీజీ టీకా అమల్లో ఉన్న దేశాలతో పోలిస్తే.. ఇది అమల్లో లేని దేశాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉండటమే ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు. ప్రపంచంలో తొలిసారిగా 1920లో ఈ టీకా వేయడం ప్రారంభమైంది. బిడ్డ పుట్టిన తర్వాత ఆరునెలల్లోపు ఈ టీకా వేయాల్సి ఉంటుంది. బ్రెజిల్ లో దీనిని 1920 నుంచి వేయడం మొదలుకాగా, జపాన్ లో 1947 నుంచి ఈ టీకా వేస్తున్నారు. అంటే ఈ రెండుదేశాల్లో చాలామందికి ఈ టీకా వేసినట్టే. ఆశ్చర్యకరంగా ఈ రెండు దేశాల్లో కరోనా కేసులు కూడా తక్కువగానే నమోదయ్యాయి. మిగిలిన దేశాలతో పోలిస్తే ఇక్కడ కరోనా వ్యాప్తి 10 రెట్లు తక్కువగా ఉన్నట్టు గుర్తించారు.
ఇక ఇరాన్ లో 1984 నుంచి ఈ టీకా వేస్తున్నారు. అంటే.. ప్రస్తుతం 36 ఏళ్ల పైబడిన వయసువారికి ఇరాన్ లో బీసీజీ టీకా వేయలేదు. దీంతో ఇక్కడ కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. ఇక ఈ టీకా అస్సలు లేని అమెరికా, నెదర్లాండ్స్, ఇటలీ, లెబనాన్, బెల్జియం వంటి దేశాల్లో కరోనా కేసులు వెల్లువలా వెలుగుచూస్తున్నాయి. ఇక్కడ నాలుగు రెట్లు అధికంగా కరోనా ప్రభావం ఉందని నిర్ధారణకు వచ్చారు.
ఇక మన దేశానికి వస్తే.. 1948లో పైలట్ ప్రాజెక్టుగా బీసీజీ టీకా వేయడాన్ని ప్రారంభించగా.. తదుపరి సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న స్కూళ్లలో ఈ టీకా వేసే ప్రక్రియ మొదలైంది. 1962లో జాతీయ టీబీ కార్యక్రమాన్ని ప్రారంభించి, శిశువు పుట్టిన తర్వాత ఆరునెలల్లోపు ఈ టీకా వేయడం తప్పనిసరి చేశారు. ఫలితంగా భారత్ లో చాలామందికి బీసీజీ రక్షణ ఉంది. ఈ నేపథ్యంలో మన దేశంలో కూడా కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి కరోనాపై బీసీజీ కొంతవరకు పోరాడుతోందని ఈ అధ్యయనం ద్వారా నిర్ధారణకు వచ్చినా.. పూర్తి స్థాయి పరిశోధన తర్వాత దీనిపై కచ్చితమైన అంచనాకు రాగలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
318648 574179Howdy! Would you mind if I share your weblog with my twitter group? Theres a lot of men and women that I think would truly enjoy your content. Please let me know. Thanks 99904
81519 357918I adore reading and I conceive this web site got some genuinely utilitarian stuff on it! . 632319