Switch to English

జగన్ రికార్డెడ్ సందేశానికి కారణమేంటి?

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇందుకు సంబంధించి ఓ వీడియో విడుదల చేశారు. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని, కరోనా రోగులను చిన్నచూపు చూడొద్దని, అది కూడా ఫ్లూ వంటి జ్వరమేనని పేర్కొన్నారు.

సాధారణంగా ఇలాంటి అంశాలపై ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం ఏ ముఖ్యమంత్రైనా చేస్తుంటారు. మరి జగన్ అలా కాకుండా వీడియో సందేశం ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని సందేహాలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో అయితే ఆయనపై వైరి వర్గాలు ట్రోలింగ్ కూడా చేశాయి. మీడియాను ఎదుర్కోలేని సీఎం అంటూ సెటైర్లు వేశారు. ఈ వీడియోలో మాట్లాడటానికి రిహార్సల్స్ చేశారా అంటూ వ్యంగ్య బాణాలు సంధించారు.

నిజానికి మీడియాతో మాట్లాడటానికి జగన్ అంత సుముఖత చూపించరు. ఆయనకు సొంత మీడియా హౌస్ ఉన్నప్పటికీ, మీడియావాళ్లతో ఇంటరాక్ట్ కావడానికి ఆసక్తి కనబరచరు. సీఎంగా లేనప్పుడు కూడా జాతీయ మీడియాతో మాట్లాడటానికే జగన్ ప్రాధాన్యత చూపించేవారు. ఇక సీఎంగా పగ్గాలు చేపట్టిన 10 నెలల తర్వాతే ఆయన మీడియా ముందుకొచ్చారు.

కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో ఎస్ఈసీ వైఖరిపై మాట్లాడటానికి మీడియా ముందుకొచ్చారు. తర్వాత రెండు సార్లు కరోనాపై మాట్లాడారు. ఈ సందర్భంగా కొన్ని అంశాల్లో తప్పలు మాట్లాడటంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో బుధవారం తాను చెప్పదలుచుకుంది రికార్డు చేసి, ఆ వీడియోను ఐఅండ్ పీఆర్ ద్వారా మీడియాకు విడుదల చేశారు. ఇది జర్నలిస్టు సర్కిళ్లలో చర్చనీయాంశమైంది.

దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు, సెటైర్లు వెల్లువెత్తాయి. అయితే, జగన్ రికార్డెడ్ వీడియో విడుదల చేయడానికి కారణం మీడియా ఫోబియా కాదని, కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకునే చర్యల్లో భాగంగానే ప్రెస్ మీట్ పెట్టకుండా జగన్ ఇలా ప్రజలనుద్దేశించి మాట్లాడారని సమాచారం. ప్రెస్ మీట్ అంటే వివిధ మీడియా సంస్థలకు చెందిన ప్రతినిధులు, కెమెరామెన్లు పెద్ద సంఖ్యలో వస్తారని, ప్రస్తుత పరిస్థితుల్లో అది మంచిది కాదనే ఉద్దేశంతోనే జగన్ వీడియో సందేశం ఇచ్చారని చెబుతున్నారు.

వాస్తవానికి జగన్ ప్రెస్ మీట్ పెట్టినా కూడా మీడియా ప్రతినిధులకు ప్రశ్నలు అడగే ఛాన్స్ ఇవ్వరు. తాను చెప్పాలనుకున్నది చెప్పి వెళ్లిపోతారు. చాలా అరుదుగా మాత్రమే ప్రశ్నలకు అవకాశం ఇస్తారు. ఈ నేపథ్యంలో ఆయన నేరుగా ప్రెస్ మీట్ పెట్టినా.. ఇలా వీడియో సందేశం విడుదల చేసినా ఒకటే కదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సినిమా

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్...

రచయితపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు

ఎస్సీ ఎస్టీలను కించపర్చే విధంగా ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రాసిన పద్యం ఉంది అంటూ దళిత సంఘాల నేతలు మండి పడుతున్నారు. మడి కట్టుకుని ఉండటం...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

లాక్ డౌన్ రెండో కోణం: 25 ఏళ్లలో కానిది.. రెండు నెలల్లో అయింది

ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు చాలా దేశాలు లాక్ డౌన్ బాట పట్టాయి. మనదేశంలో కూడా లాక్ డౌన్ విధించి రెండు నెలలు దాటింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నాలుగో దశ...

‘ఆర్ఆర్ఆర్’ టీంకి బిగ్ షాకిచ్చిన దిల్ రాజు.!

దర్శకేంద్రుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా రూపొందుతున్న సినిమా 'ఆర్ఆర్ఆర్ - రౌద్రం రణం రుషితం'. లాక్ డౌన్...

చంద్రబాబు: స్వపక్షాన్నీ కొనక తప్పదా?

ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితుల్లో ఉంది. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీని తట్టుకుని మరో నాలుగేళ్లు ఎలా పోరాడాలా అని...

జూన్ 6న ఆన్లైన్లో వర్మ ‘క్లైమాక్స్’.. టికెట్ రూ.100.!!

వివాదాస్పద సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ పోర్న్ స్టార్ మియా మల్కోవాని లీడ్ గా పెట్టి తీసిన రసభరిత చిత్రం ‘క్లైమాక్స్’. ఆద్యంతం మల్కోవా అందాలను చూపిస్తూ తీసిన ఈ సినిమా మొదటి...

ఫ్లాష్ న్యూస్: ఏసీలో మంటలు.. బీజేడీ నేత మృతి

ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాలో గోషనిన్‌గావ్‌లో నిన్న ఉదయం బీజేడీ నేత అలేఖ్‌ చౌదరి మంటల్లో చిక్కుకుని మృతి చెందాడు. ఆయన్ను కాపాడేందుకు వెళ్లిన మరో ఇద్దరు కూడా మంటల్లో చిక్కుకుని ఊపిరి...