Switch to English

అరుణ్ ఆదిత్య – అప్సర రాణి జంటగా కొత్త సినిమా ప్రారంభం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,847FansLike
57,764FollowersFollow

అరుణ్ ఆదిత్య – అప్సర రాణి జంటగా, వినూత్న సెల్యూలాయిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై కృష్ణబాబు దర్శకత్వంలో కొత్త సినిమా ప్రొడక్షన్ నం.1 ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మం ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగింది. జస్ట్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణ.. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ డైరెక్ట‌ర్ వి. సముద్ర తొలిషాట్‌కు గౌరవ దర్శకత్వం వ‌హించ‌గా, ప్ర‌ముఖ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ హీరోయిన్‌పై క్లాప్ కొట్టారు. తొలిషాట్‌కు సంగీత దర్శకురాలు యం యం శ్రీ‌లేఖ కెమెరా స్విచ్చాన్ చేశారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు, మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా డైరెక్టర్ కృష్ణబాబు మాట్లాడుతూ.. ”సినిమా ప్రారంభోత్స‌వం ఒక పండ‌గ‌గా జ‌రగ‌డం సంతోషంగా ఉంది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అతిథుల‌కు ధ‌న్య‌వాదాలు. ఏప్రిల్ 20 నుంచి 10 రోజుల పాటు షెడ్యూల్ చేస్తాం. స‌బ్జెక్టు బాగా వ‌చ్చింది. అరుణ్ ఆదిత్య – అప్సర రాణి జంట‌గా చేస్తున్న‌ ఈ సినిమా ఖ‌చ్చితంగా అంద‌రికి న‌చ్చుతుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తాం..” అని తెలిపారు.

అప్సరరాణి మాట్లాడుతూ… ”మంచి రోజు మంచి సినిమా ప్రారంభమైంది. సంతోషంగా ఉంది. నా కెరీర్‌కు ఈ సినిమా మంచి హెల్ప్ అవుతుంద‌న్న నమ్మకంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్‌కు, డైరెక్ట‌ర్‌కు ధ‌న్య‌వాదాలు..” అని తెలిపారు.

మ్యూజిక్ డైరెక్టర్ యం యం శ్రీలేఖ మాట్లాడుతూ.. తొలిషాట్‌కు కెమెరా స్విచ్చాన్ చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా పాటలు చాలా బాగా వ‌చ్చాయి. అంద‌రిని ఆక‌ట్టుకుంటాయి, స్క్రిప్ట్ అద్భుతంగా ఉంది. అంద‌రికి న‌చ్చుతుంది..” అని తెలిపారు.

ఎగ్జిక్యూటివ్ వెంకటేష్ మాట్లాడుతూ… ఒక అద్భుతం జరుగుతుందంటే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తాయని ఈ సందర్బం రుజువు చేసింది. ఒక టాలెంట్ ఉన్న డైరెక్ట‌ర్ ఈ సినిమాను ఒక తపస్సులా చేస్తున్నాడు. కృష్ణబాబు స్క్రిప్టును అద్భుతంగా రెడీ చేశారు. ఈ ప్రాజెక్టును ఎంతో నిజాయితీగా, పర్ఫెక్ట్ సిద్ధం చేశారు. హీరో అరుణ్ ఆదిత్య ఈ ప్రాజెక్టుకు దొరికిన ఆణిముత్యం, హీరోయిన్ అప్సర రాణి కూడా నిబ‌ద్ద‌త‌తో, అంకిత‌భావంతో ప‌ని చేసే వ్య‌క్తి. ఆమె డెడికేష‌న్ ఈ సినిమాకు ఎంతో హెల్ప్ అవుతుంది..” అని తెలిపారు.

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సీఎన్ గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ… చిత్ర‌యూనిట్‌కు బెస్టాఫ్ ల‌క్ చెప్పారు. ఎంతో ప‌ట్టుద‌ల‌తో సినిమా చేస్తున్న చిత్ర‌యూనిట్ విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు.

సినిమా

వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి...

చట్ట విరుద్దంగా రానా ఏం చేయలేదు

బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్‌పై కేసులు పెడుతున్న తెలంగాణ పోలీసులు ఇటీవల సినిమా హీరోలు, హీరోయిన్స్‌పైనా కేసులు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి....

విజయ్ దేవరకొండపై కేసు.. స్పందించిన టీమ్..!

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీస్ అందరిపైన కేసు ఫైల్ చేసి పోలీసులు నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. వారి వల్ల ఎంతోమంది ప్రజలు...

ఉపాసన.. జాన్వి.. క్రేజీ పిక్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్...

తెలుగు సినిమాకు మహిళ కమీషన్‌ వార్నింగ్‌

కమర్షియల్‌ సినిమాల పేరుతో మహిళలను కించ పరుస్తున్న ఫిల్మ్‌ మేకర్స్‌పై తెలంగాణ రాష్ట్ర మహిళ కమీషన్‌ అసహనం వ్యక్తం చేసింది. ఇటీవల కొన్ని తెలుగు సినిమాల్లోని...

రాజకీయం

టీడీపీ కార్యకర్తే అధినేత

కార్యకర్తలే పార్టీ అధినేతలు అనే మాటను తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అయింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కోసం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన...

జన్మ భూమి, కర్మ భూమి.! నరేంద్ర మోడీ అలా.! పవన్ కళ్యాణ్ ఇలా .!

దేశ రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు దేశ ప్రజానీకం. అందులో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాగా, మరొకరు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని...

34 రోజులు నిరంతరాయంగా రామ్ 22..!

ఉస్తాద్ రామ్ లేటెస్ట్ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్...

కొల్లేరు సమస్య.. వైఎస్సార్ నుంచి వైసీపీ వరకు..!

ఆపరేషన్ కొల్లేరు పేరుతో 2006 లో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం భయానక రీతిలో నాటు బాంబులతో కొల్లేరు చెరువు గట్లు పేల్చేసిన విధానం నుంచి వైసీపీ నాయకుడు కొల్లేరు పూర్వ వైభవం...

వైసీపీకి షాక్: ముందు ఎమ్మెల్సీలు.. ఆ తర్వాతే ఎమ్మెల్యేలు.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తాజాగా ఓ ఎమ్మెల్సీ గుడ్ బై చెప్పేశారు. అంతకు ముందు నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి దూరమయ్యారు. ఇంకోపక్క, వైసీపీ నుంచి ముందు ముందు మరిన్ని వలసలు తప్పవన్న చర్చ...

ఎక్కువ చదివినవి

బతికినంత కాలం పవన్ కల్యాణ్‌ సేవకుడిగా ఉంటాః నాగబాబు

జనసేన 12వ ఆవిర్భావ సభ పిఠాపురంలో గ్రాండ్ గా కొనసాగుతోంది. ఈ సభలో పార్టీ అగ్రనేత నాగబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బతికినంత కాలం పవన్ కల్యాణ్‌ సేవకుడిగా ఉంటానని...

తెలుగు సినిమాకు మహిళ కమీషన్‌ వార్నింగ్‌

కమర్షియల్‌ సినిమాల పేరుతో మహిళలను కించ పరుస్తున్న ఫిల్మ్‌ మేకర్స్‌పై తెలంగాణ రాష్ట్ర మహిళ కమీషన్‌ అసహనం వ్యక్తం చేసింది. ఇటీవల కొన్ని తెలుగు సినిమాల్లోని పాటల్లో వేస్తున్న స్టెప్స్ అసభ్యకరంగా ఉన్నాయని,...

ఇరవయ్యేళ్ళు నిద్రపో జగన్: జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సలహా.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని అసెంబ్లీకి పంపిన పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ ‘జయకేతనం’ పేరుతో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నిక జనసేన కీలక నేత...

ఆరేళ్లుగా పోరాడుతున్నా.. నిందితులు బయటే తిరుగుతున్నారుః వైఎస్ సునీత

తన తండ్రి చనిపోయి ఆరేళ్లు గడుస్తోందని.. న్యాయం కోసం తాను ఇంకా పోరాడుతున్నట్టు వైఎస్ సునీత తెలిపారు. తన తండ్రి చావుకు కారణమైన వారిలో ఒక్కరు మాత్రమే జైలులో ఉన్నారని.. మిగతా వారంతా...

దేశానికి ఉపయోగపడేలా పవన్ ఎదగాలి : నాదెండ్ల మనోహర్

పిఠాపురం శివారు చిత్రాడలో జనసేన జయకేతనంగా జనసేన ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలో పార్టీ నేతలంతా పవన్ తో పనిచేస్తున్న సమయంలో తాము పొందిన అనుభూతి ఆయన విధి విధానాల గురించి...