Switch to English

‘ఓం భీమ్ బుష్’ ఆడియన్స్ ఖచ్చితంగా చాలా ఎంజాయ్ చేస్తారు: హీరో శ్రీవిష్ణు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ‘హుషారు’ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన అవుట్ అండ్ అవుట్- ఎంటర్‌టైనర్ ‘ఓం భీమ్ బుష్’ తో ప్రేక్షకులని ఆలరించబోతున్నారు. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండగా, యువి క్రియేషన్స్ సమర్పిస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ‘ఓం భీమ్ బుష్’ మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో శ్రీవిష్ణు విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

‘ఓం భీమ్ బుష్’ టైటిల్ టీజర్ ట్రైలర్ ఇలా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ రావడం ఎలా అనిపించింది ?

చాలా ఆనందంగా వుంది. ఇందులో చాలా కొత్త పాయింట్, ఐడియా చెప్పడం జరిగింది. ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్. చాలా సార్లు కొత్త పాయింట్ దొరికినప్పుడు ఒకటే జోనర్ కి కట్టుబడి ఉండిపోతాం. అలా ఒకటే జోనర్ కి పరిమితం కాకుండా డిఫరెంట్ గా ప్రజెంట్ చేస్తూ కంప్లీట్ ఎంటర్ టైనర్ గా చేశాం. ఖచ్చితంగా అందరూ ఎంటర్ టైన్ అవుతారు. మేము చెప్పే కొత్త పాయింట్ రివిల్ అయినపుడు ఆడియన్స్ తప్పకుండా ఎంటర్ టైన్ అవుతారు. ఆ సమయానికి కథలో మా పాత్రల పరిస్థితి ఎలా వున్నప్పటికీ సినిమా చూస్తున్న ఆడియన్స్ మాత్రం హిలేరియస్ గా ఎంజాయ్ చేస్తారు.

ఈ కథ అనుకున్నప్పుడే ‘ఓం భీమ్ బుష్’ టైటిల్ ఫిక్స్ చేశారా ?

రెండు, మూడు టైటిల్స్ అనుకున్నాం. అందులో ఒకటి ఇంగ్లీష్ లో వస్తుంది. అయితే నేను మాత్రం ‘ఓం భీమ్ బుష్’ వైపే వున్నాను. ఇది చాలా క్యాచి టైటిల్. చిన్నప్పుడు మనం మ్యాజిక్కులు చేయడానికి వాడే మంత్రం( నవ్వుతూ).నిర్మాత వంశీ గారు ఫస్ట్ కట్ చూసి ‘ఓం భీమ్ బుష్’ పేరే ఫిక్స్ అయిపోదాం అన్నారు. అలా ‘ఓం భీమ్ బుష్’నే ఫైనల్ చేశాం. టైటిల్ కి ఇంత మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. టైటిల్స్ విషయంలో నేను ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాను. సినిమాని ముందు ప్రేక్షకుల దగ్గరకి తీసుకెళ్ళేది అదే కదా.

ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలకి కథలో కొత్త పాయింట్ ఉన్నప్పటికీ నటన, డైలాగ్స్ విషయానికి వచ్చేసరికి రెగ్యులర్ సినిమాలా అయిపోయే అవకాశం వుంది.. ‘ఓం భీమ్ బుష్’ లో ఆ ఒరిజినాలిటీ ఎలా ఉండబోతుంది ?

పాయింట్ పరంగా చూసుకుంటే ‘ఓం భీమ్ బుష్’లాంటి పాయింట్ ఇప్పటివరకూ రాలేదు. ఇందులో మిస్టరీ, థ్రిల్, ఇలా అన్నీ ఎలిమెంట్స్ వుంటాయి. ఇవన్నీ ఎలా వర్క్ అవుట్ అవుతాయో ప్రేక్షలులు చూస్తున్నపుడు తెలుస్తుంది. అయితే ఎంటర్ టైన్మెంట్ పక్కాగా వుంటుంది. మిగతా ఏదున్నా అది బోనస్ అని ఆశిస్తున్నాను. ప్రేక్షకులు కూడా ఎంటర్ టైన్మెంట్ తో పాటు ఇంకొకటి బావుందని అంటారు. అది ఏమిటనేది సినిమా విడుదలైన తర్వాత తెలుస్తుంది.

సామజవరగమన యునానిమస్ బ్లాక్ బస్టర్ అయ్యింది కదా.. ఆ సినిమా తర్వాత మార్కెట్ కాపాడుకోవాలి, పెంచుకోవాలనే ప్రయత్నాలు చేస్తుంటారా?

నేను అలా ఎప్పుడూ ప్లాన్ చేయను. మార్కెట్ పెరగాలనే జోన్ లోకి వెళితే ఇంక దానిపైనే ద్రుష్టి వుండిపోతుంది. నేను ఎప్పుడూ కూడా నిర్మాత మన మీద పెట్టిన పెట్టుబడి పోకూడదనే విషయంపైనే ద్రుష్టి పెడతాను.

సామజవరగమన సెట్ చేసిన అంచనాలని ‘ఓం భీమ్ బుష్’ అందుకుంటుందా?

ఈ సినిమా వరకూ ‘ఓం భీమ్ బుష్’ మీద పెట్టిన పెట్టుబడికి మూడు, నాలుగు రెట్ల లాభం రావడం చాలా తృప్తిని ఇచ్చింది. దీనికి సామజవరగమన విజయం, ‘ఓం భీమ్ బుష్’ టీజర్, ట్రైలర్, యూవీ బ్యానర్ హెల్ప్ అయ్యింది. మంచి బ్యానర్ తో సినిమాలు చేయడం వారు అన్నీ విషయాల్లో శ్రద్ద తీసుకుంటారు. దాంతో నాపై కూడా ఒత్తిడి తగ్గుతుంది.

‘బ్రోచేవారు’ తర్వాత మీరు, దర్శి, రాహుల్.. కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుంది కదా.. కామెడీ విషయంలో ఒక ప్రత్యేకమైన కథని ఎంచుకోవాలనే ఒత్తిడి ఏమైనా పెరిగిందా ?

నిజానికి మేము అంత ఒత్తిడి తీసుకోలేదు. మేము ముగ్గురం రెగ్యులర్ గా కలవడం వల్ల ఏమోకానీ పెద్ద మార్పుగా ఏమీ అనిపించలేదు. సరదాగా, ముగ్గురు ఫ్రెండ్స్ మాట్లాడుకునేలా, అంత సహజంగా ఈ సినిమా చేశాం. సింగిల్ లైనర్స్ హిలేరియస్ గా వుంటాయి.

సెకండ్ హాఫ్ లో హిలేరియస్ బ్లాక్స్ ఉంటాయని విన్నాం ?

ఫస్ట్ హాఫ్ లో మూడు బ్లాకులు, సెకండ్ హాఫ్ లో రెండు బ్లాకులు ఎంటర్ టైన్మెంట్ పరంగా హిలేరియస్ గా బ్లాస్ట్ అవుతాయి. ప్రేక్షకులు హిలేరియస్ గా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్ గ్రూప్ గా చూస్తే ఇంకా అదిరిపోతుంది.

కథలో మీ ముగ్గిరి పాత్రలు ఎలా ఉండబోతున్నాయి ?

మేము సైంటిస్టులు కావాలని పీహెచ్డీ చేస్తాం. మమ్మల్ని ఎలాగైనా కాలేజీ నుంచి పంపించేయాలని స్కెచ్ వేసి పంపించేస్తారు. తర్వాత భైరవపురం అనే వూరికి వస్తాం. ఆ వూర్లో ఎదురయ్యే పరిస్థితులు, పాత్రలు హిలేరియస్ గా వుంటాయి. కాలేజీలో వున్నపుడు ఎలా అయితే కింగ్స్ లా వుండేవాళ్లమో,, ఇక్కడ కూడా అలానే కింగ్స్ లా మారుతాం. ఎక్కడున్నా కింగ్ లా బ్రతికేసే పాత్రలివి. ఈ క్రమంలో నిధిని పట్టుకునే టాస్క్ వస్తుంది. అసలు నిధి ఉందా లేదా .. మా ప్రయత్నాలు ఎలా జరిగాయనేది మిగతా కథ. చాలా సరదాగా హిలేరియస్ గా సాగే సినిమా ఇది.

దర్శకుడు శ్రీహర్ష ఈ కథ ద్వారా ఎలాంటి కొత్తదనం తీసుకొచ్చారు ? ఆయన విజన్ ని అలా అంచనా వేశారు ?

శ్రీహర్ష చెప్పిన కథకు కొంచెం కలర్ ఫుల్ గా వెళితే బావుంటుందనిపించింది. రాజ్ తోట డీవోపీ. ఆయనతో ఆరు సినిమాలు చేశాను. వాళ్ళిద్దరికి కూడా మంచి సింక్. అలాగే సంగీతం సన్నీ. తన మ్యూజిక్ నాకు చాలా ఇష్టం. ఒక అద్భుతమైన ప్రొడక్షన్ హౌస్. మంచి టీం కుదరడంతో సినిమా టెక్నికల్ గా బావుటుందని నమ్మకం. శ్రీకాంత్ ఆర్ట్ డైరెక్టర్. చాలా అద్భుతంగా చేశాడు. తను పెద్ద టెక్నిషియన్ అవుతాడు. ఇంతమంచి టీం రావడంతో దర్శకుడు విజన్ కూడా క్లియర్ గా అర్ధమైయింది.

దర్శకుడు చాలా మంది హీరోయిన్స్ వున్నారని చెప్పారు.. ట్రైలర్ లో ఒక్క హీరోయినే కనిపిస్తుంది. మిగతా వారిని దాచారా ?

దాయలేదండి. ప్రియావడ్లమాని ఓ పాటలో కనిపిస్తారు. ట్రైలర్ లో ఆయేషా ఖాన్ కనిపించారు. నిజానికి సినిమాలో ఎటుచూసినా నేను, ప్రియదర్శి, రాహులే కనిపిస్తాం. మిగతా పాత్రలు పరిమితంగా సింపుల్ గానే వుంటాయి. ఈ కథ పరంగా హీరోయిన్ ప్రాధాన్యత వుంటుంది.

దర్శి, రాహుల్ తో మళ్ళీ కలసి వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

మేము మంచి ఫ్రెండ్స్. ఈ సినిమా షూటింగ్ పూణేలో చేశాం. అక్కడ లొకేషన్ కి దగ్గర లోని ఓ పొలంలో వసతి ఏర్పాటు చేసుకొని ముగ్గురం వున్నాం. దాదాపు పదిహేనురోజులు అక్కడ వున్నాం. ఈ సినిమా షూటింగ్ ని చాలా ఆస్వాదించాం.

‘సామజవరగమన’ లా ఈ సినిమాకి పెయిడ్ ప్రిమియర్స్ ప్లాన్ చేస్తున్నారా ?

సమయం వుంది కాబట్టి ప్రిమియర్స్ వేయాలనే అయితే ఆలోచన వుంది.

కొత్త ప్రాజెక్ట్స్ ?

‘శ్వాగ్’ దాదాపు పూర్తయింది. దీంతో పాటు ఓ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాను. అలాగే గీతా ఆర్ట్స్ లో ఒక సినిమా, కోన గారితో ఒక సినిమా చేస్తున్నాను.

28 COMMENTS

  1. Elevate Your Digital Presence with Digitaleer in Phoenix

    **Empowering Your Online Success in Phoenix**

    When it comes to navigating the digital landscape in Phoenix, Digitaleer stands out as a premier digital marketing agency.

    Situated at 310 S 4th St #652, Phoenix, Arizona 85004,
    our team offers a comprehensive suite of online marketing services tailored
    to meet the unique needs of businesses in neighborhoods like Adobe
    Highlands and Arizona Hillcrest. From SEO optimization to social media management, we specialize in enhancing your digital
    presence and driving measurable results.

    **Exploring the Vibrant City of Phoenix**

    Phoenix, founded in 1867, is a thriving metropolis nestled
    in the heart of the Sonoran Desert. With a population of 1.625 million and over 591,169 households, it’s one of the
    fastest-growing cities in the United States.

    Interstate 10, a major highway that spans the country,
    serves as a vital artery connecting Phoenix to neighboring cities and states.

    **Cost of Digital Solutions and Climate in Phoenix**

    Digital solutions in Phoenix can vary depending
    on the scope and complexity of the project. On average, businesses may invest anywhere from $1,
    000 to $10,000 or more for comprehensive digital marketing services.

    As for the climate, Phoenix experiences a hot desert climate with scorching summers
    reaching highs of 110°F (43°C) and mild winters with temperatures averaging around
    60°F (16°C).

    **Discovering Phoenix’s Top Points of Interest**

    Explore these must-visit attractions in Phoenix:

    – **Arizona Boardwalk:** An entertainment district featuring restaurants, shops, and attractions like the OdySea
    Aquarium.
    – **Arizona Capitol Museum:** Learn about Arizona’s rich
    history and political heritage at this captivating museum.

    – **Arizona Falls:** A scenic waterfall and hydroelectric plant nestled in the heart of the city.

    – **Arizona Science Center:** A hands-on science museum with
    interactive exhibits and educational programs for all ages.

    – **Butterfly Wonderland:** Immerse yourself in the enchanting world of butterflies at North
    America’s largest butterfly conservatory.

    **Why Choose Digitaleer for Your Digital Marketing Needs**

    Choosing Digitaleer means partnering with a trusted ally dedicated to your online success.
    With our expertise in SEO optimization, web development, and digital advertising, we
    help businesses in Phoenix stand out in a competitive digital landscape.
    Whether you’re looking to increase brand visibility, drive
    website traffic, or boost conversions, Digitaleer
    delivers tailored solutions that drive real results and help you achieve
    your business goals.

  2. I don’t know if it’s just me or if perhaps everybody else encountering issues
    with your site. It looks like some of the written text on your posts are running off the screen.
    Can somebody else please comment and let me know if this is happening to them too?

    This may be a issue with my browser because I’ve had this happen before.
    Cheers

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

రాజకీయం

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

ఎక్కువ చదివినవి

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్...