Switch to English

మూడు రాజధానులు అలా.! 26 జిల్లాలు ఇంకెలా.?

అభివృద్ధి వికేంద్రీకరణ ముసుగులో పరిపాలనా వికేంద్రీకరణ.. అంటూ వింత నాటకానికి తెర లేపి బొక్క బోర్లా పడింది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ వాస్తవ పరిస్థితేంటీ.? రాష్ర్టానికి ఏం కావాలి.? అన్న కనీస ఇంగితం లేకుండా మూడు రాజధానుల నాటకాన్ని తెర పైకి తెచ్చి, దాదాపు రెండున్నరేళ్లుగా రాజధాని విషయంలో గందరగోళాన్ని కొనసాగిస్తూ వచ్చారు. వున్నదీ పాయె, వుంచుకున్నదీ పాయె.. అన్నట్లు తయారయింది రాష్ర్టం పరిస్థితి.

మూడు ముక్కలాటలో అడ్డంగా పేలి, ఇప్పుడు 26 ముక్కల కొత్త నాటకం షురూ చేశారు. 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ ఇకపై 26 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ కాబోతోందట. ‘పరిపాలనా సౌలభ్యం కోసం’ అని చెబుతోంది వై ఎస్ జగన్ ప్రభుత్వం. లోక్‌సభ నియోజక వర్గం యూనిట్‌గా ఈ జిల్లాల విభజన జరగబోతోందట. ఎన్నికల్లో హామీ ఇచ్చారు కనుక.. నెరవేర్చేస్తారట. కానీ, ఎలా.?

మూడు ముక్కలాట అతీ గతీ లేకుండా పోయినట్లే.. 26 జిల్లాల కథ కూడా కొన్నాళ్లు నడిచీ, నడిచీ చివరకి సార్వత్రిక ఎన్నికల ముంగట బొక్క బోర్లా పడుతుందేమో. తెలంగాణలో జిల్లాల విభజన సజావుగానే జరిగింది కాబట్టి, ఆంధ్ర ప్రదేశ్‌లోనూ జిల్లాల విభజన బహు బాగా జరిగిపోతుందనుకుంటే, పొరపాటే.

తెలంగాణ పరిస్థితులు వేరు. అక్కడి ఆర్ధిక స్థితిగతులు వేరు. అక్కడి సెంటిమెంట్లు వేరు. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక, ఆర్ధిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు వేరు. కొత్త జిల్లాల పుణ్యమా అని రాష్ర్టంపై అదనపు ఆర్ధిక భారం పడే పరిస్థితి వస్తే, బాధ్యత ఎవరిది.?

కొత్త కలెక్టరేట్లు సహా చాలా చిక్కులుంటాయ్. ఆయా ప్రాంతాల్లో సెంటిమెంట్లు.. ఆర్ధిక సమీకరణాలు.. ఇలా సెగ రాజుకోవడం ఖాయం. శ్రీకాకుళం జిల్లానే తీసుకుంటే, ఎట్టి పరిస్థితుల్లో విభజనని ఒప్పుకునేది లేదంటూ అక్కడి జనం ముక్త కంఠంతో నినదిస్తున్నారు. మరికొన్ని చోట్లా ఇదే పరిస్థితి వుంది. జిల్లాల విభజనతో చిచ్చు రేగితే, అది ముమ్మాటికీ రాష్ర్ట భవిష్యత్తుకి శాపం అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

శేఖర్ మూవీ రివ్యూ

సీనియర్ హీరో రాజశేఖర్ నుండి వచ్చిన లేటెస్ట్ చిత్రం శేఖర్. మలయాళంలో సూపర్ హిట్ అయిన జోసెఫ్ కు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రాన్ని...

#NTR31: పవర్ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మరొక అనౌన్స్మెంట్ వచ్చింది. నిన్ననే ఎన్టీఆర్ 30వ చిత్ర అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమాను...

విక్రమ్ తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్న నితిన్ ప్రొడక్షన్ హౌస్

కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ సినిమా విక్రమ్ విడుదలకు ముందు బాగానే సందడి చేస్తోంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత కమల్ హాసన్ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది....

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ఎమోషనల్ ట్వీట్

రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది ప్రేక్షకులు ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ ముందు, తర్వాత చూసారు. వీరిద్దరి మధ్యా ఫ్రెండ్షిప్ కు...

ఈ వారాంతం ఓటిటి ప్రియులకు పండగే!

మే 20 వీకండ్ అయినా కానీ థియేటర్లలో పెద్దగా సినిమాలు విడుదలవ్వలేదు. కానీ మరోవైపు ఓటిటిలో కంటెంట్ మాత్రం భారీగానే వచ్చి పడింది. ముందుగా బ్లాక్...

రాజకీయం

ఢిల్లీలో విద్యావిధానం భేష్.. దేశమంతటికీ ఎంతో అవసరం: సీఎం కేసీఆర్

ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. అనంతరం మోతీబాగ్ లోని సర్వోదయ ప్రభుత్వ పాఠశాలను కేజ్రీవాల్ స్వయంగా కేసీఆర్ కు చూపించారు. పాఠశాలలోని ప్రత్యేకలు,...

కాకినాడ జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్సీని అరెస్టు చేయాలని టీడీపీ పట్టు

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో ఆయన మాజీ డ్రైవర్ మృతదేహం లభ్యమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈనేపధ్యంలో వాస్తవాలు తెలుసుకునేందుకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ ఈరోజు కాకినాడలోని జీజీహెచ్...

వైసీపీ వింత.! ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ మృతదేహం.!

అదేంటో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా చిత్ర విచిత్రమైన వ్యవహారాలు తెరపైకొస్తుంటాయ్.! కామెడీ కాదు, సీరియస్.! అన్నట్టుగానే వుంటాయ్ ఆయా వ్యవహారాలు. వైసీపీ నేత, మాజీ మంత్రి వివేకానందరెడ్డి ‘గుండె పోటు -...

ఏపీలో ‘పవర్’ కట్.! ఇన్వర్టర్ లేదా పవన్ కళ్యాణ్.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్‌లోని తమ పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిథులతో సమావేశమయ్యారు.. మీడియా ప్రతినిథులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలిస్తున్నారు. సరిగ్గా, అదే సమయంలో ‘పవర్’ పోయింది. చిత్రమేంటంటే, రాష్ట్రంలో పరిశ్రమలకు...

’ముఖ్యమంత్రి‘ దావోస్ పర్యటనపై అంబటి రాంబాబు విసుర్లు.!

ముఖ్యమంత్రి వైఎస్ గజన్ మోహన్ రెడ్డి ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో మంత్రి అంబటి రాంబాబు, ముఖ్యమంత్రి మీద విసుర్లు వేయడమేంటి.? ఒక్క క్షణం...

ఎక్కువ చదివినవి

రంకు నేర్చిన రాజకీయం: కాముడెవరు.? రాముడెవరు.?

’రంకు‘ అనే మాటని వాడేందుకు చాలా చాలా అంతర్మధనం చెందాల్సి వస్తోంది. కానీ, తప్పని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాజవ్కీయాల్లో చిత్ర విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేని వింత ఇది. నిజానికి,...

రాశి ఫలాలు: శనివారం 21 మే 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతఋతువు వైశాఖమాసం బహుళపక్షం సూర్యోదయం: ఉ.5:33 సూర్యాస్తమయం: సా.6:15 తిథి: వైశాఖ బహుళ షష్ఠి రా.8:06 వరకు తదుపరి వైశాఖ బహుళ సప్తమి సంస్కృతవారం: స్థిరవాసరః (శనివారం) నక్షత్రము: ఉత్తరాషాఢ ఉ.5:50 వరకు...

ఏపీ: కోనసీమ జిల్లా పేరు మార్పు..! త్వరలో ప్రభుత్వం నోటిఫికేషన్..!!

ఏపీలో కొత్తగా ఏర్పాటైన కోనసీమ జిల్లా పేరు మార్చుతూ ప్రభుత్వం ప్రాధమిక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే కోనసీమ జిల్లా ఇక డా.బీఆర్.అంబేద్కర్ జిల్లాగా మారనుంది. త్వరలోనే నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది....

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ఎమోషనల్ ట్వీట్

రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది ప్రేక్షకులు ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ ముందు, తర్వాత చూసారు. వీరిద్దరి మధ్యా ఫ్రెండ్షిప్ కు మించిన బాండింగ్ ఉందన్న విషయం అర్ధమైంది....

నైజాంను నేను శాసించడం జరగదు – దిల్ రాజు

అగ్ర నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తక్కువ కాలంలోనే టాప్ నిర్మాతగా ఎదిగి అక్కడి నుండి దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. నిర్మాత అవ్వకముందు డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్...