Switch to English

కరెంటు బిల్లూ.. ఎందుకు ‘షాక్‌’ కొడుతున్నావ్‌.?

కరెంటు బిల్లులకి కరోనా మాయరోగమొచ్చింది. ఔను, ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం ఇప్పుడు కరెంటు బిల్లుల్ని చూసి గుడ్లు తేలేస్తున్నారు. ‘ఇళ్ళ అద్దెల గురించి యజమానులు, అద్దెకుండేవారిని ఇబ్బంది పెట్టొద్దు.. ఉద్యోగుల్ని, ఉద్యోగాల నుంచి తొలగించొద్దు.. వారి వేతనాల్ని ఆపొద్దు..’ అని ప్రభుత్వాలు ఓ పక్క విజ్ఞప్తి చేస్తూనే, ప్రజల్ని మాత్రం అడ్డంగా బాదేస్తున్నాయి.

ఇప్పటికే లిక్కర్‌ దెబ్బతో రాష్ట్ర ఖజనాని నింపుకుంటూ, మందు బాబుల పొట్ట కొడుతున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, ఇప్పుడు కరెంటు బిల్లుల మీద పడింది. కరోనా వైరస్‌ కారణంగా ఓ నెల రీడింగులు తీయకపోవడంతో, శ్లాబ్‌లు మారిపోయాయి. అదొక్కటే కారణం కాదు.. ఇతరత్రా కారణాలు కూడా కలిసి బిల్లులు వాచిపోతున్నాయి.. దాంతో, సామాన్యుడి నడ్డి విరిగిపోతోంది.

కొన్ని చోట్ల ఇంటి అద్దెల కంటే కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయంటే పరిస్థితి తీవ్రత ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. ఈ చేత్తో అర్థరూపాయి ఇచ్చి, ఇంకో చేత్తో ఐదు రూపాయలు లాగేసుకోవడమెలాగో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి బాగా తెలుసని, కరెంటు బిల్లుల వ్యవహారంతో మరోమారు స్పష్టమయిపోయింది.

‘అబ్బే, అదేం లేదు..’ అంటూ అధికార పార్టీ నేతలు కొందరు బుకాయించే ప్రయత్నం చేస్తున్నా, ప్రభుత్వం తరఫున ఇప్పటిదాకా కరెంటు బిల్లుల విషయమై ప్రజలకు సమాధానం చాకపోవడం గమనార్హం. ‘ఓటేశారు కదా.. అనుభవించండి..’ అని జనం తమను తామే నిష్టూరాలాడుకోవాల్సిన దుస్థితి ఆంధ్రప్రదేశ్‌లో దాపురించింది.

ఇప్పుడే మొదలైంది అసలు మజా.. ముందుంది మరింత వాయింపుడు వ్యవహారమంటూ, ఆర్టీసీ ఛార్జీలు సహా.. ఇతరత్రా అనేక అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి. అయితే, ఆర్టీసీ ఛార్జీల్ని పెంచడంలేదని మంత్రి పేర్ని నాని ప్రకటించడం కాస్త ఊరట. ఎలక్ట్రిసిటీ పవర్‌కీ, పొలిటికల్‌ పవర్‌కీ చాలా దగ్గరి సంబంధం వుంది. జనాలకి ప్రభుత్వాలు కరెంట్‌ షాక్‌ ఇచ్చిన ప్రతిసారీ, ప్రభుత్వాలకి ప్రజలూ షాక్‌ ఇస్తుంటారు. పవర్‌తో పెట్టుకుంటే అంతే మరి.!

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

రివ్యూ : పాతాళ్ లోక్ (వెబ్ సిరీస్)

చీకటి రాజ్యపు నెత్తుటి మరకలతో “పాతాళ్ లోక్” ప్రస్తుతం ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని శాసిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లు మూతబడి ఓటీటీ ప్లాట్ ఫాంలు కళకళలాడుతున్నాయి. అదే బాటలో అమెజాన్ ప్రైమ్...

నిమ్మగడ్డ ఎపిసోడ్‌: జనసేనకి వెరీ స్పెషల్‌.. ఎందుకంటే.!

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ని తొలగించే క్రమంలో వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ‘ఎన్నికల సంస్కరణల’ పేరిట ఆర్డినెన్స్‌ తీసుకురావడం, ఈ క్రమంలో పెద్దయెత్తున దుమారం చెలరేగడం తెల్సిన విషయమే. తాజాగా...

లాక్ డౌన్ ఎత్తివేతకు 7 కమిటీలతో బ్లూ ప్రింట్ సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం

దశల వారీగా లాక్ డౌన్ ఎత్తివేతకు బ్లూ ప్రింట్‌ సిద్ధం చేయాలన్న ప్రధాని మోదీ సూచనల మేరకు కమిటీలు ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఆరు అంశాలపై 7 కమిటీలు నియమించించిన ఏపీ...

బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చూసాక స్పందిస్తా: మంత్రి తలసాని

సినీ పరిశ్రమ గురించి ప్రముఖులతో జరిగిన చర్చలపై బాలకృష్ణ వ్యాఖ్యలను చూశాక స్పందిస్తానని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. షూటింగ్స్ పునఃప్రారంభించే విషయమై సినిమా, టీవీ...

నిర్మాతల మండలి స్పెషల్ రిక్వెస్ట్ ని సీఎం జగన్ మన్నిస్తాడా.?

చిత్ర పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, స్టూడియోలు, ల్యాబ్స్, అలాగే నిర్మాతలకు, ఆర్టిస్టులకు, ఇతర పరిశ్రమ వర్గాలకు హౌసింగ్ కొరకు అవసరమైన స్ధలాలను కేటాయించాలని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి...