Switch to English

లాక్‌డౌన్‌ సడలింపు: మోడీ మనసులో ఏముంది.?

దేశమంతా ఇప్పుడు మే 17వ తేదీ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆ తేదీతో మూడో దఫా లాక్‌డౌన్‌ ముగుస్తుంది. మరి, మే 18 తర్వాత ఏం జరగబోతోంది.? అప్పటిదాకా ఎందుకు, రేపో మాపో కేంద్రం నుంచి ఓ ప్రకటన రాబోతోంది. మొన్నామధ్య వచ్చింది కదా.. అచ్చం అలాంటి ప్రకటనే. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించారు. వివిధ రాష్ట్రాల్లో పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు.

లాక్‌డౌన్‌ సడలింపులకు సంబంధించి రాష్ట్రాలు తమ తమ అభిప్రాయాల్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్ళాయి. లాక్‌డౌన్‌ని పొడిగించాలని కొన్ని రాష్ట్రాలు, లాక్‌డౌన్‌ని సడలించాలని కొన్ని రాష్ట్రాలూ ప్రధానికి విజ్ఞప్తి చేశాయి. ‘రాష్ట్రాల చర్యలతోనే కరోనాపై ఈ స్థాయి విజయం సాధించగలిగాం. ప్రపంచమంతా మన వైపు ఆసక్తిగా ఎదురుచూస్తోంది..’ అంటూ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చెప్పిన ప్రధాని, కొన్ని చోట్ల జరిగిన చిన్న చిన్న పొరపాట్లతో ఆయా రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని అన్నారట.

అసలు సమస్య ఇప్పుడే మొదలవబోతోందనీ, లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత అగ్ని పరీక్షను ఎదుర్కోబోతున్నామనీ ప్రధాని సెలవిచ్చారట. నిజమే, లాక్‌డౌన్‌ సంగతెలా వున్నా.. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది. నిన్న ఒక్కరోజే దేశంలో 4వేల పై చిలుకు కేసులు నమోదయ్యాయి. నేడు కూడా పరిస్థితి దాదాపుగా అలానే వుండబోతోంది. మరి, లాక్‌డౌన్‌ కారణంగా కరోనా అదుపులోకి వచ్చినట్లా.? రానట్లా.? మద్యం దుకాణాలు తెరిచాక, ఆ ఎఫెక్ట్‌ అంత తొందరగా బయటపడకపోవచ్చు. వచ్చేవారం నుంచి ఆ కేసులు అదనంగా నమోదవుతాయి.

సో, ముందున్నది అత్యంత భయంకరమైన కాలమని తాజా పరిణామాలతో అర్థమవుతోంది. మరి, లాక్‌డౌన్‌ సడలింపులతో ఒరిగేదేంటి.? ఆర్థిక కార్యకలాపాలు షురూ అవుతాయి.. తద్వారా రాష్ట్రాలు, దేశం ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతుంది. కానీ, జనం మాటేమిటి.? ఆ ఒక్కటీ అడక్కూడదంతే.!

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

కరోనా కష్ట కాలంలో వైసీపీ సంబరాలు సమంజసమా.?

కరోనా వైరస్‌ ముప్పు రోజురోజుకీ పెరుగుతోంది. ఈ తరుణంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ‘ఏడాది పాలన’ సంబరాలకు సమాయత్తమవుతోంది. ఈ నెల 23 నుంచి వారం రోజులపాటు సంబరాల కోసం అటు ప్రభుత్వం...

లాక్ డౌన్ ఎఫెక్ట్: స్టార్ హీరోల సినిమాలు ఏ స్టేజ్ లో ఆగిపోయాయో తెలుసా?

కరోనా అనే మహమ్మారి ప్రపంచం మీద విజృంభించిన విధానం అంతా ఇంతా కాదు. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోవడంతో సగటు మనిషి నుంచి పెద్ద పెద్ద పరిశ్రమల వరకు అన్నీ మూత పడ్డాయి....

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

బర్త్‌డే స్పెషల్‌: పడి లేచిన కెరటంలా దూసుకెళ్తున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్

తెలుగు సినిమా ఉన్నంత కాలం ఎప్పటికి గుర్తుండి పోయే నందమూరి తారక రామారావు వారసత్వంతో బాల నటుడిగానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్‌ చిన్న తనంలోనే రాముడిగా నటించి నిజంగా రాముడు ఇలాగే...