Anand Mahindra: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. సమకాలీన అంశాలను ప్రస్తావిస్తూ.. ప్రతిభను ప్రోత్సహించే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) మరోసారి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. ఇటివల ముగిసిన పారా ఆసియా క్రీడల్లో (Asian Para Games) రెండు చేతులు లేని శీతల్ దేవి (Archer Sheetal Devi) ఆర్చరీలో ఇండియాకు రెండు స్వర్ణ, ఒక రజత పతకాలు సాధించింది.
ఆమె ధృఢచిత్తానికి, పట్టుదలకు ముగ్దుడైన ఆనంద్ మహీంద్రా ఆమెకు అద్భుత ఆఫర్ ఇచ్చారు. తమ కంపెనీలో తయారయ్యే ఏ కారునైనా ఎంచుకోవాలని.. ఆమె ప్రత్యేక అవసరాలకు తగినట్టుగా తీర్చిదిద్ది అందజేస్తామని మాటిచ్చారు. అంతేకాకుండా.. శీతల్ జీవిక కథను చెప్పే వీడియోను సైతం ఎక్స్ లో పోస్ట్ చేశారు. అవరోధాలను అధిగమించి ఆమె సాధించింది చూస్తే శీతల్ అందరికీ ఆదర్శమని అన్నారు. తాను సైతం చిన్న చిన్న విషయాలకు కుంగిపోనన్నారు.
అవరోధాలను అధిగమించి పతకాలు నెగ్గడం సామాన్యమైన విషయం కాదని అన్నారు. శీతల్ జమ్ము కశ్మీర్ కు చెందిన అథ్లెట్. ఆర్చరీలో రెండు బంగారు, మహిళల డబుల్స్ లో రజత పతకం గెలిచింది.