కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఎబిసిడి లాంటి మంచి చిత్రాలతో జనాదరణ పొందుతున్న అల్లు శిరీష్ తాజా చిత్రం “ఉర్వశివో రాక్షసివో”. ఈ చిత్రానికి “విజేత” సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శిరీష్ సరసన “అను ఇమ్మాన్యూల్” హీరోయిన్ గా నటించింది. ఇదివరకే రిలీజ్ చేసిన “ఊర్వశివో రాక్షసివో” చిత్ర టీజర్ కు, సాంగ్స్ కు అనూహ్య స్పందన లభించింది.
ఈ చిత్రం నవంబర్ 4న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ఈ చిత్రం ప్రమోషనల్ టూర్ చేస్తున్నారు. ఇందులో భాగంగా చిత్ర యూనిట్ రాజమండ్రి లో అభిమానులను కలిసారు. అభిమానులతో “ఊర్వశివో రాక్షసివో” చిత్రం నుండి “కలిసుంటే” అనే సాంగ్ పోస్టర్ ను విడుదల చేయించారు. అభిమానులతో సాంగ్ పోస్టర్ రిలీజ్ చేయించడం అరుదైన విషయం. ఇది అభిమానులకు కూడా ఆనందం కలిగించే విషయం. ఈ పాటను రేపు సాయంత్రం 4 గంటలకు విడుదలచేయనుంది చిత్రబృందం.
అనూప్‌రూబెన్స్, అచ్చు రాజమణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని జీఏ-2 పిక్చర్స్ ధీరజ్ మొగిలినేని నిర్మించారు. విజయ్ ఎం. సహా నిర్మాతగా వ్యవహారించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.