జిన్నా రివ్యూ: బోరింగ్

Critic Rating
( 2.00 )
User Rating
( 2.20 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

92,675FansLike
57,764FollowersFollow
Movie జిన్నా
Star Cast విష్ణు మంచు, సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్
Director ఈశాన్ సూర్యః
Producer విష్ణు మంచు, మోహన్ బాబు
Music అనూప్ రూబెన్స్
Run Time 2గం 16ని
Release 21 అక్టోబర్, 2022

చాలా కాలం తర్వాత మరో సినిమాతో మన ముందుకు వచ్చాడు మంచు విష్ణు. తన అచ్చొచ్చిన యాక్షన్ కామెడీ జోనర్ లో రూపొందిన సినిమా జిన్నా. ఈ చిత్రంపై ఎంతో కాన్ఫిడెంట్ గా కూడా ఉన్నాడు మంచు విష్ణు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా?

కథ:

తన ఊరికి ప్రెసిడెంట్ కావాలని కలలు కంటుంటాడు జిన్నా (మంచు విష్ణు). అదే ఊర్లో టెంట్ హౌజ్ నడుపుకుని జీవిస్తుంటాడు. అయితే జిన్నా లెగ్ మంచిది కాదనే అభిప్రాయం ఊరిలో ఉంటుంది. తన చిన్నప్పటి స్నేహితురాలు రేణుక (సన్నీ లియోన్) చాలా ఏళ్ల తర్వాత తిరిగి మళ్ళీ ఊరికి వస్తుంది. అయితే ఆమె మాట్లాడలేదు, వినలేదు.

ఈ నేపథ్యంలో రేణుక వచ్చిన తర్వాత జిన్నా జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? చివరికి ఏమైంది అన్నది చిత్ర కథ.

నటీనటులు:

మంచు విష్ణు నటుడిగా చాలా పరిణితి చెందాడు అనిపిస్తుంది ఈ సినిమాలో. తన డైలాగ్ డెలివరీ, డ్యాన్స్ లు అన్నీ ఇంప్రూవ్ అయ్యాయి. అయితే చిత్తూరు యాస మీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉండాల్సింది.

సన్నీ లియోన్ కు చాలా ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కింది. ఆమె మనల్ని సర్ప్రైజ్ చేస్తుంది. ఇక మరో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కు ఎటువంటి స్కోప్ దక్కలేదు. చమ్మక్ చంద్ర, వెన్నెల కిశోర్ వంటి వారు తమ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించారు.

సాంకేతిక నిపుణులు:

కోన వెంకట్ అందించిన కథ మనం ఎన్నో ఏళ్ల నుండి చూస్తున్నదే. ఇప్పటికే అరిగిపోయిన కథతో కొత్త దర్శకుడు ఇషాన్ సూర్య ఏమాత్రం మెప్పించలేకపోయాడు. ఇక చిత్ర స్క్రీన్ ప్లే కూడా కొత్తగా ఏం లేదు. చాలా చోట్ల బోరింగ్ గా మారిపోయింది. చిత్రం మొదలవ్వడం బాగానే ఉన్నా ఆ ఇంపాక్ట్ కొనసాగించలేకపోయారు.

అనూప్ రూబెన్స్ ఈ చిత్రంలో డీసెంట్ ఔట్పుట్ ఇచ్చాడు. అటు పాటలు కానీ ఇటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ ఇంప్రెస్ చేస్తాయి. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండొచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:

  • సన్నీ లియోన్ పెర్ఫార్మన్స్
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్

మైనస్ పాయింట్స్:

  • ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం
  • ల్యాగ్ ఎక్కువవ్వడం
  • అవుట్ డేటడ్ స్టోరీ

విశ్లేషణ:

పరమ రొటీన్ కథకు అంతే రొటీన్ స్క్రీన్ ప్లే జత చేస్తే జిన్నా. ఆడియన్స్ ను కొత్తగా అలరించేది ఏం లేదు. ఖాళీగా ఉంటే ఒకసారి అతికష్టమ్మీద చూడొచ్చు.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2/5

7 COMMENTS

సినిమా

రామ్ చరణ్-ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగిందా? ఈ ఉదాహరణలే చర్చకు కారణం!

'RRR’ సమయంలో రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహం, బాండింగ్, బ్రదర్‌హుడ్ గురించి ఇద్దరూ చాలా సందర్భాల్లో మాట్లాడారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అయితే రామ్...

ఒకే ఏడాదిలో రూ.300 కోట్ల మైలురాయి.. బాక్సాఫీస్ చరిత్రలో చిరంజీవి–రామ్ చరణ్...

బాక్సాఫీస్ చరిత్రలో కలెక్షన్ల గురించి మాట్లాడితే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేర్లు మరోసారి ప్రత్యేకంగా నిలిచే పరిస్థితి కనిపిస్తోంది. ఒకే...

పెద్ది దూకుడు కొనసాగుతోంది.. 11వ రోజు ఆల్‌టైమ్ టాప్-6లో ఎంట్రీ!

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. విడుదలైన 11వ రోజు ఏపీ-తెలంగాణలో...

సొంత ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. 180 మంది...

హీరో విజయ్ దేవరకొండ తన సొంత ప్రాంతానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ విద్యారంగంలో మరో ప్రశంసనీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో...

అచ్చంపేట వేదికగా విజయ్-రష్మిక మధుర క్షణాలు.. సోషల్ మీడియాలో ‘కపుల్ గోల్స్’...

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమం కోసం అచ్చంపేటకు వెళ్లిన సినీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించారు....

రాజకీయం

లోకేష్ ప్రజాదర్బార్‌లో వెల్లువెత్తిన వినతులు

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహించిన 90వ రోజు ప్రజాదర్బార్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన...

జనసేనలో చేరికలకు స్పెషల్ కమిటీ.. 14 మంది సభ్యులతో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం

జనసేన పార్టీలో చేరికల ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇతర పార్టీల నేతలు, విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్థ వర్గాలకు చెందిన ప్రముఖులను జనసేనలోకి...

హోమ్ మంత్రి అనితపై వ్యాఖ్యలు అభ్యంతరకరం.. రాజకీయాల్లో హద్దులు దాటొద్దు: పవన్ కళ్యాణ్

రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి అనితపై ఓ మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మహిళల కట్టుబొట్టును ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర...

అమరవీరులకు పవన్ కళ్యాణ్ నివాళి.. నేషనల్ వార్ మెమోరియల్‌లో భావోద్వేగ క్షణాలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు  పవన్ కళ్యాణ్ ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్‌ను సందర్శించి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. భారత సైనికుల ధైర్యం,...

ఢిల్లీలో జనసేన సేన ప్రస్థానం.. అయిదు కీలక తీర్మానాలకు ఆమోదం

జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన ‘సేన ప్రస్థానం – దేశ సమైక్యత కోసం’ సమావేశంలో ఐదు కీలక తీర్మానాలకు ఆమోదం లభించింది....

ఎక్కువ చదివినవి

మాట నిలబెట్టుకున్న లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం

రాజకీయ హింసకు గురైన కుటుంబాలకు అండగా నిలిచే నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి వార్తల్లో నిలిచింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో గతంలో హత్యకు గురైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త, బీసీ...

Peddi Heroine Issue: వాళ్లకి.. ‘పెద్ది’ హీరోయిన్ సమస్యా..? ‘పెద్ది’తోనే సమస్యా..?

Peddi Heroine Issue: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్ల దూసుకెళ్తోంది. విడుదలైన 5రోజులకు ప్రపంచవ్యాప్తంగా రూ.315కోట్లు వసూలు చేసినట్టు మేకర్స్ ఓ...

పెద్ది దూకుడు కొనసాగుతోంది.. 11వ రోజు ఆల్‌టైమ్ టాప్-6లో ఎంట్రీ!

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. విడుదలైన 11వ రోజు ఏపీ-తెలంగాణలో రూ.4.67 కోట్ల షేర్ వసూలు చేసి...

తప్పుడు ప్రచారమా?.. డీఎస్సీ నియామకాలపై కొత్త వివాదం

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నియామకాల అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. డీఎస్సీ నియామకాల్లో కుల ప్రాధాన్యతకు సంబంధించిన ఆరోపణలు, ప్రత్యారోపణలు రాజకీయ వర్గాల్లో వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా కింద జరిగిన...

”వంద ఇస్తామని పిలిచారు.. వచ్చాం”: చావుల వద్ద కూడా తరలింపా?!

రాజకీయాలు చాలా ఖరీదైపోయాయి. వంద నుంచి రెండు వేల రూపాయల దాకా ఒక్కో మనిషి మీదా ఖర్చు చేస్తే తప్ప, రాజకీయాలు చేయలేని దుస్థితి. ఇంకెవరూ రాజకీయం చేయడం లేదా.? వైఎస్ జగన్...