Switch to English

ఓరి దేవుడా మూవీ రివ్యూ – పర్వాలేదనిపించే రొమాంటిక్ డ్రామా

Critic Rating
( 2.50 )
User Rating
( 2.50 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow
Movie ఓరి దేవుడా
Star Cast దగ్గుబాటి వెంకటేష్, విశ్వక్ సేన్
Director అశ్వత్ మరిముత్తు
Producer ప్రసాద్ వి పొట్లూరి
Music లియోన్ జేమ్స్
Run Time 2 గం 27 నిమి
Release 21 అక్టోబర్, 2022

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నుండి వస్తోన్న లేటెస్ట్ మూవీ ఓరి దేవుడా. తమిళ చిత్రం ఓ మై కడవులే కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా?

కథ:

ఓరి దేవుడా కథ మొత్తం అజయ్ పాత్ర చుట్టూ తిరుగుతుంది. అజయ్, అను బెస్ట్ ఫ్రెండ్స్. కొన్నాళ్ల తర్వాత అను, అజయ్ కు ప్రపోజ్ చేస్తుంది. దాంతో వారిద్దరూ పెళ్లి చేసుకుంటారు. అయితే సంవత్సరం తర్వాత డివోర్స్ కు అప్లై చేస్తారు. అయితే కోర్టులో ఏం జరుగుతుంది అనేది ఒక అజ్ఞాత వ్యక్తి అజయ్ కు చెప్తాడు.

ఆశ్చర్యపోయిన అజయ్ ఈసారి ఏం చేస్తాడు? అసలు ఆ అజ్ఞాతవ్యక్తికి జరగబోయేది ముందే ఎలా తెలుస్తుంది? ఇంతకీ అజయ్, అనుల డివోర్స్ ఏమైంది?

నటీనటులు:

ఈ సినిమా విశ్వక్ సేన్ కెరీర్ కు కచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎమోషనల్ సీన్స్ లో విశ్వక్ చాలా బాగా చేసాడు. మొత్తం చిత్రాన్ని తన భుజాలపై మోసాడనే చెప్పాలి. ఇక హీరోయిన్ మిథిలా పాల్కర్ కూడా చాలా బాగా చేసింది. తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది.

ఇక వెంకటేష్, రాహుల్ రామకృష్ణ పాత్రలు ఎప్పుడూ తెరపై కనిపించినా ఎంటర్టైన్ చేస్తాయి. వెంకటేష్ ఎప్పటిలానే ఫోకస్ తన మీద నుండి పోకుండా ఉంచాడు. రాహుల్ కూడా బాగా చేసాడు.

సాంకేతిక నిపుణులు:

ఇదేమి పూర్తిగా కొత్త కథ కాదు, కాకపోతే రచయిత కమ్ దర్శకుడు అశ్వత్ మరిముత్తు స్క్రీన్ ప్లే ను రెఫ్రెషింగ్ గా రాసుకోగలిగాడు. కథను నాన్-లినియర్ స్టైల్ లో చెప్పడం బాగుంది. ఇక దర్శకుడిగా కూడా అశ్వత్ రాణించాడు. ఎమోషన్స్ ను సరిగ్గా స్క్రీన్ పైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు.

సినిమాటోగ్రఫీ సూపర్బ్ గా ఉంది. ప్రతీ ఫ్రేమ్ కూడా అవుట్ స్టాండింగ్ గా ఉంది అంటే అతిశయోక్తి కాదు. లియోన్ జేమ్స్ కంపోజ్ చేసిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు తగ్గట్లుగా ఉన్నాయి. ఎడిటింగ్ కూడా డీసెంట్ గా ఉంది. ఇక నిర్మాణ విలువలకు ఢోకా లేదు.

ప్లస్ పాయింట్స్:

  • సినిమాటోగ్రఫీ
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
  • నటీనటుల పెర్ఫార్మన్స్

మైనస్ పాయింట్స్:

  • మీరా, అజయ్ లవ్ ట్రాక్
  • సెకండ్ హాఫ్ లో డ్రామా

చివరిగా:

ఓరి దేవుడా మొత్తానికి పర్వాలేదనిపించే రొమాంటిక్ డ్రామా. సినిమా మెజారిటీ భాగం సాఫీగా ఎటువంటి ఇష్యూ లేకుండా సాగిపోతుంది. అయితే చిత్రం అక్కడక్కడా ట్రాక్ తప్పుతున్న ఫీలింగ్ ఇస్తుంది. ఇక ఎమోషనల్ డెప్త్ లేకపోవడం కూడా మైనస్ అనే చెప్పాలి.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2.5/5

13 COMMENTS

  1. Cheers, my name is Rosie Seay, good to meet you. I used to live during my childhood in Slovakia, recently I moved to Kihikihi. I like it here. Still want to know more? My work is about broadcasting presenter, I have various hobbies, one of them is glowsticking. Music is my life, I often listen to manila sound and my number one book is The Critique of the School for Wives. My number one PC game is BioShock, I love to watch TV shows like Laverne & Shirley (1976–1983), comedy, it is really good, both story and acting. Stay in touch via my

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Ram Charan: హైదరాబాద్ లో ఘనంగా రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు..

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అభిమానులు కలిసి చేసిన ఈ వేడుకలో మంచు మనోజ్, నిఖిల్, కిరణ్ అబ్బవరం.. నిర్మాతలు దిల్...

Ram Charan : ‘మగధీర’తో రానున్న గేమ్‌ చేంజర్‌

Ram Charan : మెగా ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రామ్‌ చరణ్ బర్త్‌డే మరి కొన్ని గంటల్లో రాబోతుంది. మార్చి 27న మెగా ఫ్యాన్స్ కి...

Ram Charan Birthday Special: నిజ జీవితంలో మానవతావాది.. రామ్ చరణ్

Ram Charan: తండ్రి నుంచి వారసత్వం మాత్రమే కాదు.. రాజసం కూడా పుణికిపుచ్చుకుంటే ఆ కొడుకును చూసి తండ్రి మురిసిపోతాడు. కుటుంబ పేరు ప్రతిష్టలను కూడా ముందుకు తీసుకెళ్తే సమాజం శెభాష్ అంటుంది....

Uppena : హిందీ ‘ఉప్పెన’ ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌

Uppena : మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన సినిమా ఉప్పెన. ఇదే సినిమా తో దర్శకుడిగా బుచ్చిబాబు మరియు హీరోయిన్‌ గా కృతి శెట్టి లు నటించిన...

Chiranjeevi: బెంగళూరు నీటి సమస్యపై చిరంజీవి స్పందన.. ఫొటోలు వైరల్

Chiranjeevi: 40ఏళ్లలో బెంగళూరువాసులు ఎప్పుడూ ఎదుర్కోనంత నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సర్వత్రా ఆందోళన కలిగిస్తోన్న సమస్యకు ప్రాంతాలతో సంబంధంలేదని.. నీటి వాడకం, పొదుపుపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అనేకమంది సూచిస్తున్నారు. ఈక్రమంలో మెగాస్టార్...