Switch to English

Adipurush: మరో నెల రోజులు ‘ఆది పురుష్’ దే హవా!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,838FansLike
57,764FollowersFollow

Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas)హీరోగా నటించిన ‘ఆది పురుష్( Adipurush)’ టాక్ ఆఫ్ ది సినీ ఇండస్ట్రీ గా మారింది. రామాయణ మహాకావ్యాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమా భారీగా ట్రోల్స్ కి గురవుతోంది. ఇందులో కొన్ని సీన్స్, డైలాగ్స్ అభ్యంతరకరంగా ఉన్నాయంటూ పలువురు కోర్టుమెట్లు కూడా ఎక్కారు. అయితే ఈ నెగెటివిటీ అంతా కలెక్షన్లపై ఏమాత్రం పడటం లేదు. బాలీవుడ్ లో గాని, టాలీవుడ్ లో గాని ఎక్కడ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్ లేకపోవడంతో ఈ సినిమాకు కాసుల పంట పండుతోంది. టాలీవుడ్ లో అయితే మరో నెలకు పైగా ఈ సినిమా హవా నే కొనసాగనుంది.

టాలీవుడ్ బాక్సాఫీస్ కి కీలకంగా చెప్పుకునే సమ్మర్ ఈసారి వెలవెల పోవడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమా స్టోరీ టెల్లింగ్, మేకింగ్ విషయాలు పక్కన పెడితే వసూళ్లపరంగా ‘ఆది పురుష్’ దుమ్ము లేపుతోంది. ఇప్పటికే రూ. 200 కోట్ల వసూళ్ల మార్కును దాటేసి రూ. 500 కోట్ల క్లబ్లో చేరే దిశగా దూసుకెళ్తోంది. వచ్చేనెల 28 వరకు మరే పెద్ద సినిమా విడుదల లేకపోవడం ఈ సినిమాకి అచ్చోచ్చే అంశం. అంటే దాదాపు 40 రోజుల వరకు ఈ చిత్ర కలెక్షన్లకు ఏమాత్రం డోకా ఉండదు. దీంతో ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే అవకాశం ఉందని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి. జూలై 28న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pavan Kalyan), సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej)కలిసి నటించిన ‘బ్రో ది అవతార్’ విడుదల కానుంది. ఈలోపు ఒకట్రెండు చిన్న సినిమాలు విడుదలైనా ‘ఆది పురుష్’ కలెక్షన్లపై అది ఏమాత్రం ప్రభావం చూపకపోవచ్చు.

ఇక సినిమా విషయానికొస్తే ఇందులో రాఘవుడిగా ప్రభాస్ ( Prabhas), జానకి గా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్( Krithi Sanon), శేషు గా సన్నీ సింగ్, లంకేష్ గా సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan) నటించారు. ఓం రౌత్ దర్శకుడు.

సినిమా

శ్రీలీలను డామినేట్ చేసిన కెతిక శర్మ..!

నితిన్ రాబిన్ హుడ్ సినిమాలో హీరోయిన్ శ్రీలీల అన్నారు కానీ నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తే అందరు కెతిక శర్మ అనుకోక తప్పదు....

అదే రాబిన్ హుడ్ స్ట్రెంత్ అంటున్న నితిన్..!

లవర్ బోయ్ నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కిన రాబిన్ హుడ్ సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మైత్రి...

Ram Charan Birthday Special: ‘ఆరెంజ్’ మూవీ మ్యాజిక్.. రీ-రీ-రిలీజులతో రికార్డులు

Ram Charan: ప్రతి హీరో కెరీర్లో ప్రేమకథల సినిమాలు ఉంటాయి. గ్లోబల్ స్టార్ హోదాలో ఉన్న రామ్ చరణ్ కూడా ప్రేమకథలో నటించారు. కానీ, ఆ...

మిస్ లీడింగ్ థంబ్ నైల్స్ పై నటి గాయత్రి భార్గవి సీరియస్..!

వ్యూస్ కోసం కొంతమంది పెట్టే చీప్ థంబ్ నైల్స్ వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిని ఎన్ని విధాలుగా ఛీ కొడుతున్నా సరే వాళ్లు...

Tollywood: ‘పక్కోడి ముందు పరువు తీసేసుకోవాలి’ ఇదే టాలీవుడ్ నయా ట్రెండ్..!

Tollywood: ఎక్కడైనా, ఎవరైనా తమ పరువు కాపాడుకోవాలనే చూస్తారు. వేరేవారి ముందైతే తప్పనిసరిగా కాపాడుకుంటారు. కానీ.. తెలుగువాళ్లు తమ పరువు తీసుకోవడానికి.. మరీ ముఖ్యంగా ఇతరుల...

రాజకీయం

మాజీ మంత్రి విడదల రజనీకి అరెస్టు భయం.! అస్సలు లేదట.!

‘ఏం చేస్తారు.? మహా అయితే అరెస్టు చేస్తారు.. అంతే కదా.?’ అంటున్నారు వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజనీ. ఒకప్పుడు తాను చంద్రబాబు నాటిన సైబరాబాద్ మొక్కనని చెప్పుకున్న విడదల రజనీ,...

యుద్ధ ప్రాతిపదికన రుషికొండ బీచ్‌కి బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణ.!

రుషికొండ బీచ్.. విశాఖపట్నంలో అత్యంత సుందరమైన బీచ్‌లలో ఇది కూడా ఒకటి.! గతంలో, ఈ రుషికొండ బీచ్‌లో పర్యాటకుల కోసం పలు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రుషికొండ బీచ్‌కి ప్రతిష్టాత్మకమైన...

పోసాని విడుదల.. ఇకనైనా పద్ధతి మార్చుకుంటాడా.?

సినీ నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణ మురళి నిన్న జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు నెల రోజులుగా జైలు జీవితానికే పరిమితమయ్యారు పోసాని కృష్ణమురళి. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మీద...

డీలిమిటేషన్ పంచాయితీ: వైఎస్ జగన్ ఎందుకు వెళ్ళలేదు.?

డీలిమిటేషన్ ప్రక్రియను పాతికేళ్ళు ఆపేయాలంటూ తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే, సంచలనాత్మక డిమాండ్ చేసింది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయడం సబబు కాదన్నది చెన్నయ్‌లో డీఎంకే నేతృత్వంలో వివిధ రాజకీయ పార్టీల అధినేతల...

మంత్రి లోకేష్ చొరవతో విద్యాశాఖ లో సంస్కరణలు

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్యాశాఖలో ఆయన చేపడుతున్న సంస్కరణలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్య, టెక్నాలజీపై పట్టు లాంటివి పెంపొందించేందుకు తాజాగా మరోసారి కీలక సంస్కరణలు...

ఎక్కువ చదివినవి

బెట్టింగ్ యాప్స్.! ఇన్‌ఫ్లూయెన్సర్లు, సెలబ్రిటీలకే కోట్లు చెల్లించారా.?

బెట్టింగ్ యాప్స్ గురించి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రచ్చే జరుగుతోంది. పలువురు సినీ సెలబ్రిటీలు, కొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లు పెద్దయెత్తున సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేశారు. క్రికెట్, ఆన్‌లైన్ రమ్మీ.....

విజయ్ దేవరకొండపై కేసు.. స్పందించిన టీమ్..!

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీస్ అందరిపైన కేసు ఫైల్ చేసి పోలీసులు నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. వారి వల్ల ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. లక్షలకు లక్షలు బెట్టింగ్...

మ్యాడ్ స్క్వేర్ నుంచి వచ్చార్రోయ్ సాంగ్ వచ్చేసింది..!

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రెండేళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అందుకున్న సినిమా మ్యాడ్. యూత్ ఆడియన్స్ కు ఈ సినిమా బాగా నచ్చేసింది. కళ్యాణ్ శంకర్...

ప్రియదర్శి “సారంగపాణి జాతకం” రిలీజ్ డేట్ ఫిక్స్..

రీసెంట్ గానే మంచి హిట్ అందుకున్న ప్రియదర్శి త్వరలోనే మరో సినిమాతో రాబోతున్నాడు. హిట్ డైరెక్టర్ మోహన కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో ఈ...

చట్ట విరుద్దంగా రానా ఏం చేయలేదు

బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్‌పై కేసులు పెడుతున్న తెలంగాణ పోలీసులు ఇటీవల సినిమా హీరోలు, హీరోయిన్స్‌పైనా కేసులు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి. మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, రానా...