హిమాలయ పర్వత ప్రాంతంలో నిర్మించిన అత్యంత పొడవైన సొరంగ మార్గం తాజాగా అందుబాటులోకి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి-లెహ్ జాతీయ రహదారిపై లహౌల్ స్పిటీ జిల్లాలోని రోహ్ తంగ్ పాస్ వద్ద 9.2 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ సొరంగ మార్గం ప్రపంచంలోనే అత్యంత పొడవైనది కావడం విశేషం. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో 2000 జూన్ 3న ఈ సొరంగం నిర్మించాలని నిర్ణయించారు. 2002 మే 26న దీనికి శంకుస్థాపన జరిగింది. ఆరేళ్లలో నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నా కుదర్లేదు.
18 ఏళ్ల తర్వాత ఇది ప్రారంభమైంది. తొలుత దీనిని రోహ్ తంగ్ టన్నెల్ అని పిలవగా.. మోదీ ప్రభుత్వం దానిని అటల్ టన్నెల్ గా పేరు మార్చింది. రూ.3300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ సొరంగం పలు విధాలుగా ఉపయోగపడనుంది. సముద్ర మట్టానికి 10వేల అడుగులో ఉన్న సొరంగ మార్గంతో మనాలి-లెహ్ మధ్య 46 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. రక్షణపరంగానూ ఇది కీలకపాత్ర పోషించనుంది. సరిహద్దుల్లో ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే ఈ మార్గం ద్వారా సైనికులను, సామగ్రిని త్వరగా తరలించే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు కూడా దీనివల్ల బోలెడు ఉపయోగం ఉంటుంది. శీతాకాలంలో దట్టంగా కురిసే మంచు వల్ల రోడ్లపై ప్రయాణించే వీలుండదు. అలాంటి సమయంలో ఈ సొరంగమార్గం ద్వారా ప్రయాణించే అవకాశం ఉంది. భద్రతాపరంగానూ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
సొరంగంలో ఎక్కడికక్కడ టెలిఫోన్, అగ్నిమాపక వ్యవస్థ, ప్రతి అరకిలోమీటరు దూరానికి అత్యవసర మార్గం, సీసీ కెమెరాలు, గాలి, వెలుతురు వచ్చే ఏర్పాట్లు ఉన్నాయి. ఇక ఈ సొరంగం వల్ల సరిహద్దులకు అదనపు బలం చేకూరుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సొరంగ మార్గాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. సరిహద్దుల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు ఈ టన్నెల్ సహకరిస్తుందని పేర్కొన్నారు.
522612 88521Thanks for helping out, superb information . 711463
632951 174002Housing a different movement in a genuine case or re-dialed model. 541676
312474 215725Nowhere on the Internet is there this significantly quality and clear details on this subject. How do I know? I know because Ive searched this subject at length. Thank you. 799300
631513 208241Thrilled you desire sensible business online guidelines maintain wearing starting tools suitable for the specific web-based business. cash 398138
482789 488084Typically I dont read this kind of stuff, but this was really fascinating! 735242