Switch to English

టీడీపీ పగలగొడ్తోంటే.. వైసీపీ సర్కార్ ఏం చేస్తోంది సజ్జల సారూ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,409FansLike
57,764FollowersFollow

కొన్నాళ్ళ క్రితం ఓ అధికారిక కార్యక్రమంలో మాట్లాడుతూ, ‘దేవాలయాల మీద దాడులు చేసినోళ్ళే, ఆ తర్వాత మొసలి కన్నీరు కార్చుతున్నారు.. రథాలు తగలబెట్టి, రథయాత్రలు చేస్తామంటున్నారు..’ అని సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెలవిచ్చారు. ప్రభుత్వం తన చేతకానితనాన్ని ఇలా అంగీకరించిందా.? అని అంతా ముక్కున వేలేసుకున్నారు రాష్ట్ర ప్రజానీకం.

‘దేవాలయాలతో సరిపెట్టరేమో.. రేప్పొద్దున్న విద్యాలయాలపైనా దాడులు చేస్తారేమో..’ అని ముఖ్యమంత్రి అనుమానం వ్యక్తం చేయడం అప్పట్లో పెను వివాదానికి కారణమయ్యింది. ముఖ్యమంత్రి పదవిలో వున్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు.? అని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నించారు.

ఇక, తాజాగా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ‘అంబేద్కర్, రంగా విగ్రహాలు కూడా పగలగొట్టబోతున్నారు..’ అంటూ టీడీపీ పై సజ్జల విమర్శలు చేశారు. ఇది రాజకీయ విమర్శలా లేదు.. త్వరలో జరగబోయే అనర్థాలకు సంకేతంలా వుంది. అధికార పార్టీ ఇలాంటి సంకేతాలు పంపుతోందంటే, ఆయా చర్యలు ఎవరు చేయబోతున్నారో తెలిసీ, వాటిని ఉపేక్షించడం ద్వారా రాజకీయ రచ్చ చేయాలని అధికార పార్టీ భావిస్తోందని అనుకోవాలేమో.

విపక్షాలు విధ్వంసకర రాజకీయాల్నే ఎంచుకున్నాయని అనుకుందాం. మరి, ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు.? పిఠాపురంలో దేవతామూర్తుల విగ్రహాల్ని దుండగులు ధ్వంసం చేసినప్పుడే తగిన చర్యలు తీసుకుని వుంటే, అంతర్వేది రధం దగ్ధమయ్యేది కాదు. బుద్ధి వున్నోడెవడూ ఇలాంటి దుష్ట పనులు చేయడు. అది ఏ పార్టీకి చెందినవారైనా సరే, ఇలాంటి విద్వంసాలకు తెరలేపే ప్రసక్తే వుండదు. కొందరు మాత్రమే.. అసాంఘీక శక్తులుగా మారతారు. అలాంటివారి కారణంగానే ఇలాంటి దారుణాలు జరుగుతుంటాయి. అలాంటివారికి పార్టీల రంగులు పులమడం, తద్వారా సమస్యను పక్కదారి పట్టించడం రాజకీయ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్యగా మారిపోయింది.

విపక్షాలు రాజకీయం చేస్తే అదో లెక్క. కానీ, అధికారంలో వున్నోళ్ళకి బాధ్యత వుండక్కర్లేదా.? పైగా, కీలక పదవుల్లో వున్నవారు ఇలాంటి తేలిక వ్యాఖ్యలు చేయడం ద్వారా సమాజంలో అశాంతికి కారణమైతే ఎలా.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mouni Roy: మౌని బికినీ వేస్తే.. మత్తెక్కిస్తున్న ముంబై భామ అందాలు

Mouni Roy: ‘పాప అలా నడుస్తూ ఉంటే.. పాప అలా సింపుల్ గా నుంచుంటే.. అబ్బో..’ అని ఓ సినిమాలో హీరోయిన్ ను ఉద్దేశించి డైలాగ్...

Navdeep: ‘నా పేరు లేదని కొందరు బాధ పడుంటారు..’ రేవ్ పార్టీపై...

Navdeep: ‘బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rev Party) వ్యవహారంలో నా పేరు రాకపోవడంపై చాలామంది నిరుత్సాహపడి ఉంటార’ని హీరో నవదీప్ (Navdeep) అన్నారు. తాను...

Kalki 2898 AD: ‘ఇంజనీరింగ్ అద్భుతం ఇది..’ బుజ్జిని డ్రైవ్ చేసిన...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) నటించిన భారీ స్కేల్ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన...

Indian 2: ఒకే వేదికపై చిరు, రజినీ, కమల్, చరణ్..! కిక్కెక్కిస్తున్న...

Indian 2: కొత్త సినిమాల ప్రమోషన్లకు ముఖ్య అతిథులుగా అతిరధ మహారధులు హాజరయితే ప్రేక్షకాభిమానులకు కన్నులపండగే. అరుదుగా జరిగే ఇటువంటి అంగరంగ వైభవం త్వరలో జరుగనుందని...

Bala Krishna: ‘ఆ లోటు ఈ వేడుక తీర్చింది’.. సత్యభామ ప్రీ-రిలీజ్...

Bala Krishna: ‘ఎన్నికలయ్యాక ఫుల్ జోష్ తో షూటింగ్స్ చేద్దామనుకున్నా.. ఇప్పటికీ మొదలు పెట్టలేదు. దాదాపు 50రోజులు మిస్సయిన కెమెరాను సత్యభామ వేడుక భర్తీ చేసింద’ని...

రాజకీయం

వైసీపీ పట్ల వ్యతిరేకత నిజం.! కానీ, అది ఎంత మొత్తంలో.?

ఎట్టకేలకు వైసీపీ అను‘కుల’ మీడియా కూడా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వుందని ఒప్పుకోవాల్సి వస్తోంది. ‘సహజంగానే, ఐదేళ్ళ పాలనపై ప్రజా వ్యతిరేకత ఎంతో కొంత అధికార పార్టీ మీద...

టీడీపీ రిగ్గింగ్ వర్సెస్.! వైసీపీ రౌడీయిజమ్.!

ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడులో తలలు పగిలాయ్.! రాయలసీమలోనూ అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏడు చోట్ల ఈవీఎంలను పగలగొట్టారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఓ...

ఇన్‌సైడ్ స్టోరీ: రాయలసీమలో వైసీపీ పరిస్థితేంటి.?

రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వేవ్ వున్నాగానీ, రాయలసీమలో మాత్రం షరామామూలుగానే వైసీపీ వేవ్ వుంటుందని, వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. రాయలసీమలో మెజార్టీ సీట్లు కొట్టగలిగితే, చాలా తేలిగ్గా ప్రభుత్వాన్ని ఇంకోసారి ఏర్పాటు...

సీఎం పదవీ ప్రమాణ స్వీకారం.! వైసీపీ అను‘కుల’ మీడియా వంటకాలు.!

ప్రస్తుతానికైతే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! కానీ, ఎన్నికల కోడ్ అమల్లో వుంది. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితం తర్వాత ఈక్వేషన్స్ మారతాయ్. మళ్ళీ వైఎస్ జగన్...

పవన్ కళ్యాణ్‌ని ఉద్దానం మర్చిపోలేదు.!

ఆంధ్ర రాష్ట్రం లో బాగా వెనక్కి నెట్టేయబడ్డ ప్రాంతం ఉత్తరాంధ్ర. ఆ ఉద్దానం కిడ్నీ బాధితులతో దశాబ్దాలుగా విలవిల్లాడుతోంది. అంతు చిక్కని కిడ్నీ వ్యాధులతో ఉద్దానం చితికిపోయిందన్నది నిర్వివాదాంశం. దశాబ్దాలుగా ఈ సమస్యకు...

ఎక్కువ చదివినవి

Kalki 2898 AD: ‘ఇంజనీరింగ్ అద్భుతం ఇది..’ బుజ్జిని డ్రైవ్ చేసిన నాగచైతన్య

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) నటించిన భారీ స్కేల్ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జూన్ 27న విడుదల కాబోతోంది....

Nagarjuna: ‘మనం’ @10..! తండ్రి విషయంలో భావోద్వేగమైన నాగార్జున

Nagarjuna: తెలుగు చిత్ర పరిశ్రమ లెజండరీ హీరోల్లో ఒకరు అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao). ఆయన ఆఖరి మజిలీగా తెరకెక్కిన సినిమా ‘మనం’ (Manam). టాలీవుడ్ (Tollywood) చరిత్రలోనే ఈ సినిమా...

ఈవీఎంని పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు ఓ వైసిపి ఎమ్మెల్యే ఈవీఎం ని ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 13 న పొలింగ్ జరుగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి...

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో వైరల్

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే పండగే. ఎన్ని పనులున్నా ఆగిపోతాం. అయితే.....

Devara: ‘బడా నిర్మాత బడాయి కబుర్లు..’ దేవర పాటకు నెటిజన్స్ ట్రోలింగ్

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా దేవర (Devara). ఇటివలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఫియర్ సాంగ్ అని విడుదల చేశారు. అయితే.....