అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు ఓ వైసిపి ఎమ్మెల్యే ఈవీఎం ని ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 13 న పొలింగ్ జరుగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి పోలింగ్ కేంద్రంలోకి చొరబడి ఈవీఎం ని పగలగొట్టిన వీడియోలు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో కలకలం రేగుతోంది.
మాచర్ల నియోజకవర్గం లోని రెంటచింతల మండలం పరిధిలో ఉన్న పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రం (202) లో ఓటింగ్ జరుగుతున్న సమయంలో పిన్నెల్లి పోలింగ్ స్టేషన్ లోకి వెళ్లి అక్కడ సిబ్బందిని బెదిరిస్తూ.. కౌంటర్లోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఏజెంట్ల పై ఎమ్మెల్యే అనుచరులు దాడికి దిగారు. ఆ పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడంతో అందులో రికార్డ్ అయిన ఈ దృశ్యాలు సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి.
ఈనెల 13న పోలింగ్ రోజున రాష్ట్రవ్యాప్తంగా జరిగిన విధ్వంసకాండ పై సీట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ దర్యాప్తులో అధికార పార్టీ చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
ఈసురోమని నేతలుంటే దేశమేగతిన బాగుపడునోయ్
👉 దర్జాగా పోలింగ్ బూత్‌లోకి చొరబడి దౌర్జన్యం చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి
👉ప్రజాస్వామ్య పండగ రోజునే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ఈ మహనీయులను,షౌమ్యులు,షుద్ధ పూసలు అంటూ పరిచయం చేస్తారు వీరి అధినేత
👉ఇంతటి బహిరంగ దురాగతాల్ని కూడా… pic.twitter.com/UYYbQhMz2l
— TeluguBulletin.com (@TeluguBulletin) May 21, 2024