రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అయినాగానీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం.. అన్నట్టుగా ‘రాజకీయ యుద్ధం’ నడుస్తోంది ఇరు పక్షాల మధ్య. ఒకరి మీద ఇంకొకరు పై చేయి సాధించేందుకు ఇరు వర్గాలూ ఎత్తులకు పై యెత్తులు వేస్తున్నారు. తాజాగా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో ఆసక్తకిరమైన వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా పేరుని వైఎస్సార్ జిల్లాగా గతంలోనే మార్చిన విషయం విదితమే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మరణానంతరం కడప జిల్లాకు వైఎస్సార్ జిల్లాగా నామకరణం చేశారు. ఆ విషయాన్ని గుర్తు చేసుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్, వైఎస్ హయాంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసిన విషయాన్ని ప్రస్తావించారు.
రాజ్ భవన్‌లోనూ విధులు నిర్వర్తించాననీ, ఆర్థిక శాఖలో పనిచేస్తున్నప్పుడు తాను ఏ సూచనలు చేసినా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో విజ్ఞతతో వాటిని పరిశీలించేవారని నిమ్మగడ్డ చెప్పుకొచ్చారు. అధికారుల పట్ల ఆయన ఎంత నిబద్ధతతో వ్యవహరించిందీ ప్రస్తావించారు. అయినా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు.? వైఎస్సార్.. అంటే, ప్రస్తుత వైసీపీకి బ్రాండ్ అంబాసిడర్. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. పేరుకి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీయే అయినా, అధికార వైసీపీ పేరుని ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’గానే పిలుస్తున్నాం. స్థానిక ఎన్నికల వేళ రాజకీయాలు మాట్లాడకూడని నిమ్మగడ్డ రమేష్ కుమార్, వైసీపీకి అనుకూలంగా ఎలా మాట్లాడతారు.? అంటూ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డలో అనూహ్యంగా వచ్చిన ఈ మార్పుని ఎలా అర్థం చేసుకోవాలి.? వైఎస్సార్‌ని పొగడం ద్వారా వైఎస్ జగన్‌కి నిమ్మగడ్డ సెటైర్లు వేశారనుకోవాలా.? రాజకీయ నాయకుడ్ని మించిన రాజకీయ చాణక్యం నిమ్మగడ్డ ప్రయోగించిన వైనం ఇప్పుడు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
‘ఇప్పటికైనా ఆ మహనీయుడి ఘనతను గుర్తించినందుకు సంతోషం. ఆయన వారసుడిగా వైఎస్ జగన్ కూడా అదే బాటలో నడుస్తున్నారు..’ అంటూ నిమ్మగడ్డ మీద బులుగు సపోర్టర్స్ సెటైర్లు దంచేస్తున్నారు. కొసమెరుపేంటంటే, పలువురు మంత్రులు, అలాగే సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి మీద గవర్నర్‌కి నిమ్మగడ్డ ఫిర్యాదు చేస్తే, నిమ్మగడ్డ మీద సభాహక్కుల ఉల్లంఘన.. అంటూ అధికార పార్టీ కొత్త అస్త్రాన్ని తెరపైకి తీసుకురావడం.
598262 492982Excellent website. Lots of helpful info here. 980375
329083 64791I like this internet website because so considerably utile stuff on here : D. 980711
764798 99885I feel your suggestion would be helpful for me. I will let you know if its function for me too. Thank you for sharing this beautiful articles. thanks a lot 280136
454671 455974You created some decent points there. I looked on the internet for that problem and located many people will go in addition to with the internet internet site. 716371