Navdeep: ‘బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rev Party) వ్యవహారంలో నా పేరు రాకపోవడంపై చాలామంది నిరుత్సాహపడి ఉంటార’ని హీరో నవదీప్ (Navdeep) అన్నారు. తాను నటించిన లవ్ మౌళి (Love Mouli) ప్రమోషన్లో మీడియా అడిగిన ప్రశ్నలో భాగంగా ఆయన స్పందించారు. ‘ఏంటన్నా.. ఈసారి ఫేక్ న్యూస్ లో నువ్వు కనిపించడంలేద’ని నెటిజన్లు ప్రశ్నలు అడుగుతున్నారని అన్నారు. సినీ పరిశ్రమలో వివాదాస్పద అంశం జరిగితే మీ పేరు వచ్చేది.. ఈసారి రాలేదని ఓ విలేకరి అడగ్గా.. ‘ఈసారికి వదిలేసార’ని నవ్వుతూ అన్నారు.
సినిమా గురించి మాట్లాడుతూ.. ‘చిత్రీకరణకు ఎన్నో కష్టాలు పడ్డాం. సినిమా నిర్మాణంలో మాకు ఎదురైన అనుభవాలతో ఓ సినిమా తీయొచ్చు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కింది. ఇటివల ప్రేక్షకులు సినిమా చూసే విధానం మారింది. 2-3 వారాల్లో ఓటీటీలో చూడొచ్చని భావిస్తున్నారు. విజువల్ ఫీస్ట్ అనిపించే పెద్ద హీరోల సినిమాలకే వస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన మా లవ్ మౌళి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంద’ని అన్నారు. జూన్ 7న సినిమా విడుదల కానుంది.