Nagarjuna: తెలుగు చిత్ర పరిశ్రమ లెజండరీ హీరోల్లో ఒకరు అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao). ఆయన ఆఖరి మజిలీగా తెరకెక్కిన సినిమా ‘మనం’ (Manam). టాలీవుడ్ (Tollywood) చరిత్రలోనే ఈ సినిమా ప్రత్యేకం. కారణం.. అక్కినేని వంశం మూడు తరాల హీరోలు కలిసి నటించిన సినిమా హిట్టై క్లాసిక్ గా నిలిచింది. ఇన్ని విశేషాలున్న సినిమా విడుదలై నేటికి (మే23’ 2014) 10ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను తెలుగు రాష్ట్రాల్లో నేడు రీ-రిలీజ్ చేసారు నాగార్జున (Nagarjuna). ఈ సందర్భంగా మాట్లాడుతూ..
‘నాన్నగారు తుదిశ్వాస విడిచే వరకూ సినిమాలు చేశారు. ఇదెంతో గొప్ప విషయం. సినిమా కథ ఆయనకెంతో నచ్చింది. ఎలాగైనా సినిమాలో నటించాలని తపించారు. ఇబ్బంది పడుతూనే షూటింగ్ కి వచ్చేవారు. డబ్బింగ్ మాత్రం ఇంట్లోనే ఆయనకు సౌకర్యంగా ఉండేలా ఏర్పాటు చేశాం. దర్శకుడు విక్రమ్, మ్యూజిక్ డైరక్టర్ అనూప్.. టీమ్ ఎంతో కష్టపడ్డాం. ప్రతిఫలంగా “మనం” క్లాసిక్ గా నిలిచింది. కాకపోతే.. బిగ్ స్క్రీన్ పై నాన్నగారికి సినిమా చూపించలేకపోయాననే బాధ జీవితాంతం ఉంటుంద’ని అన్నారు.