Switch to English

సినిమా రివ్యూ : నిను వీడని నీడను నేనే

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

నటీనటులు : సందీప్ కిషన్, అన్యా సింగ్, పోసాని, మురళి శర్మ, వెన్నెల కిషోర్ తదితరులు ..
రేటింగ్ : 2. 75 / 5
కెమెరా : ప్రమోద్ వర్మ
ఎడిటింగ్ : ప్రవీణ్
దర్శకత్వం : కార్తీక్ రాజు
నిర్మాతలు : దయా పన్నేం , సందీప్ కిషన్ , విజి సుబ్రహ్మణ్యన్

దాదాపుగా రెండేళ్లకు పైగా తాను చేసిన సినిమాలు ఏ ఒక్కటి సరైన విజయాన్ని అందివ్వలేదు సందీప్ కిషన్ కు. దాంతో కెరీర్ పరంగా వెనకబడ్డ సందీప్ ఎలాగైనా సరే మంచి హిట్ కొట్టాలన్న కసితో అటు నిర్మాతగా మారుతూ తన స్నేహితులతో కలిసి చేసిన ప్రయోగమే నిను వీడని నీడను నేనే. కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సందీప్ కు ఎలాంటి హిట్ అందించింది అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..

కథ:

2035 లో కథ మొదలవుతుంది. ఓ సైకలాజికల్ కేసు విషయమై ఇద్దరు స్కాలర్స్ మానసిక వైద్యుడైన మురళి శర్మను కలవడానికి వస్తారు. ఆ కేసు విషయంలో తాను డీల్ చేసిన ఓ కొత్త తరహా కేసు గురించి చెబుతాడు. అప్పుడే కథ మొదలవుతుంది. రిషి ( సందీప్ కిషన్ ), దియా ( అన్య సింగ్ ) కొత్తగా పెళ్ళైన జంట. ఇద్దరూ సపరేట్ గా ఉంటూ ఆనందమయమైన జీవితం గడుపుతున్నారు. అలాంటి వారి జీవితంలో దియా పుట్టినరోజు సందర్బంగా ఓ రిసార్ట్ కు వెళ్లి తిరుగు ప్రయాణం అవుతారు .. ఆ దారిలో నగర శివారుల్లో వీరి కారు యాక్సిడెంట్ అవుతుంది. ఆ ప్రమాదం జరిగిన తరువాత ఇద్దరు మరో కార్ లో ఇంటికి చేరుకుంటారు. అక్కడ ఫ్రెష్ అప్ అవుతున్న సమయంలో అనుకోకుండా అద్దంలో రిషి కి బదులు మరో వ్యక్తి కనిపిస్తాడు ? అలాగే దియాకు కూడా అచ్చంగా ఇలాంటి సంఘటన జరుగుతుంది. ఆమె అద్దంలో చూసుకున్నప్పుడు మరో అమ్మాయి కనిపిస్తుంది. దాంతో షాక్ అయిన రిషి, దియా ఇద్దరూ మానసిక డాక్టర్ మురళి శర్మను కలుస్తారు. అసలు వారి జీవితాల్లో జరిగిన అసలు సంఘటనలు ఏమిటి ? నిజానికి అద్దంలో కనిపిస్తున్న ఆ ఇద్దరు ఎవరు? అన్న కోణంలో డాక్టర్ కేస్ డీల్ చేస్తుంటాడు. ఈ కేసులో సి ఐ పోసాని ( పోసాని ) హెల్ప్ తీసుకుంటాడు. వారిద్దరికీ రిషి, దియాలకు ఉన్న సంబంధం ఏమిటి ? అసలు సందీప్ కిషన్ లో వెన్నెల కిషోర్ ఆత్మ ఎందుకుంది అన్నది అసలు కథ.

నటీనటుల ప్రతిభ :

చనిపోయిన ఒక మనిషి ఆత్మ బతికి ఉన్న వ్యక్తి లో ప్రవేశించడం అనే పాయింట్ తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఇందులో కొత్తగా బతికి ఉన్న మనిషి అద్దంలో చూసుకుంటే మరో మనిషిలా కనిపించడం ఏమిటి అన్నది కొత్త పాయింట్. ఈ సినిమాలో హీరో సందీప్ కిషన్ చక్కగా చేసాడు. అతని పాత్ర లో అన్ని రకాల ఎమోషన్స్ పలికించాడు. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో మెప్పించాడు. హీరోయిన్ అన్యా సింగ్ నటన విషయంలో పెద్దగా ఆకట్టుకోదు. గ్లామర్, రొమాంటిక్ విషయాల్లో బాగానే చేసింది. ఇక మురళి శర్మ, పోసానిల నటన ఆకట్టుకుంది. ముఖ్యంగా పోసాని చేసే కామెడీ బాగా పండింది. ఆత్మగా వెన్నెల కిషోర్ ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ అతని నుండి ఊహించిన కామెడీ మాత్రం ఇవ్వలేదు. మిగతా పాత్రల్లో వారు వారు బాగానే చేసారు.

టెక్నీకల్ హైలెట్స్ :

దర్శకుడు ఓ కొత్త కథను ఎంచుకున్నప్పటికీ దాన్ని నడిపించే విషయంలో కాస్త తడబడ్డాడు. ప్రతిబింబానికి, నీడకు ఉన్న వ్యత్యాసాన్ని చూపించే ప్రయత్నం చేయలేదు. అయితే మొదటి భాగాన్ని బాగానే బాగా డీల్ చేసిన దర్శకుడు రెండో భాగం విషయంలో టెన్షన్ పడ్డాడనిపిస్తుంది. అందుకే చాలా సన్నివేశాలు సాగదీసినట్టుగా ఉంటాయి. ఇక థమన్ అందించిన ఆర్ ఆర్,బాగుంది . అలాగే ఓ సాంగ్ కూడా పరవాలేదనిపిస్తుంది. చివర్లో వచ్చిన ఎమోషనల్ సాంగ్ సూపర్. ఇక పీకే వర్మ కెమెరా వర్క్ బాగుంది. చాలా సన్నివేశాల్లో ఫోటోగ్రఫి తో ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. ఎడిటింగ్ విషయంలో ప్రవీణ్ ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. చాలా భాగాలు కాస్త బోర్ కొట్టేలా సాగుతాయి. ప్రొడక్షన్ విలువలు ఫరవాలేదు. అయితే దర్శకుడు ఎంచుకున్న కథను అంతే బిగువుగా నడిపించలేకపోయాడు. సెకండాఫ్ చాలా నీరసంగా సాగుతుంది. సినిమాలో అసలు ట్విస్ట్ ని ఎలాంటి క్యూరియాసిటీ లేకుండా రివీల్ చేయడం కూడా బాగాలేదు.

విశ్లేషణ :

ఆసక్తికరమైన కథను ఎంచుకున్న దర్శకుడు కథనాన్ని మాత్రం అంత ఆసక్తి లేకుండా నడిపించాడు. ఓ కొత్త పాయింటు ను తీసుకున్నప్పటికీ. అలాంటి అరుదైన సంఘటన ఇద్దరికీ జరగడం ఏమిటి ? అన్న సందేహాలు కలిగేలా చేసాడు. ఏదో గతంలో జరిగిన సంఘటనను ఇన్స్పైర్ అయినా ఈ కథలో ఆ ఇంటెన్షన్ అనేది కనపడదు. మొదటి భాగంలో ఉన్న స్పీడ్ రెండో భాగం వచ్చే సరికి తగ్గిపోయి బోర్ కొట్టేలా చేసింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా విసిగిస్తాయి. మొత్తానికి హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో అనుకోని మలుపులు, సంఘటనలతో ఆకట్టుకునే విధంగా సాగె కథనాన్ని దర్శకుడు అనవసర కొనసాగింపులతో బోర్ కొట్టేలా చేసారు. అద్దంలో నీ బదులు మరో వ్యక్తి కనపడితే అంటూ ఆసక్తి రేపిన ఈ సినిమా ఆ రేంజ్ ఎగ్జయిట్మెంట్ అన్నది లేకపోవడం విచిత్రంగా అనిపిస్తుంది. మొత్తానికి కొత్త దర్శకుడు చేసిన ప్రయత్నం బాగున్నా కొన్ని ఆకట్టుకోని సన్నివేశాలు, కథనాన్ని నెమ్మదిగా సాగేలా చేసాయి. సందీప్ కిషన్ నటన, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునే అంశాలు.

ట్యాగ్ లైన్ : అద్దంలో .. శూన్యం !!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...