Switch to English

సినిమా రివ్యూ : దొరసాని

నటీనటులు : ఆనంద్ దేవరకొండ, శివాత్మిక, వినయ్ వర్మ, కిషోర్, శరణ్య, వంశీకృష్ణ తదితరులు ..
రేటింగ్ : 2. 75 / 5
సమర్పణ : డి సురేష్ బాబు
సంగీతం : ప్రశాంత్ విహారి
ఎడిటింగ్ : నవీన్ నూలి
కెమెరా : సన్నీ కూరపాటి
దర్శకత్వం : కెవిఆర్ మహేంద్ర
నిర్మాతలు : మధుర శ్రీధర్, యాష్ రేంగినేని

ప్రేమకథలు ఎప్పుడు కొత్తగానే ఉంటాయి … కథలు పాతవైనప్పటికీ ప్రేమ మాత్రం ఎప్పుడు కొత్తదే. ప్రేమ కావ్యాలంటే ప్రేక్షకులకు ఉండే ఆసక్తి వేరు. అందుకే వెండి తెరపై ఎప్పుడూ ప్రేమకథలు వస్తూనే ఉంటాయి. ప్రేమ కథలకు మరణం లేదు. అందుకే తాజాగా ఓ సరికొత్త ప్రేమకథను ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నం చేసాడు కొత్త దర్శకుడు కెవిఆర్ మహేంద్ర. తెలంగాణ ప్రాంతంలో దొరలూ, దొరల ఘడీల నేపథ్యంలో ఈ కథను తీసుకున్నాడు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ను హీరోగా, హీరో రాజ శేఖర్ , జీవితల రెండో కుమార్తె శివాత్మికను హీరోయిన్ గా పరిచయం చేస్తూ తెరకెక్కిన చిత్రం దొరసాని. ఇప్పటికే టీజర్ ట్రైలర్లతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేసాయి. మరి దొరసాని ఆ ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ :

నక్సలైట్ లీడర్ శివన్న ( కిషోర్ ) 30 ఏళ్లుగా జైలు జీవితం అనుభవించి విడుదల అవుతాడు. విడుదలైన శివన్న రాజు అనే తన పాత స్నేహితుడికోసం జయగిరి అనే గ్రామానికి వస్తాడు. అక్కడ రాజు గురించి వాకబు చేస్తాడు, కానీ రాజు ఎవరో తెలియదని అక్కడి వాళ్ళు చెప్పడంతో పక్కనే ఉన్న ఘడి దగ్గరకు వెళ్తాడు. ఆయన్నే అనుసరించి వచ్చిన మరో వ్యక్తి రాజు గురించి తనకు తెలుసనీ అసలు కథ చెబుతాడు. రాజు ( ఆనంద్ దేవరకొండ ) జయగిరిలో ఐదో తరగతి వరకు చదువుకుని ఆ తరువాత పై చదువుల కోసం వాళ్ళ అమ్మమ్మ ఊరిలో ఉండి చదువుకునే కుర్రాడు. సెలవులకు తన ఊరికి వచ్చి వెళుతుంటాడు. తన స్నేహితులతో జాలీగా ఉన్న ఆ కుర్రాడికి ఊరిలో బతుకమ్మ పండగ సందర్బంగా ఆ ఊరి దొర ( వినయ్ వర్మ ) కూతురు చిన్న దొరసాని అలియాస్ దేవకీ ( శివాత్మిక ) ని చూస్తాడు. మొదటి చూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. అతని పట్ల దొరసాని కూడా ఆకర్షితురాలు అవుతుంది. ఆ తరువాత ఇద్దరు ప్రేమలో పడతారు. అయితే తమ ప్రేమకు అంతస్తులు, కులం అడ్డొస్తుంది. ఆ అడ్డంకులు వచ్చినా కూడా ప్రేమలో ఒక్కటయ్యేందుకు సిద్ధమవుతారు. ఈ విషయం దొర కు తెలుస్తుంది. ఆ తరువాత జరిగిన పరిస్థితులు ఏమిటి ? దొర రాజుని ఎం చేసాడు? వీరిద్దరు ఒకటయ్యారా లేదా అన్నది మిగతా కథ.

నటీనటుల ప్రతిభ :

దాదాపు ముప్పయేళ్ల క్రితం జరిగిన కథ ఇది. ఓ దొర కూతురిని ఓ కూలివాడి కొడుకు ప్రేమిస్తే ఏమవుతుంది ? అన్న పాయింటును తీసుకుని తెరకేకించిన చిత్రం దొరసాని. ఈ కథలో చివరగా ఏమి జరుగుతుంది అన్నది అందరికి తెలిసిన జవాబే .. కానీ దాన్ని చివరిదాకా తీసుకెళ్లిన విధానం ఆకట్టుంది. ఇక రాజు పాత్రలో ఆనంద్ బాగా చేసాడు. ప్రేమికుడిగా ప్రేమకోసం తపించే పోయే పాత్రలో ఆకట్టుకున్నాడు. అయితే హీరో పాత్రలో ఎలాంటి ఎమోషన్ అన్నది కరక్ట్ గా చూపించే ప్రయత్నం చేయలేదు. ప్రేమించిన వాడు ప్రేమకోసం ఎవ్వరినైనా ఎదిరిస్తాడు అన్న పాయింట్ ని దర్శకుడు మరచిపోయాడు అని అనిపిస్తుంది. ఇక దొరసాని గా శివాత్మిక నటన సూపర్. నిజంగా దొరసాని పాత్రలో ఆమె ఆకట్టుకుంది. తాను కూడా ప్రేమలో పడడం. ప్రేమికుడికోసం ఎదురు చూడడం లాంటివాటిలో బాగా చేసింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ విషయంలో ఇంకా బాగా చేయాలి. కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇక దొరగా వినయ్ వర్మ తనదైన ఆహార్యంతో ఆకట్టుకున్నాడు. అలాగే నక్సలైట్ శేఖర్ అన్న గా కిషోర్ బాగా చేసాడు. వినయ్ వర్మ, కిషోర్ ల నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి.

టెక్నీకల్ హైలెట్స్ ;

దొరసాని సినిమాకు టెక్నీకల్ అంశాలు హైలెట్ గా నిలిచాయి. నిజంగా సరైన సాంకేతిక నిపుణులు కలిస్తే ఆ మ్యాజిక్ ఎలా ఉంటుందో ఈ సినిమా చూపించింది. ప్రశాంత్ విహారి మ్యూజిక్ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది. రీ రీకార్డింగ్ తో పాటు పాటలు కథను డ్రైవ్ చేసాయి. ఇక సన్నీ కూరపాటి ఛాయాగ్రహణం మరో హైలెట్. కథను ఆసక్తికరంగా చూపించే విషయంలో కెమెరా వర్క్ సూపర్. ఇక ఎడిటింగ్ విషయంలోనే ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. కథనం చాలా నెమ్మదించింది. సెకండాఫ్ బోర్ కొట్టేలామారింది. ఇక దర్శకుడు మహేంద్ర ఎంచుకున్న కథ పాతదే అయినా దాన్ని ప్రజెంట్ చేసే విషయంలో చాలా నిజాయితీగా కథను చెప్పే ప్రయత్నం చేసాడు. ఈ సినిమాలో ఏకంగా 30 మందికి పైగా కొత్త నటీనటులను పరిచయం చేస్తూ .. నిజంగా ఆ గ్రామంలో జరిగిందా అన్న విధంగా బాగా తెరకెక్కించాడు. అయితే 30 ఏళ్ళ క్రిందట జరిగిన కథ ను తీసుకున్నప్పటికీ ఆ కథలో ఏమాత్రం కొత్తదనం లేకపోవడం, నెక్స్ట్ ఏమి జరుగుతుందో ఊహించేయడం వంటి విషయాలు మైనస్ గా మారాయి.

విశ్లేషణ :

కథ ముప్పై ఏళ్ల క్రితం జరిగింది కాబట్టి ఆ కథను చెబుతున్నప్పుడు అందులో ఏదైనా విశేషం ఉంటుందా అన్న పాయింట్ లో ప్రేక్షకుడు ఆలోచిస్తాడు. ఊహిస్తాడు. కానీ అలాంటివి ఏమి లేకుండా ఫ్లాట్ గా కథ సాగడం. కథనం మరి స్లో గా నడవడం ప్రేక్షకులకు బోర్ కొట్టేలా చేస్తుంది. నటి నటులు, టెక్నీకల్ అంశాలు బాగున్నప్పటికీ అందులో ఆసక్తి కలిగించే అంశాలే లేవు. తెలంగాణ ప్రాంతం, అప్పటి గ్రామీణ వాతావరణం బాగా చూపించారు. కానీ సగటు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసేలా ఎలాంటి ఆకట్టుకునే అంశం లేకపోవడం దొరసానిలో పెద్ద మైనస్. పెద్దింటి అమ్మాయి .. పేదింటి అబ్బాయి ప్రేమ కథ … ఇది రొటీన్ ఫార్ములా .. కానీ అందులో కొత్తదనం కోసం దర్శకుడు ఎక్కడా ట్రై చేయలేదు.

ట్యాగ్ లైన్ : దొరసాని .. ఊహించిందే !!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

కార్తికేయ 2 మూవీ రివ్యూ: డీసెంట్ థ్రిల్లర్

నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది....

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనకు కీర్తి కిరీటం ‘ఆపద్భాంధవుడు

మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్,...

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్...

దిల్ రాజుకు మెగా షాక్..! ఒక్కరోజులో ఏకంగా 36వేల ట్వీట్స్ చేసిన...

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు పేరు ఒక్కసారిగా ట్విట్టర్ లో ట్రెండింగ్ అయింది. ఆయన పేరు సోషల్ మీడియాలో హెరెత్తిపోయేలా చేశారు. ఇదంతా మెగా...

రాజకీయం

వైఎస్ విజయమ్మకి రోడ్డు ప్రమాదం.! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అనుమానం.!

కారు టైర్లు పేలిపోవడం అనేది జరగకూడని విషయమేమీ కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంటుంది. కార్ల టైర్లను సరిగ్గా మెయిన్‌టెయిన్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. మామూలు వ్యక్తుల...

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.!

ఎవరో తిడితే, ఇంకెవరో క్షమాపణ చెప్పాలట.! ఇదెక్కడి పంచాయితీ.? ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టబడాలనే ఆలోచనతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వున్నట్టున్నారు. లేకపోతే, అద్దంకి దయాకర్ తన మీద చేసిన...

ఛీరెడ్డి బూతులు.! ‘బూతుల శాఖ’ దక్కుతుందా.?

బూతులు తిట్టారు, నానా యాగీ చేశారు.. చివరికి కొడాలి నాని పరిస్థితి ఏమయ్యింది.? మంత్రి పదవి ఊడింది.! ఇది చూసైనా, వైసీపీలో చాలామందికి బుద్ధి రావాలి కదా.? కానీ, అంతకు మించి ఎగిరెగిరి...

గోరంట్ల మాధవ్‌కి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తోన్న టీడీపీ.?

మళ్ళీ మళ్ళీ అదే చర్చ.! రాజకీయాలు దిగజారిపోయాయి, అత్యంత జుగుప్సాకరమైన స్థాయికి దిగజారిపోయాయి. ప్రతిసారీ దిగజారిపోవడంలో కొత్త లోతుల్ని వెతుకుంటున్నారు రాజకీయ నాయకులు. రాజకీయ పార్టీలు సైతం, తమ స్థాయిని ఎప్పటికప్పుడు దిగజార్చుకోవడానికే...

కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణలు.. ఆ వ్యాఖ్యలు సరైనవి కావు..

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా క్షమాపణ చెప్పారు. నల్గొండ జిల్లా చుండూరు సభలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు...

ఎక్కువ చదివినవి

కాపు సామాజికవర్గమెందుకు అధికార పీఠమెక్కకూడదు.?

అయితే, కమ్మ సామాజిక వర్గం.. లేదంటే రెడ్డి సామాజిక వర్గం.! అంతేనా, ఈ రెండూ తప్ప, ఇంకో సామాజిక వర్గం అధికార పీఠమెక్కకూడదా.? ఈ చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో...

బంగ్లాదేశ్ మరో శ్రీలంక కానుందా..!

శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏ పరిస్థితులకు దారి తీసిందో చూస్తూనే ఉన్నాం. అక్కడి పరిస్థితుల నుండి ప్రతి దేశం కూడా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. శ్రీలంగా చేసిన తప్పిదాలను ఏ దేశం...

డీజే టిల్లు2లో ఈ మల్లు బ్యూటీ?

సిద్ధూ జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా లిమిటెడ్ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్బ్ రిజల్ట్ ను అందుకుంది. ఈ...

ఈ విజయం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది : రష్మిక

దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా, రష్మిక మందన కీలక పాత్రలో అశ్వినీదత్ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొంది తాజాగా విడుదలైన ఈ చిత్రం అన్ని...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి ఇమేజ్ ను ఎవరెస్ట్ ఎత్తుకు తీసుకెళ్లిన ‘గ్యాంగ్ లీడర్’

‘మెగాస్టార్’ అనేది చాలా పెద్ద ట్యాగ్. చిరంజీవి అభిమానులే కాదు, ప్రేక్షకులు, విమర్శకులు, ట్రేడ్, పరిశ్రమ మొత్తం చెప్పే మాట. చిరంజీవి తన కష్టంతో, సినిమాపై ఇష్టంతో సాధించిన ఆభరణమే మెగాస్టార్. డైనమిక్...