Switch to English

బడ్జెట్‌ కెవ్వుకేక.. నిధులు వచ్చేదెలా జగన్‌ సారూ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

గత బడ్జెట్‌ కంటే ఈసారి బడ్జెట్‌ ఎక్కువ చూపాల్సిందే. అది ఆనవాయితీ. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కూడా అదే ఆనవాయితీని ఫాలో అయ్యింది. 2 కోట్ల 27 లక్షల 974.99 కోట్ల రూపాయలతో బడ్జెట్‌ అంచనాలతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ని ప్రవేశ పెట్టారు. దీన్ని జంబో బడ్జెట్‌ అనో, బాహబలి బడ్జెట్‌ అనో పిలవొచ్చు. ఏ ఏడాదికాయేడాది అంచనాలు పెరిగిపోతుంటాయ్‌.. అది సహజం. కానీ, వచ్చే ఆదాయం సంగతేంటి.? ఇది మాత్రం మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

నిజానికి, ఆంధ్రప్రదేశ్‌ అత్యంత దారుణమైన పరిస్థితుల్లో వుంది ఆర్థికంగా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన కారణంగా ఏర్పడిన నష్టమిది. అప్పటినుంచీ లోటు పెరుగుతూ వస్తోంది. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సాయం మాత్రం అందడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ, బడ్జెట్‌ని భలేగా ప్యాక్‌ చేసేసింది వైఎస్‌ జగన్‌ సర్కార్‌. గిఫ్ట్‌ బాక్స్‌ అదిరిపోయింది.. కానీ, అందులో కంటెంట్‌ మాటేమిటి.? విపక్షాల మాటల్లో చెప్పాలంటే, ఇదొక డొల్ల బడ్జెట్‌. విపక్షాలు విమర్శిస్తున్నాయని కాదుగానీ, ఆ విమర్శల్లోనూ నిజం లేకపోలేదు.

ఆంధ్రప్రదేశ్‌కి ఆశించిన స్థాయిలో రాబడి రావడంలేదన్నది నిర్వివాదాంశం. ఆ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డే పలు సందర్భాల్లో సెలవిచ్చారు. మరి, బడ్జెట్‌ అంచనాల్ని ఇంత ఘనంగా ఎలా ప్రకటించేశారు.? ఇదే మరి, మ్యాజిక్‌ అంటే.!

నవరత్నాలకు సంబంధించి కేటాయింపులు ఘనంగా వున్నాయి. శాఖల వారీగా చూసుకున్నా, కేటాయింపుల పరంగా తప్పు పట్టడానికేమీ లేదు. జేబులో డబ్బులుంటే, దాన్ని ఫలానా విధంగా కర్చు పెట్టవచ్చునని లెక్కలేసుకోవచ్చు. లేని డబ్బులకి లెక్కలేయడమేంటి.? ఇదే ఇక్కడ అసలు సమస్య. వైఎస్‌ జగన్‌ సర్కార్‌ చేస్తోన్నది అదే. ఎన్నికల ప్రచారం సందర్భంగా హామీలు ఇచ్చేశారు.. అవిప్పుడు అమలు చేయాలంటే అంత తేలిక కాదు. కానీ, తప్పదు.. తొలి బడ్జెట్‌తోనే ప్రజల్ని నిరాశపర్చకూడదు. అదే వైఎస్‌ జగన్‌ చేస్తున్నది.

శాఖల వారీగా నిధుల కేటాయింపు అదిరిపోయిందిగానీ.. ఆయా శాఖలకి ఆ నిధులు విడుదల చేయాల్సి వచ్చినప్పుడు అసలు సంగతి బట్టబయలయిపోతుంది. ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, కేంద్రాన్ని ‘దేహీ’ అని అడుక్కోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌ది. అట్నుంచి ఆశించిన స్థాయిలో సాయం లేనప్పుడు, ఈ రెండు కోట్ల పాతిక లక్షల కోట్ల బడ్జెట్‌ ఎవర్ని మోసం చేయడానికి ప్రవేశపెట్టారు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారూ.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

ఎక్కువ చదివినవి

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పేదల పక్షాన పోరాడే...