విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ ఆలయంలోని అవినీతి అనకొండలపై వేటు పడింది. ఆలయంలో చోటుచేసుకున్న అక్రమాలన్నీ ఇంటి దొంగల పనే అని అవినీతి నిరోధక శాఖ నిగ్గు తేల్చింది. దీంతో గుడిలోని ఐదుగురు సూపరిండెంట్లతోపాటు మొత్తం 13 మంది ఉద్యోగులపై దేవాదాయశాఖ సస్పెన్షన్ వేటు వేసింది. మూడు రోజులుగా జరిపిన తనిఖీల్లో వెల్లడైన అక్రమాలపై ఏసీబీ నివేదిక ఇచ్చింది. దీంతో ఏడు విభాగాల్లోని ఐదుగురు సూపరిండెంట్లు, 8 మంది సిబ్బందిని సస్పెండ్ చేస్తూ దేవాదాయశాఖ కమిషనర్ అర్జునరావు ఆదేశాలు జారీచేశారు. అన్నదానం, టికెట్ల అమ్మకాలు, చీరల విభాగాల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు ఏసీబీ తన నివేదికలో పేర్కొంది.
అయితే, ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యుడైన ఈవోను వదిలేసి కేవలం ఉద్యోగులపైనే చర్యలు తీసుకోవడం ఏమిటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇంద్రకీలాద్రిపై జరిగే అక్రమాలన్నింటికీ ఈవో సురేష్ కుమారే కేంద్ర బిందువు అని, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అండతో ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. పైగా నిబంధనలకు విరుద్ధంగా ఆయన్ను దుర్గ గుడి ఈవోగా నియమించారనే అంశంపై హైకోర్టులో కేసు కూడా నడుస్తోంది. అన్నవరం దేవస్థానం ఇన్ చార్జి ఈవోగా ఉన్న సురేష్ కుమార్ ను మంత్రి వెల్లంపల్లి ఏరికోరి మరీ దుర్గగుడి ఈవోగా తీసుకొచ్చారు. ఈ వ్యవహారం అంతా అక్రమమని ఆయన సహచరులు కోర్టకు వెళ్లారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది.
125213 91755Sounds like some thing a lot of baby boomers need to study. The feelings of neglect are there in several levels when a single is more than the hill. 48184
661489 834390Hi, you used to write exceptional articles, but the last several posts have been kinda boring I miss your super writing. Past several posts are just slightly out of track! 411679
221850 44606Some really good stuff on this web internet site , I like it. 712584
738551 452609Hi there. Really cool website!! Guy .. Beautiful .. Fantastic .. I will bookmark your website and take the feeds additionallyI am glad to locate so much beneficial info correct here inside the write-up. Thanks for sharing 287578
185134 354065Sorry for the huge review, but Im genuinely loving the new Zune, and hope this, as well as the superb reviews some other people have written, will support you decide if its the correct choice for you. 490794