హైదరాబాద్లోని రాజ్ భవన్ లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా గవర్నర్ తమిళిసై జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఎన్నో రంగాల్లో ముందుకు వెళ్తోంది. తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టేందుకు అందరం కృషి చేయాలి. కొత్త భవనాలు నిర్మించడం అభివృద్ధి కాదు. సగటు ప్రజల ఆకాంక్షలు నెరవేరాలి. అదే నిజమైన అభివృద్ధి. ఫామ్ హౌస్ లు కాదు.. అందరికీ ఇళ్లు ఉండాలి. మన పిల్లలు విదేశాల్లో చదవడం కాదు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో అంతర్జాతీయస్థాయి మార్పులు రావాలి’.
‘కొందరికి నేను నచ్చకపోవచ్చు. కానీ.. తెలంగాణ ప్రజల అభివృద్ధికి నిత్యం కృషి చేస్తూనే ఉంటాను. నిజాయితీ, ప్రేమ, కష్టపడేతత్వం నా బలాలు. తెలంగాణతో నా బంధం మూడేళ్లు కాదు.. పుట్టుకతోనే తెలంగాణతో బంధం ఏర్పడింద’ని అన్నారు.