‘ఇప్పటికి రాష్ట్రాన్ని విడగొట్టింది చాలు.. ఇక ఆపండి. మరోసారి ఏపీని విడగొడతామంటే తోలు తీసి కింద కూర్చోబెడతాం’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రిపబ్లిక్ డే సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు.
‘రిపబ్లిక్ డే రోజున చెప్తున్నా.. ఏ పార్టీ నేతలైనా వేర్పాటువాదంతో మాట్లాడితే నాలాంటి తీవ్రవాదిని ఇంకోసారి చూడరు. రాయలసీమ నుంచి ఎందరో సీఎంలు వచ్చినా అభివృద్ధి లేదు.. వలసలను ఆపలేకపోయారు. ఉత్తరాంధ్ర నాయకులు ఆ ప్రాంతానికేం చేశారు. మీ బతుకులకేం తెలుసు. ఒక్కసారైనా కాన్సిట్యిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ చదివారా..? మీకు అధికారం లేకపోతే.. పబ్లిక్ పాలసీ తెలియని మీరు రాష్ట్రాన్ని విడగొట్టేస్తారా..? మేము చూస్తూ ఊరుకుంటామా..?
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం తెలంగాణలోని జగిత్యాలలో సాయిరెడ్డి చనిపోయారు. గుంటూరులో హబీబుల్లా మస్తాన్ మృతి చెందారు. ఈ విషయాలు మీకు తెలుసా. స్వార్ధ రాజకీయాల కోసం ఇష్టానుసారం స్టేట్ మెంట్లు ఇవ్వొద్దు’ అని ధ్వజమెత్తారు.