వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అందరికీ మాజీ మంత్రి కొడాలి నాని ‘ప్రత్యేక శిక్షణ’ ఇస్తున్నట్టున్నారన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.! మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా కొందరు ‘వైసీపీ మహిళా వారియర్స్’ చెలరేగిపోతున్న వైనం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి’ వాహనానికి ప్రత్యేక పూజల్ని కొండగట్టులోనూ, ఇంద్రకీలాద్రిపైనా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పూజల సమయంలో పవన్ కళ్యాణ్ వెంట ఆయన సతీమణి కనిపించలేదు. కనిపించాలన్న రూల్ ఏమైనా వుందా.? ఏమో మరి.. వైసీపీ మాత్రం ‘వుండాలంటోంది’.!
‘మూడు పెళ్ళాలలో ఒకరూ పవన్ కళ్యాణ్ వెంట లేకపోవడమేంటి.?’ అంటూ సోషల్ మీడియా వేదికగా వైసీపీ మద్దతుదారులైన మహిళా నేతలు (వీళ్ళని బులుగు కార్మికులనడం సబబేమో) కామెంట్లేస్తున్నారు.
కామెడీ ఏంటంటే, పవన్ కళ్యాణ్‌ని వీళ్ళేదో విమర్శించేస్తున్నామని సంబరపడిపోతున్నారుగానీ, కింద కామెంట్లలో వీళ్ళకి పడుతున్న సెటైర్లు అన్నీ ఇన్నీ కావు. వీళ్ళకే కాదు, వైసీపీ అధినేతకీ సెటైర్లు పడుతున్నాయి. వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరువు తీసేస్తున్నారు సాధారణ నెటిజన్లు.
‘పవన్ కళ్యాణ్ ఏమీ ప్రజా ప్రతినిథి కాదు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారిక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడూ ఆయన వెంట ఆయన సతీమణి వుండటంలేదు.. మరి, దీన్నేమనాలి.?’ అంటూ, వైసీపీ బులుగు కార్మికులకు అర్థమయ్యే భాషలోనే (అత్యంత జుగుప్సాకరంగా) కౌంటర్ ఎటాక్ ఇస్తున్నారు.
కుక్క కాటుకి చెప్పు దెబ్బే సరైనది మరి.! ఔను కదా, తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల్లో ఎప్పుడూ వైఎస్ జగన్ వెంట ఆయన సతీమణి కనిపించలేదాయె. అలాంటప్పుడు, ‘వారాహి’ కోసం చేసే పూజల్లో పవన్ కళ్యాణ్ సతీమణి లేరని కామెంట్లు చేయడమంటే.. ఇక్కడ వైసీపీ కార్మికులు పవన్ కళ్యాణ్‌ని ట్రోల్ చేస్తున్నట్లు కాదు.. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం.. అదే, వైసీపీ నుంచి పేటీఎం జీతాలు తీసుకుంటూ, వైసీపీ అధినేతని ఇరికించేయడం.!