ఇది పద్దుల చిట్టా కాదు.. వైకాపా నేర చిట్టా..!!

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సెన్సేషనల్‌ రికార్డ్‌

రాజకీయ నాయకుల విషయంలో సుప్రీం కోర్టు కీలకమైన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాలు ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకుడిని భయపెడుతున్నాయి. పార్టీ వెబ్ సైట్స్ లోను, మీడియాలోను, సోషల్ మీడియాలోను తప్పనిసరిగా రాజకీయాల్లో నేరచరిత్ర కలిగిన వ్యక్తుల వివరాలను పొందుపరచాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అందరూ దీనికి సంబంధించిన లిస్ట్ ను తయారు చేసే పనిలో ఉన్నారు.

జాతీయ మీడియాకు చెందిన కొన్ని వార్త పత్రికలు, వెబ్ సైట్లు ఈ వివరాలను పొందుపరిచేందుకు సిద్ధం అవుతున్నది. అయితే, నేర చరిత్ర కలిగిన వ్యక్తుల చిట్టా అక్కడ ఉంటుంది. డేటా ఎలా లభ్యం అవుతుంది అంటే… ఎన్నికల సమయంలో అభ్యర్థులు తమకు సంబంధించిన వివరాలను అందులో పొందుపరుస్తారు. ఎలాంటి కేసులు ఉన్నా అందులో మెన్షన్ చేయాలి. ఎన్నికల కమిషన్ దగ్గర ఆ డేటా ఉంటుంది.

అలానే ఏడిఆర్ దగ్గర కూడా ఆ డేటా ఉంటుంది. అక్కడి నుంచి డేటా కలెక్ట్ చేసుకొని నేర చరిత్ర కలిగిన వ్యక్తుల గురించి తప్పనిసరిగా ప్రచురించాలి. అయితే, ఏపీ లో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన లిస్ట్ ను ఓ మీడియా సంస్థ సేకరించింది. గత ఎన్నికల్లో గెలుపొందిన 151 మంది ఎమ్మెల్యేలలో చాలామందిపై కేసులు ఉన్నాయి.

వీరిలో అత్యధికంగా ముఖ్యమంత్రి జగన్ పై 38 కేసులు ఉన్నట్టుగా ఏడీఆర్ రిపోర్ట్ లో ఉన్నది. ఆ తరువాత మేకపాటి గౌతమ్ రెడ్డి, మోపిదేవి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, అనిల్ కుమార్ యాదవ్, మేకతోటి సుచరిత, కొడాలి నాని, కురసాల కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాథ్, పిల్లి సుభాష్ చంద్రబోస్, పాముల పుష్పశ్రీ వాణి ఇలా చాలామందిపై కేసులు ఉన్నట్టుగా, నేర స్వభావం కలిగిన అభ్యర్థులుగా ఆ మీడియా సంస్థ పేర్కొన్నది. ఇప్పుడు ఈ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. వైకాపా కు సంబంధించిన లిస్ట్ ఇలా ఉంటె, ఇక ప్రతిపక్షంలో ఉన్న నాయకుల లిస్ట్ ఎలా ఉంటుందో… ఎన్ని కేసులు ఉంటాయో త్వరలోనే బయటకు వస్తుంది.

ఇది పద్దుల చిట్టా కాదు.. వైకాపా నేర చిట్టా..!!