Switch to English

ముదిరి పాకాన పడ్తున్న వైఎస్సార్సీపీ ‘రంగుల పిచ్చి’.!

రాచరికం నాటి పరిస్థితుల్ని గుర్తు చేస్తూ గ్రామ వాలంటీర్లు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఫొటో ముందు మోకరిల్లాలట. ఉత్తరాంధ్రలో ఓ వైసీపీ నేత అరాచకం ఇది. గ్రామ వాలంటీర్లు మోకరిల్లలేదుగానీ, ఆ స్థాయిలో వైఎస్‌ జగన్‌ ఫొటోకి వంగి వంగి దండాలు పెట్టారు. ‘పిచ్చి ముదిరిపోవడం’ అంటే ఇదే మరి.! తాము ప్రజాస్వామ్యంలో వున్నామనే విషయాన్ని మరచి, రాచరిక వ్యవస్థ తాలూకు పైత్యాన్ని వైసీపీ నేతలు వంటబట్టించుకున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? ఇక, వైఎస్సార్సీపీ ‘రంగుల పిచ్చి’ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

దేవాలయాలకీ వైసీపీ రంగులేసే ప్రయత్నం చేశారు కొందరు దుర్మార్గులు. స్మశానాలు, టాయ్‌లెట్ల సంగతి సరే సరి. ప్రభుత్వ కార్యాలయాలకొచ్చేసరికి న్యాయస్థానం మొట్టికాయలు తప్పలేదు. పోనీ, న్యాయస్థానం మొట్టికాయలేశాక అయినా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి ‘రంగుల పైత్యం’ తగ్గిందా.? అంటే అదీ లేదు. ఆ వైసీపీ రంగులకు వక్రభాష్యం చెబుతూ, అదనంగా ఇంకో రంగుని ‘యాడ్‌’ చేశారు. అసలంటూ పార్టీ రంగుల్ని గుర్తుకు తెచ్చేలా ఎలాంటి రంగుల్నీ ప్రభుత్వ కార్యాలయాలకు వేయొద్దన్నది హైకోర్టు ఆదేశం. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల్ని ప్రభుత్వం బేఖాతరు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? న్యాయస్థానాల్ని ప్రభుత్వాలు లెక్క చేయకపోతే, ప్రభుత్వాల్ని ప్రజలు లెక్క చేయని రోజులు వచ్చి తీరతాయ్‌. ఆ తర్వాత జరిగే అనర్ధాలకి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

దేశంలో చాలా రాజకీయ పార్టీలున్నాయి. వాటిల్లో కొన్నిటికి రంగుల పిచ్చి వున్న మాట వాస్తవం. కానీ, మరీ ఇంతలానా.? ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీకి వున్నంత రంగుల పిచ్చి బహుశా ఇంకెక్కడా వుండదేమో. అధికారంలోకి వచ్చి ఏడాది కాకుండానే 50 సార్లకు పైగా న్యాయస్థానాలతో మొట్టికాయలేయించుకున్న ఘనత కూడా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికే దక్కుతుందేమో. వైసీపీ రంగుల పిచ్చిపై కేంద్రం జోక్యం చేసుకోవాలేమో.! లేదంటే, రాష్ట్రంలో ఇంకే ఇతర రంగులూ లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు భవనాలన్నిటికీ వైసీపీ రంగులు వేయించేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రమే ఎందుకు.? ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కార్లకీ వైసీపీ రంగులు వేయించేస్తే పోలా.? ఏమో, ఆ దిశగా కూడా సన్నాహాలు జరిగినా వింతేముంది.? ఈ రంగుల పైత్యం అక్కడితో అయినా ఆగుతుందా.!

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

బన్నీ కోసం మారుతి కథ రెడీ అయిపోయిందా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు, సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతికి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. ఇద్దరూ చాలా క్లోజ్. ఇటీవలే మారుతి మాట్లాడుతూ తామిద్దరం వాట్సాప్ లో తరచూ టచ్...

విశాఖ గ్యాస్‌ లీక్‌: ఎల్జీ పాలిమర్స్‌కి బిగ్‌ షాక్‌.?

యావత్‌ భారతదేశాన్ని కుదిపేసింది విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటన. ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన విష వాయువు లీక్‌ కావడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి కారణమైన ‘స్టైరీన్‌’...

గడిపింది బాయ్ ఫ్రెండ్ తో.. గర్భానికి కారణమని డెలివరీ బాయ్ పై కేసు

ఇదో విచిత్రమైన కేసు. చైనాకు చెందిన ఓ ముద్దుగుమ్మ తన బాయ్ ఫ్రెండ్ తో ఏకాంతంగా గడిపింది. ఫలితంగా గర్భం దాల్చింది. అయితే, అందుకు కారణం డెలివరీ బాయ్ అని, అతడు ఎనిమిది...

ఆరడుగులు సరిపోదంట..!

కరోనా మహమ్మారిని ఇప్పట్లో తరిమికొట్టడం సాధ్యం కాదని, దానితో కలిసి బతకడం అలవాటు చేసుకోవాల్సిందేనంటూ నేతల దగ్గర నుంచి న్యాయస్థానాల వరకు తేల్చి చెప్పేశాయి. ఎవరికి వారు తీసుకునే జాగ్రత్తలు వారికి రక్షణ...

ఇప్పుడా భారమంతా జక్కన్నపైనే

షూటింగ్ లు ఆగిపోయి దాదాపు రెండు నెలలు దాటింది. సినిమా మీదే ఆధారపడి జీవించే దాదాపు 12 వేల మందికి ఇప్పుడు పూట గడవడం కూడా కష్టంగానే ఉంటోంది. అందుకే చిరంజీవి, నాగార్జున...