Switch to English

హెలికాప్టర్ మనీ వచ్చే వీలుందా?

‘ప్రస్తుతం కేంద్ర, రాష్ట్రాల వద్ద నయాపైసా లేదు.. ఈ పరిస్థితుల్లో కేంద్రం క్వాంటిటేటివ్ ఈజింగ్ (క్యూఈ) లేదా హెలికాప్టర్ మనీ ద్వారా డబ్బు ఇవ్వాలి’ అని తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం ప్రధాని మోదీకి విన్నవించారు. దీంతో ఈ హెలికాప్టర్ మనీ అంటే ఏమిటి అనే సందేహాలు ఉదయించాయి.

వరదలు సంభవించి ప్రజలు ఆహారం కోసం అల్లాడుతున్నప్పుడు హెలికాప్టర్ నుంచి ఆహార పొట్లాలు జారవిడవడం చాలామందికి తెలుసు. బాధితుల వద్దకు వెళ్లి ఆహారం అందించే పరిస్థితి లేకపోవడంతో ఇలా ఆహార పొట్లాలను హెలికాప్టర్ నుంచి జారవిడుస్తారు. వాటి ద్వారా బాధిత ప్రజల ఆకలి తీరుతుంది. ఇప్పుడు అదే తరహాలో హెలికాప్టర్ మనీ ఇవ్వాలని కేసీఆర్ ప్రతిపాదించారు. అంటే.. హెలికాప్టర్ నుంచి డబ్బులు జారవిడవాలని కాదు. ఆర్థిక సంక్షోభం తలెత్తిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోకుండా కొంత మొత్తాన్ని మార్కెట్ లోకి పంపించడాన్నే హెలికాప్టర్ మనీ అంటారు.

రిజర్వుబ్యాంకు తన వద్ద నిధులను వివిధ మార్గాల్లో మార్కెట్లోకి పంప్ చేస్తుంది. దీంతో ఆర్థిక కార్యకలాపాలు పెరగడం ద్వారా వృద్ధిరేటు పడిపోకుండా ఉంటుంది. ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు, ఒక దేశం వృద్ధిరేటు ఘోరంగా పడిపోయినప్పుడు ఈ విధానాన్ని అనుసరిస్తుంటారు. 2016లో జపాన్ దీనినే అనుసరించింది. ఇక క్యూఈ విధానం వేరు. ఇందులో ప్రభుత్వాల నుంచి బాండ్లను తీసుకుని రిజర్వు బ్యాంకు నగదు ఇస్తుంది. తద్వారా మార్కెట్ లో నగదు సర్క్యులేట్ అవుతుంది. ఆర్థిక సంక్షోభం వంటి పరిస్థితులు ఎప్పుడు తలెత్తినా ఈ రెండు విధానాలూ చర్చకు వస్తాయి.

మరి ప్రస్తుతం కేసీఆర్ ప్రతిపాదించినట్టుగా హెలికాప్టర్ మనీ వచ్చే వీలుందా? దేశ జీడీపీలో 5 శాతం.. అంటే దాదాపు పది లక్షల కోట్లను ఇవ్వాలని కేసీఆర్ కోరారు. రిజర్వు బ్యాంకు వద్దనున్న మిగులు నిధులనే ఈ రూపంలో ఇవ్వాలి. కానీ ప్రస్తుతం అంత మొత్తం ఆర్బీఐ వద్ద ఉందా అనేది సందేహమే. గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా మోదీ సర్కారు ఆర్బీఐ వద్దనున్న 1.75 లక్షల కోట్లను మళ్లించుకుని సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టేసింది. పైగా ఇటీవల కరోనా ప్యాకేజీ కింద 1.70 లక్షల కోట్లను ప్రకటించింది. దీంతో ప్రస్తుతం కేంద్రం వద్ద కూడా నయా పైసా లేదు. దీంతో మనీ హెలికాప్టర్ ఎక్కే అవకాశం ఏమీ కనిపించడంలేదు.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

యూపీ సీఎం యోగి నిర్ణయం అదిరింది

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్ లో విధించిన లాక్ డౌన్ కారణంగా కోట్లాది మంది వలస కార్మికులు ఎన్ని అవస్థలు పడ్డారో చూశాం. లాక్ డౌన్ విధించి రెండు నెలలు పూర్తవుతున్నా.. ఇప్పటికీ...

వైఎస్‌ జగన్‌ పాలనకు ఏడాది.. ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని ఏదీ.?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడిపోయాక.. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏదన్నదానిపై రాష్ట్ర ప్రజానీకానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నగానే వుండిపోయింది. చంద్రబాబు హయాంలో అమరావతి, ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా ప్రకటితమయ్యింది. అయితే, అప్పట్లో అమరావతికి మద్దతిచ్చిన...

ఎక్కువ చదివినవి

టిబి స్పెషల్: రంజాన్ రోజు ముస్లిం సోదరుల ఇంట నోరూరించే టాప్ 10 ఫుడ్స్

రంజాన్ అనేది ముస్లిం సోదరులకు ఇదొక పర్వదినం.. వారి పండుగల్లో చాలా ప్రత్యేకమైనది.. నెల రోజుల ముందు నుంచే ఉపవాసం ఉంటూ, ప్రతి రోజూ నియమనిష్టలతో నమాజ్ చేస్తూ, ఎంతో పవిత్రంగా చేసుకునే...

ఫ్లాష్ న్యూస్: బాయ్స్‌ లాకర్‌ రూం వ్యవహారంతో సీబీఎస్‌ఈ కొత్త గైడ్‌ లైన్స్‌

దేశ రాజధాని దిల్లీలో వెలుగులోకి వచ్చిన బాయ్స్‌ లాకర్‌ రూం వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెల్సిందే. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అసభ్యకరమైన వీడియోలు...

జమ్మూలో ఉగ్రమూక ఎన్‌కౌంటర్‌

ప్రపంచం మొత్తం కూడా కరోనా విలయతాంఢవం చేస్తున్న ఈ సమయంలో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు మాత్రం దారుణాలకు పాల్పడుతూనే ఉన్నారు. జమ్మూ కాశ్మిర్‌లో ఉగ్రవాదులు భారత జవాన్‌లపై విరుచుకు పడటంతో పాటు చంపేందుకు...

క్రైమ్ న్యూస్: కలకలం రేపుతున్న బావిలో మృతదేహాలు

వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం గొర్రెకుంటలోని ఓ వరుసగా మృతదేహాలు బయటపడడం ఆ ప్రాంతంతో తీవ్ర కలకలం రేపుతోంది. ముందురోజు నాలుగు మృతదేహాలు లభ్యమవగా.. ఈ రోజు ఉదయం మరో మూడు మృతదేహాలు...

ఇండియా ఫస్ట్ స్టెప్ సక్సెస్ – కరోనా కట్టడిలో ‘అశ్వగంధ’ కీ రోల్.!

ఎన్ని అత్యాధునిక మెడికల్ టెక్నాలజీస్ వచ్చిన, ప్రాచీన కాలంలోనే మన భారతీయ శాస్త్రవేత్తలు రచించిన ఆయుర్వేద వైద్య విధానంలో దాదాపు అన్నిటికీ మందులున్నాయి. అందుకే మళ్ళీ ఆయుర్వేదంకి డిమాండ్ పెరుగుతోంది. ఇప్పుడు ఈ...