Switch to English

ఈ వార్త నిజం అయితే రామ్‌ దశ తిరిగినట్లే

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఒక్క సినిమా చేస్తే చాలా ఆ హీరో జాతీయ స్థాయిలో హీరోగా స్టార్‌డం దక్కించుకోవడంతో పాటు అయిదు ఆరు సంవత్సరాల పాటు వరుసగా చిత్రాలు చేస్తూ బిజీగా ఉంటాడు. అందుకు జక్కన్న సినిమాలో ఒక్కసారి అయినా నటించాలని స్టార్‌ హీరోల నుండి కామెడియన్స్‌ వరకు అంతా కూడా ఎంతో ఆశపడతారు. అయితే జక్కన్న దర్శకత్వంలో చేసే అవకాశం మాత్రం అంత సులభంగా రాదు.

జక్కన్న రెండు మూడు సంవత్సరాలకు ఒక్క సినిమా చేస్తున్న కారణంగా ఆయన దర్శకత్వంలో నటించే అవకాశాలు చాలా తక్కువ మంది హీరోలకు వస్తున్నాయి. అలాంటి అవకాశం రామ్‌ పోతినేనికి రాబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ప్రస్తుతం రెడ్‌ అనే చిత్రంలో నటిస్తున్న రామ్‌ ఆ తర్వాత మరో సినిమాకు కమిట్‌ అయ్యాడు. ఈ రెండు చిత్రాల తర్వాత ఈయన రాజమౌళి దర్శకత్వంలో నటించబోతున్నాడు అంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

రాజమౌళి ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది. అప్పటి వరకు జక్కన్న మరో సినిమా గురించి ఆలోచించక పోవచ్చు. సినిమా విడుదల తర్వాత కూడా కనీసం ఆరు నెలలు అయినా జక్కన్న విశ్రాంతి తీసుకుంటాడు. అంటే వచ్చే ఏడాది ద్వితీయార్థంలో జక్కన్న తదుపరి చిత్రం మొదలయ్యే అవకాశం ఉంది. మరి అప్పుడు రామ్‌తోనే జక్కన్న సినిమా తీస్తాడా అనేది చూడాలి.

ఒకవేళ ఈ వార్త నిజం అయితే మాత్రం ఖచ్చితంగా రామ్‌ కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌ అవుతుందని నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు చేస్తున్న జక్కన్న తన తదుపరి చిత్రాన్ని 50 కోట్ల బడ్జెట్‌తో చేయాలని భావిస్తున్నాడట. అందుకే రామ్‌ ను ఎంచుకున్నాడని ప్రచారం జరుగుతోంది. రామ్‌ కాకుంటే రానాతో అయినా జక్కన్న మూవీ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

తెలంగాణలో భయపెడ్తున్న ‘కరోనా’ మరణాలు

పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తెలంగాణలో తక్కువే వుంది. కానీ, ఆంధ్రప్రదేశ్‌తో పోల్చి చూసినప్పుడు తెలంగాణలో కరోనా టెస్టులు తక్కువగా జరుగుతున్నాయి. కరోనా పరీక్షలు తక్కువగా చేస్తుండడంపై...

మల్టీస్టారర్లకు కేరాఫ్ అడ్రస్ గా మారిన వెంకీ

మల్టీస్టారర్లు ఈ మధ్య కాలంలో బాగానే వస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం వరకూ టాలీవుడ్ మర్చిపోయిన ఈ మల్టీస్టారర్ కాన్సెప్ట్ కు విక్టరీ వెంకటేష్ ఆజ్యం పోసాడనే చెప్పాలి. ఒక రకంగా సీతమ్మ వాకిట్లో...

పూజా హెగ్డే కోసం ఆ ఇద్దరు హీరోల పోటీ

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌ మరియు అఖిల్‌ ల చిత్రాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. అఖిల్‌ చిత్రం మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ ఇప్పటి వరకు షూటింగ్‌ పూర్తి...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను కలిగించేలా సినిమా ఆఫీస్‌ లను ఫిల్మ్‌...

పోతిరెడ్డిపాడుపై స్పందించిన చంద్రబాబు.. ఏమన్నారంటే..

కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు. రాయలసీమ కరువు పోగొట్టడానికి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్ధ్యం పెంచుతామని సీఎం జగన్ చెప్పడంతో రెండు రాష్ట్రాల్లో...