ప్రస్తుతం హీరోలు అంతా కూడా సొంత నిర్మాణ సంస్థలు ఏర్పాటు చేసుకుంటున్నారు. స్టార్ హీరోలు దాదాపు అందరు కూడా నిర్మాతలుగా మారిపోయారు. కొందరు సొంతంగా నిర్మాణ సంస్థ ఏర్పాటు చేయకున్నా కూడా తమ కుటుంబ సభ్యులతోనో లేదంటే తమ సన్నిహితులతోనో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయిస్తున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్‌బాబు, ప్రభాస్, రామ్ చరణ్, నాని, నితిన్ ఇంకా ఎంతో మంది హీరోలు కూడా నిర్మాణరంగంలోకి అడుగు పెట్టారు.
ఈ జాబితాలో ఎన్టీఆర్ కూడా చేరబోతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన నటించబోతున్న సినిమాకు స్లీపింగ్ పార్టనర్‌గా వ్యవహరించబోతున్నాడు. తన అన్న కళ్యాణ్ రామ్‌ను నిర్మాతగా మార్చడంతో తను కూడా లాభాల్లో వాటాను తీసుకోబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. తదుపరి చిత్రంకు అన్న కళ్యాణ్ రామ్‌తో భాగస్వామ్యం కాకుండా తానే సొంత నిర్మాణ సంస్థను పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఎన్టీఆర్ తన తండ్రి హరికృష్ణ పేరు మీద ‘ఎన్‌హెచ్‌కే’ అనే బ్యానర్‌ను రిజిస్ట్రర్ చేయించబోతున్నాడట. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతున్నాయట. ఎన్టీఆర్‌కు ఆప్తమిత్రుడు అయిన ఒక వ్యక్తి ఈ బ్యానర్ వ్యవహారాలు చూసుకోబోతున్నాడట. ఈ బ్యానర్లో సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్‌లను కూడా నిర్మించాలని భావిస్తున్నారట. ఎన్టీఆర్ 31వ చిత్రం ఈ బ్యానర్లో ఉంటుందని సమాచారం. మరి ఎన్టీఆర్ నిర్మాతగా ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి.
647615 662374You could definitely see your skills in the function you write. The world hopes for far more passionate writers like you who arent afraid to say how they believe. At all times follow your heart 850530