ప్రపంచమంతా కరోనా దెబ్బకి విలవిల్లాడుతోంటే, రాజకీయ నాయకులు మాత్రం వికటాట్టహాసం చేస్తున్నారు. మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభంలో కొత్త ట్విస్ట్. ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఈ రోజు తన రాజీనామాని ప్రకటించారు. దాంతో, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ సర్కార్ ఈ రోజుతో ఖతం అయినట్లు లెక్క. ఇంకేముంది, భారతీయ జనతా పార్టీ మధ్య ప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఈ రాజకీయ సంక్షోభం ఏర్పడింది. నిజానికి, ఈ సంక్షోభానికి కారణం భారతీయ జనతా పార్టీనే. బీజేపీ కనుసన్నల్లోనే మధ్యప్రదేశ్లో రాజకీయ సంక్షోభం తెరపైకొచ్చింది. వ్యవహారం సుప్రీంకోర్టుదాకా వెళ్ళింది. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి కమల్నాథ్ చేయని ప్రయత్నమంటూ లేదు. చివరికి ఆయన చేతులెత్తేయాల్సి వచ్చింది.
దేశంలో కరోనా వ్యాప్తి క్రమక్రమంగా పెరుగుతున్న విషయం విదితమే. ఇది నిజంగానే పెను విపత్తు. ఈ పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ఒకింత బాధ్యతగా వ్యవహరించాల్సి వుంది. కానీ, దురదృష్టవశాత్తూ మన దేశంలో రాజకీయ నాయకుల నుంచి ‘బాధ్యత’ని ఆశించలేం. మధ్యప్రదేశ్లో రాజకీయ సంక్షోభానికి కారణమైన రాజకీయ నాయకులెవరికీ కరోనా భయం లేదు. ప్రజలంటే బాధ్యత అసలే లేదు. అన్నిటికీ మించి, దేశంలో ప్రజలు తీవ్రమైన భయాందోళనల్లో వున్న వేళ, భారతీయ జనతా పార్టీ, మధ్యప్రదేశ్ రాజకీయాలపై ఇంత ఫోకస్ ఎలా పెట్టగలిగిందో ఎవరికీ అర్థం కావడంలేదు.
ఆంధ్రప్రదేశ్లో కరోనా చుట్టూ జరుగుతున్న రాజకీయాల్ని చూస్తున్నాం. అంతకు మించిపోయేలా మధ్యప్రదేశ్లో రాజకీయం ‘న భయం న సిగ్గు’ అన్నట్లు నడిచింది. ‘ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చేసింది.. మళ్ళీ మాదైన రోజు వచ్చి తీరుతుంది..’ అంటూ కమల్నాథ్, బీజేపీని హెచ్చరించడం చూస్తోంటే, మరోమారు మధ్యప్రదేశ్లో రాజకీయ సంక్షోభం ఇంకా గట్టిగానే తలెత్తినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదేమో.!
942731 532354Exceptional read, I just passed this onto a friend who was doing some research on that. And he in fact bought me lunch since I identified it for him smile So let me rephrase that: Thank you for lunch! 321783
291522 821943Man you legend. return see my website, you ought to get pleasure from it. 265782
36200 91003Perfect just what I was searching for! . 824256
147627 702454It can be difficult to write about this subject. I believe you did an outstanding job though! Thanks for this! 35553
214059 586310Following study several with the content material inside your internet website now, and i also truly much like your way of blogging. I bookmarked it to my bookmark website list and are checking back soon. Pls take a appear at my internet page also and inform me how you feel. 512542