కరోనా యాంటీవైరల్ డ్రగ్ గా తయారైన రెమిడెసివిర్ కు డబ్ల్యూహెచ్ఓ షాక్ ఇచ్చింది. కరోనా పేషెంట్స్ గా జాయిన్ అయిన ఎవరికీ ఈ వ్యాక్సిన్ ఇవ్వొద్దని సూచించింది. డబ్ల్యూహెచ్ఓ చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం సంచలనం రేపుతోంది. కారణం.. ఈ వ్యాక్సిన్ ను ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాల్లో అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి వైద్యుల సలహా మేరకు ప్రయోగిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఉండటం విశేషం. డబ్ల్యూహెచ్ఓ తెలిపిన వివరాల ప్రకారం..
‘కరోనా బారిన పడినవారిపై ఈ వ్యాక్సిన్ అందించినా పెద్దగా ప్రభావం చూపిన దాఖలాలు లేవు. కరోనా రోగి ఎంతటి తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వొద్దు. ఈ వ్యాక్సిన్ వల్ల రోగులకు వెంటిలేటర్ సాయం అవసరం లేకపోవడం, రికవరీ రేటుపై పెద్దగా ఫలితాలు రాలేదు. కరోనాతో పోరాడుతున్న దాదాపు 7వేల మందిపై జరిపిన పరిక్షల అనంతరమే ఈ ప్రకటన చేస్తున్నాం. అయితే.. ఈ వ్యాక్సిన్ తో ప్రయోజనం లేదని చెప్పడం మా ఉద్దేశం కాదు. ఈ వ్యాక్సిన్ కు ముందు ఇచ్చిన చికిత్సకు రెమిడెసివిర్ ప్రయోగంలో పెద్దగా తేడాలు కనిపించకపోవడమే ఇందుకు కారణం’ అని ప్రయోగాలు జరిపిన్ ప్యానెల్ వెల్లడించింది.
రెమిడెసివిర్ తో కరోనా రోగులు త్వరగా కోలుకుంటున్నారనే పలు పరిక్షలు ద్వారా నిర్ధారణ కావడంతోనే ఆయా దేశాల్లో అనుమతి లభించింది. ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశం అవుతోంది.
603413 7330Definitely pent topic matter, regards for entropy. 145978
121015 990398Most valuable human beings toasts really should amuse and present give about the couple. Beginner audio systems previous to obnoxious throngs would be wise to remember often the valuable signal utilizing grow to be, which is to be an individuals home. very best man speech examples 934666
581923 534231Hello there! Good post! Please inform us when all could see a follow up! 870076