Vishwak Sen : యంగ్ హీరో విశ్వక్ సేన్ కు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాస్ కా దాస్ అంటూ ట్యాగ్ ను దక్కించుకుని ఇటీవలే దమ్కీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఆ సినిమా మాత్రమే కాకుండా మరి కొన్ని ఆసక్తికర సినిమాలను విశ్వక్ సేన్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు.
తాను డబ్బులు పెట్టి మొదటి సారి నటించిన చిత్రం ‘వెళ్లి పోమాకే’. ఆ సినిమా కోసం రూ.12 లక్షలు ఖర్చు చేశాను. ఆ సినిమా రెండు సంవత్సరాలు అయినా కూడా విడుదల కాకపోవడంతో న్యూమరాలజీ ప్రకారం తన పేరు దినేష్ నాయుడు సరిగా లేదని… అందుకే మరో పేరును పెట్టుకోవాలని సూచించాడట.
ఆ న్యూమరాలజిస్ట్ చూపించిన ప్రకారం విశ్వక్ సేన్ పేరును ఎంపిక చేసుకున్నాను. ఇంట్లో వారు ఇదేం పేరు అంటూ నో చెప్పారు కానీ సినిమా విడుదల అవ్వడం కోసం ఏం చేసేందుకు అయినా సిద్ధం అన్నట్లుగా దినేష్ నాయుడు కాస్త విశ్వక్ సేన్ గా మారింది.