Train Accident: ఒడిశా (Odisha) లో జరిగిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ (Coromandel Express) ఘోర ప్రమాదంలో దాదాపు 50మంది వరకూ మృతి చెందినట్టు తెలుస్తోంది. వందల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. 50 అంబులెన్స్లు రప్పించినా సరిపోకపోవడంతో అధికారులు బస్సులు ఏర్పాటు చేశారు. 50 మంది వైద్యులు, సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స చేస్తున్నారు. NDRF, ODRF బృందాలతోపాటు వైమానిక దళం కూడా ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టింది.
రైలు ప్రమాద దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) , ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ ఖడ్, ప్రధాని మోదీ (PM Modi), కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ (Rahul Gandhi) తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో మాట్లాడిన ప్రధాని మోదీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ నేపథ్యంలో బాధితుల వివరాలు తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రత్యేక హెల్స్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు.