Switch to English

‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్ విడుదల

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,802FansLike
57,764FollowersFollow

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘టిల్లు స్క్వేర్’ మరోసారి మ్యాడ్ నెస్ ని ఆవిష్కరించింది!

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ చిత్రంతో సంచలన బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు. అలాగే ఆ సినిమాలో ఆయన పోషించిన టిల్లు పాత్ర యువతలో కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. టిల్లుగా సిద్ధు జొన్నలగడ్డ పంచిన వినోదాన్ని ప్రేక్షకులు అంత తేలికగా మరిచిపోలేరు. టిల్లు మాటలు, చేష్టలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాయి. ‘డీజే టిల్లు’లో సిద్ధు పలికిన “అట్లుంటది మనతోని” వంటి పలు మాటలు.. టిల్లు అభిమానులతో పాటు సామాన్యులలో కూడా రోజువారీ సంభాషణలుగానూ మారిపోయాయి.

‘డీజే టిల్లు’ అద్భుతమైన విజయాన్ని సాధించడంతో, టిల్లు పాత్రతో మరోసారి వినోదాన్ని పంచాలన్న ఉద్దేశంతో ఈ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది. అదే ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి.. టిల్లుని, అతని చేష్టలను తిరిగి వెండితెరపై చూడటం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ‘డీజే టిల్లు’ తరహాలోనే వినోదాత్మకంగా, టిల్లు శైలి సంభాషణలతో ఈ చిత్రం సాగనుంది. ఈ సీక్వెల్ తో మొదటి భాగానికి రెట్టింపు వినోదాన్ని అందిస్తామని చిత్రం బృందం ఎంతో నమ్మకంగా ఉంది.

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న హైదరాబాద్‌లోని శ్రీరాములు థియేటర్‌లో ‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. “టిల్లు” ఫిల్మ్ ఫ్రాంచైజీ నుండి ఈ చిత్రం మరో భారీ బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ ను అందించడానికి సిద్ధంగా ఉందని ట్రైలర్ తో స్పష్టమైంది.

ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంతో ఆమె, పక్కింటి అమ్మాయిలా ఉంటుందనే తన ఆన్-స్క్రీన్ ఇమేజ్‌ని మార్చుకోవాలని నిర్ణయించుకుంది. అనుపమ పరమేశ్వరన్ లుక్స్‌తో పాటు ఆమె బాడీ లాంగ్వేజ్ మరియు సిద్ధూతో ఆమె కెమిస్ట్రీ ఈ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి.

మొదటి భాగంలో రాధిక ప్రేమ కారణంగా ఇబ్బందులు కొని తెచ్చుకున్న టిల్లు.. ఇప్పుడు మరోసారి అదే తరహాలో సమస్యల సమూహంలో చిక్కుకున్నట్లుగా ట్రైలర్ లో చూపించారు. అయితే మేకర్స్ కథకి సంబంధించిన విషయాలను ఎక్కువగా వెల్లడించకుండా.. ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగించేలా ట్రైలర్ ను అద్భుతంగా రూపొందించారు.

రామ్ మిరియాల స్వరపరిచిన పాటలు ఇప్పటికే విడుదలై వైరల్ అవుతున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ థమన్ ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందిస్తున్నారు.

మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ట్రైలర్ తోనే ఆయన.. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, మొదటి భాగాన్ని మించి అలరించనున్నామనే నమ్మకాన్ని కలిగించగలిగారు.

‘టిల్లు స్క్వేర్’ చిత్రం 2024, మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

సినిమా

సినిమా బతకాలంటే, సినీ పరిశ్రమ ఏం చెయ్యాలి.?

సినిమా అన్నాక, పాజిటివిటీ.. నెగెటివిటీ.. రెండూ మామూలే.! సోషల్ మీడియా పుణ్యమా అని, నెగెటివిటీని ఆపగలిగే పరిస్థితి లేవు. ఒకప్పుడు పెద్ద సినిమా ఏదన్నా విడుదలైతే,...

గుండె బరువెక్కుతుంది.. క్రూరమైన ఉగ్రదాడిపై సెలబ్రిటీస్ స్పందన..!

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడితో దేశం మొత్తం ఉలిక్కి పడింది. ప్రకృతి అందాలు చూసేందుకు వెళ్లిన యాత్రికుల మీద ఒక్కసారిగా ఉగ్రదాడి జీవితాలను చిదిమేసింది. పహల్గాం...

Chiranjeevi: ‘మీ కెరీర్ టర్న్ కావచ్చేమో..’ ‘వేవ్స్’లో భాగం కావాలని చిరంజీవి...

Chiranjeevi:అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను ఎంటర్టైన్మెంట్ హబ్ గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వేవ్స్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ‘వరల్డ్ ఆడియో...

అంత నీచురాలిని కాదు.. ప్రవస్తి ఆరోపణలపై సునీత

సింగర్ ప్రవస్తి ఆరోపణలతో టాలీవుడ్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. పాడుతా తీయగా షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద...

కీరవాణి చాలా మంచి వ్యక్తి.. స్టార్ సింగర్ హారిక క్లారిటీ..

సింగర్ ప్రవస్తి చేస్తున్న ఆరోపణలతో టాలీవుడ్ లో పెను దుమారం రేగుతోంది. పాడుతా తీయగా షో నుంచి ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత.. ఆ షో...

రాజకీయం

దువ్వాడకీ వైసీపీకి ఎక్కడ చెడింది చెప్మా.?

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ వదిలించుకుంది. 2024 ఎన్నికల సమయంలో, అంతకు ముందూ.. రాజకీయ ప్రత్యర్థుల మీదకి దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ ఓ ఆయుధంలా వినియోగించుకుని, ఇప్పుడిలా వదిలించుకోవడం ఒకింత ఆశ్చర్యకరమే. టీడీపీ నేత,...

వైసీపీ తప్పుడు రాతలను ఖండించిన ఉస్రా సంస్థ..!

ఉర్సా సంస్థపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఖండించింది ఉర్సా సంస్థ. రాష్ట్రానికి మేలు జరగకుండా కుట్ర చేసేందుకే ఇలా చేస్తున్నారని సంస్థ అంటుంది. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ ఈ...

ఏపీ లిక్కర్ స్కామ్: దొంగల బట్టలిప్పుతానంటున్న ‘విజిల్ బ్లోయర్’ విజయ సాయి రెడ్డి.!

ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే...

సజ్జల ఉవాచ.! చారిత్రక ఆవశ్యకత.! అసలేంటి కథ.?

వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’గా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత.. అంటూ, పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. వై...

“లిక్కర్ దొంగల మిగిలిన దుస్తులు విప్పేందుకు సహకరిస్తా..”: విజయసాయిరెడ్డి

లిక్కర్ స్కాం వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే....

ఎక్కువ చదివినవి

చంద్రయ్య కుటుంబానికి మొదటి ఆహ్వానం.. చంద్రబాబుకు కార్యకర్తలే ముఖ్యం..

సీఎం చంద్రబాబు, నారా లోకేష్ టీడీపీలో పూర్తి ప్రక్షాళన పరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. డ్బబున్న వారికి కాకుండా.. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకే జై కొడుతున్నారు. పార్టీకి పునాదులే కార్యకర్తలు అని వాళ్లు...

చంద్రబాబు కట్టిన ప్రాజెక్టులు.. చేసిన పనులు..

ఏపీ అంటే వ్యవసాయ ప్రాంతం. ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే పంటలు పుష్కలంగా పండాలి. దానికి ప్రధానంగా కావాల్సింది నీళ్లే. నీరు ఉంటే చాలు.. రైతుల ఇంట్లో సిరుల పంటలు పండుతాయి. ఈ...

కీరవాణి, చంద్రబోస్ లపై సింగర్ ప్రవస్తి సంచలన ఆరోపణలు

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ సునీత, పాటల రచయిత చంద్రబోస్ ల మీద సంచలన ఆరోపణలు చేసింది సింగర్ ప్రవస్తి ఆరాధ్య. పాడుతా తీయగా షో గురించి అందరికీ తెలిసిందే. ఎస్పీ...

ఏపీ లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది

ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్( Mega DSC Notification -2025) పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 16,347 ఖాళీలను భర్తీ చేయనున్నారు. తాము అధికారంలోకి రాగానే ఖాళీగా...

Samantha: నెట్టింట ఓ పోస్టు.. లైక్ చేసిన సమంత.. సోషల్ మీడియాలో చర్చ

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత తన వృత్తి, ఆరోగ్యం, ఆత్మస్థైర్యం, పర్యటనలు, మహిళల రక్షణ.. వంటి అంశాలపై స్పందిస్తూంటారు. ఈక్రమంలో ఇంటర్నెట్లో వైవాహిక జీవితాలు విచ్ఛిన్నం అనే అంశంపై...