తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ జరిపింది. ఈనేపథ్యంలో ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. కోవిడ్ పాజిటివిటీ రేట్ 3.16 ఉందని ఆన్ లైన్ విచారణలో హాజరైన రాష్ట్ర డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 77 లక్షల ఇళ్లల్లో ఫీవర్ సర్వే చేపట్టామని.. 3.45 లక్షల కిట్లు పంపిణీ చేశామన్నారు. కిట్లలో పిల్లల చికిత్స ఔషధాలు లేవని న్యాయవాదులు ప్రశ్నించగా.. కిట్ల రూపంలో నేరుగా పిల్లలకు మందులు ఇవ్వకూడదని డీహెచ్ అన్నారు. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.
మరోవైపు రాష్ట్రంలో జనవరి 31 నుంచి పాఠశాలలు తెరుస్తారా అని హైకోర్టు ఆరా తీయగా.. ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో పాఠశాలల ప్రారంభంపై వివరాలు తెలపాలని హైకోర్టు ఆదేశించింది. సమ్మక్క జాతర ఏర్పాట్లపై నివేదిక సమర్పించాలని.. వారాంతవు సంతల్లో కోవిడ్ జాగ్రత్తలపై నివేదిక సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.