Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా పోలిస్ అధికారి పాత్రలో నటించిన ఫహాద్ ఫాజిల్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో పుష్ప తర్వాత పాన్ ఇండియా గుర్తింపు వచ్చిందా..? అనే ప్రశ్నకు ఇచ్చిన సమాధానం చర్చనీయాంశమైంది.
‘పుష్ప నా కెరీర్ ను ఏమాత్రం ప్రభావితం చేయలేదు. ఎప్పటిలా నాకు వచ్చే అవకాశాలు వస్తున్నాయి. ఇందులో దాచుకోవాల్సింది ఏమీ లేదు. నా నుంచి ప్రేక్షకులు ఆశించట్లేదు. సుకుమార్ పై ఉన్న అభిమానంతో పుష్ప చేశా. నా మనసంతా మలయాళ సినిమాలపైనే ఉంటుంది. మలయాళం రానివాళ్లు కూడా మలయాళ సినిమాలు చూస్తున్నారు. నాకు అదెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎవరినీ కించపరిచే ఉద్దేశం నాకు లేద’ని అన్నారు.
ఆగష్టు 15న విడుదలకానున్న సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సీక్వెల్ లో ఆయన పాత్ర.. హీరోతో సమానంగా ఢీకొట్టేలా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.