Switch to English

మీ భవిష్యత్తు నా బాధ్యత.. టీడీపీ మేనిఫెస్టో ఇదే

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,409FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. శనివారం ఉండవల్లిలోని ప్రజావేదికలో ఉగాది వేడుకల అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఉదయం 11 గంటల సమయంలో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ తమ మేనిఫెస్టోను విడుదల చేయగా.. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ‘మీ భవిష్యత్తు నా బాధ్యత’ అంటూ టీడీపీ ఎన్నికల ప్రణాళికను చంద్రబాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ అధినేత జగన్ పై విమర్శలు చేశారు. అవి చేస్తాం.. ఇవి చేస్తాం అంటూ కొందరు ఎలాంటి అవగాహన లేకుండా మేనిఫెస్టో విడుదల చేశారని దుయ్యబట్టారు. అసలు ఆదాయం ఎక్కడి నుంచి ఎంత మేర ఎలా వస్తుందనే కనీస అవగాహన కూడా లేకుండా ఇష్టానుసారం హామీలిచ్చారని విమర్శించారు. తాము మాత్రం అలా కాకుండా పేదరికం లేని సమాజం నెలకొల్పే దిశగా మేనిఫెస్టో రూపొందించామని తెలిపారు. గతంలో తాము చెప్పినదాని కంటే ఎక్కువే చేశామన్నారు.

టీడీపీ మేనిఫెస్టో ముఖ్యాంశాలివీ..

  • ఐదేళ్ల పాటు అన్నదాతా సుఖీభవ పథకం. వచ్చే ఖరీఫ్‌ నుంచి కౌలు రైతులకూ వర్తింపు.
  • రైతులకు 12గంటల పాటు ఉచిత విద్యుత్‌.. ఉచిత పంటల బీమా
  • రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి.
  • ఏడాదిలో పోలవరం పూర్తి.. 40లక్షల ఎకరాలకు సాగునీరు
  • డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ కొనసాగింపు.. ఉచితంగా స్మార్ట్‌ ఫోన్లు
  • ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షలకు పెంపు
  • చంద్రన్నబీమా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు
  • పెళ్లి కానుక రూ.లక్షకు పెంపు
  • అందరికీ ఉచితంగా ఇళ్లు
  • వృద్ధాప్య పింఛన్ అర్హత వయస్సు 65 నుంచి 60 ఏళ్లకు తగ్గింపు
  • చంద్రన్న బీమా రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంపు
  • చంద్రన్న భరోసా పింఛన్లు రూ.2వేల నుంచి 3వేలకు పెంపు.
  • ప్రభుత్వ పరిధిలో ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ. వివిధ శాఖల్లోని బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ
  • నిరుద్యోగ భృతి రూ.2వేల నుంచి రూ.3వేలకు పెంపు.
  • ఇంటర్‌ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు.. ఇంటర్ పాసైతే నిరుద్యోగ భృతి
  • విదేశీ విద్యకు ఉపకార వేతనాలు రూ.25లక్షలకు పెంపు
  • పెద్ద పంచాయతీలు, మండల కేంద్రాల్లో అన్న క్యాంటీన్ల ఏర్పాటు
  • పేద కుటుంబాలకు పండుగల కోసం రెండు ఉచిత గ్యాస్ సిలిండర్లు
  • చట్ట సభల్లో మహిళలలకు 33 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు కృషి
  • ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు
  • రూ.100 కోట్లతో అంబేడ్కర్‌ స్మృతి వనం
  • రెండేళ్లలో జగ్జీవన్‌రామ్‌ స్మృతివనం
  • మరో ఏడు జిల్లాల్లో అంబేడ్కర్‌ స్టడీ సర్కిల్స్‌
  • వెనుకబడిన తరగతులకు మరో 200 గురుకులాల ఏర్పాటు
  • చేనేత కుటుంబాలకు ఉచిత ఆరోగ్య బీమా
  • ప్రతి చేనేత కుటుంబం ఖాతాలో ఏటా రూ.4వేల జీవన భృతి
  • కాపుల సంక్షేమానికి రూ.5వేల కోట్లు
  • కాపులకు విద్య, ఉద్యోగాల్లో 5శాతం రిజర్వేషన్ల అమలు
  • వచ్చే ఐదేళ్లలో కాపుల సంక్షేమానికి రూ.5వేల కోట్లు
  • ప్రైవేటు దేవాలయాల అర్చకులకు చంద్రన్నబీమా
  • అగ్రవర్ణ పేదలకు విద్య, వైద్యం, గృహ నిర్మాణ పథకాలు అమలు
  • ప్రతిజిల్లాలో క్రైస్తవ భవనం నిర్మాణం
  • మానసిక వికలాంగులకు నెలకు రూ.3వేలు పింఛను
  • దివ్యాంగులకు 3 చక్రాల మోటరైజ్డ్‌ సైకిళ్ల పంపిణీ
  • జలధార పథకం ద్వారా అన్ని గ్రామాలకు రక్షిత నీటి సరఫరా
  • అన్ని గ్రామాలకు రోడ్ల సౌకర్యం.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mouni Roy: మౌని బికినీ వేస్తే.. మత్తెక్కిస్తున్న ముంబై భామ అందాలు

Mouni Roy: ‘పాప అలా నడుస్తూ ఉంటే.. పాప అలా సింపుల్ గా నుంచుంటే.. అబ్బో..’ అని ఓ సినిమాలో హీరోయిన్ ను ఉద్దేశించి డైలాగ్...

Navdeep: ‘నా పేరు లేదని కొందరు బాధ పడుంటారు..’ రేవ్ పార్టీపై...

Navdeep: ‘బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rev Party) వ్యవహారంలో నా పేరు రాకపోవడంపై చాలామంది నిరుత్సాహపడి ఉంటార’ని హీరో నవదీప్ (Navdeep) అన్నారు. తాను...

Kalki 2898 AD: ‘ఇంజనీరింగ్ అద్భుతం ఇది..’ బుజ్జిని డ్రైవ్ చేసిన...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) నటించిన భారీ స్కేల్ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన...

Indian 2: ఒకే వేదికపై చిరు, రజినీ, కమల్, చరణ్..! కిక్కెక్కిస్తున్న...

Indian 2: కొత్త సినిమాల ప్రమోషన్లకు ముఖ్య అతిథులుగా అతిరధ మహారధులు హాజరయితే ప్రేక్షకాభిమానులకు కన్నులపండగే. అరుదుగా జరిగే ఇటువంటి అంగరంగ వైభవం త్వరలో జరుగనుందని...

Bala Krishna: ‘ఆ లోటు ఈ వేడుక తీర్చింది’.. సత్యభామ ప్రీ-రిలీజ్...

Bala Krishna: ‘ఎన్నికలయ్యాక ఫుల్ జోష్ తో షూటింగ్స్ చేద్దామనుకున్నా.. ఇప్పటికీ మొదలు పెట్టలేదు. దాదాపు 50రోజులు మిస్సయిన కెమెరాను సత్యభామ వేడుక భర్తీ చేసింద’ని...

రాజకీయం

టీడీపీ రిగ్గింగ్ వర్సెస్.! వైసీపీ రౌడీయిజమ్.!

ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడులో తలలు పగిలాయ్.! రాయలసీమలోనూ అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏడు చోట్ల ఈవీఎంలను పగలగొట్టారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఓ...

ఇన్‌సైడ్ స్టోరీ: రాయలసీమలో వైసీపీ పరిస్థితేంటి.?

రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వేవ్ వున్నాగానీ, రాయలసీమలో మాత్రం షరామామూలుగానే వైసీపీ వేవ్ వుంటుందని, వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. రాయలసీమలో మెజార్టీ సీట్లు కొట్టగలిగితే, చాలా తేలిగ్గా ప్రభుత్వాన్ని ఇంకోసారి ఏర్పాటు...

సీఎం పదవీ ప్రమాణ స్వీకారం.! వైసీపీ అను‘కుల’ మీడియా వంటకాలు.!

ప్రస్తుతానికైతే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! కానీ, ఎన్నికల కోడ్ అమల్లో వుంది. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితం తర్వాత ఈక్వేషన్స్ మారతాయ్. మళ్ళీ వైఎస్ జగన్...

పవన్ కళ్యాణ్‌ని ఉద్దానం మర్చిపోలేదు.!

ఆంధ్ర రాష్ట్రం లో బాగా వెనక్కి నెట్టేయబడ్డ ప్రాంతం ఉత్తరాంధ్ర. ఆ ఉద్దానం కిడ్నీ బాధితులతో దశాబ్దాలుగా విలవిల్లాడుతోంది. అంతు చిక్కని కిడ్నీ వ్యాధులతో ఉద్దానం చితికిపోయిందన్నది నిర్వివాదాంశం. దశాబ్దాలుగా ఈ సమస్యకు...

గ్రౌండ్ రిపోర్ట్: ఉత్తరాంధ్రలో ‘కూటమి’ వైపే మొగ్గు.!

రాయలసీమ తర్వాత, ఉత్తరాంధ్రలోనూ వైసీపీ అంతే బలంగా వుంటుందంటూ రకరకాల సర్వేలు చూస్తూ వచ్చాం. ఇంతకీ, పోలింగ్ తర్వాత ఉత్తరాంధ్రలో గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి.? ఉత్తరాంధ్రలోనూ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఇంకాస్త భిన్నం....

ఎక్కువ చదివినవి

Navdeep: ‘నా పేరు లేదని కొందరు బాధ పడుంటారు..’ రేవ్ పార్టీపై నవదీప్

Navdeep: ‘బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rev Party) వ్యవహారంలో నా పేరు రాకపోవడంపై చాలామంది నిరుత్సాహపడి ఉంటార’ని హీరో నవదీప్ (Navdeep) అన్నారు. తాను నటించిన లవ్ మౌళి (Love Mouli)...

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 23 మే 2024

పంచాంగం తేదీ 23-05- 2024 గురువారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు తిధి-పౌర్ణమి, విశాఖ నక్షత్రం ఈరోజు విశిష్టత: గౌతమ బుద్ధ జయంతి, కూర్మ జయంతి. ఈరోజు (23-05-2024) రాశి ఫలితాలు మేషరాశి: ఈరోజు ఈ రాశి...

ఏపీ ఎలక్షన్స్: 10 వేల పైన మెజార్టీ 92 స్థానాల్లో.!

ఒకప్పుడు ఎన్నికలకు సంబంధించి ముందస్తు సర్వేలు నిర్వహించాలంటే, అదో పెద్ద తతంగం. ఇప్పుడు అంత సీన్ అవసరం లేదు. శాంపిల్స్ తీసుకోవడం చాలా తేలిక. ఎన్నికల ముందర అయినా, ఎన్నికల పోలింగ్ రోజున...

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో వైరల్

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే పండగే. ఎన్ని పనులున్నా ఆగిపోతాం. అయితే.....

Shruti Haasan: శ్రుతి హాసన్ లవ్ బ్రేకప్ అయిందా..!? క్లారిటీ ఇచ్చిన నటి

Shruti Haasan: హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) నాలుగేళ్ల క్రితం ఢిల్లీకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంత హజారికతో ప్రేమలో ఉన్నట్టు స్వయంగా ప్రకటించింది. అయితే.. ఇప్పుడు వీరిద్దరూ రిలేషన్ లో...