Switch to English

లీడర్లకు ఓట్ల పండగ !

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా అసెంబ్లీ, పార్లమెంటుకు వేర్వేరుసార్లు తెలంగాణ ప్రజలు ఓటేయబోతున్నారు. ఇది ఓటర్లకే కాదు.. నాయకులకు కూడా విచిత్రమైన పరిస్థితే. మూడునెలల క్రితమే అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరగగా.. అంతలోనే పార్లమెంటుకు ఎన్నికలు రావడంతో ఓటేయడంపై ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుంది.

బీజేపీ, కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లు ఏప్రిల్‌ 11న జరిగే పోలింగ్‌కు ఓటుశాతం పెంచాలని తెగ ప్రయత్నిస్తున్నా.. అనుకున్న స్థాయిలో పోలింగ్‌ జరగదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎక్కువమంది జనాలను ప్రచారం ద్వారా చేరుకోవడం.. పోలింగ్‌ శాతం పెరిగితేనే విజయావకాశాలు పెరుగుతాయని ఈ మూడు పార్టీలూ భావిస్తున్నాయి.

అసెంబ్లీ ఎన్నికలతోపోలిస్తే.. పార్లమెంటు ఎన్నికలకు అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడం కష్టం. దాదాపుగా ఆరేడు అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్‌ చేయడం కష్టమైన పనే. అందుకే కొత్త వ్యూహాలకు రాజకీయ పార్టీలు తెరలేపాయి. కొన్ని వర్గాలను ప్రభావితం చేసే వ్యక్తులను సంతుష్టపరచడం ద్వారా ప్రచారాన్ని మరింత సరళీకృతం చేసుకుంటున్నాయి.

మీడియా, సోషల్‌ మీడియా ఎంత విస్తృతమైనా.. ఇప్పటికే చాలాచోట్ల ఒపీనియన్‌ లీడర్స్‌ పాత్ర కీలకంగా ఉంది. అందుకే ఇలాంటి వారిని తమ బుట్టలో వేసుకునేందుకు అభ్యర్థులు నానా కష్టాలు పడుతున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నేత మొదలు గ్రామస్థాయి నేతలనూ ఇలా ప్రత్యేక ప్యాకేజీలతో ప్రసన్నం చేసుకొనే పనిలో తలమునకలయ్యారు.

పట్టణ ప్రాంతాల్లో వార్డులు, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలవారీగా ప్రత్యేక సమయాన్ని నిర్దేశించుకొని ఎన్నికల ప్రచారం చేస్తున్న అభ్యర్థులు.. ఓటర్లను ప్రభావితం చేసే వారెవరా అని వెతికిపట్టుకోవడాన్ని కూడా అంతే ముఖ్యంగా భావిస్తున్నారు. ఇందులో భాగంగా స్థాయిని బట్టి వారితో చర్చిస్తున్నారు. ఎంత మంది ఓటర్లను ప్రభావితం చేయగలరనే అంశం ప్రాతిపదికగా వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. భారీగా ఓటర్ల మద్దతు కూడగట్టగల వారికి ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తున్నారు. వెయ్యి, ఐదు వేలు, పది వేలు ఇలా ఓటర్ల సంఖ్యకు తగినట్లు బహుమతులు ఇస్తున్నారు.

కొన్నిచోట్ల ఎక్కువ మందిని ప్రభావితం చేసే అవకాశం ఉంటే ఏకంగా అభ్యర్థి సమక్షంలోనే తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. అలా వచ్చిన వారికి దావత్‌లు ఇస్తూ వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేయడం.. వారిని బూత్‌వరకు తీసుకురావడం ఈ ఒపీనియన్‌ లీడర్ల బాధ్యతే.

పల్లెటూళ్లోనే కాదు అర్బన్‌ ఏరియాల్లోనూ ఇలాంటివారికి అసెంబ్లీ ఎన్నికలతోపోలిస్తే మంచి డిమాండ్‌ పెరిగింది. పట్టణ నియోజకవర్గాలైన ఎల్బీనగర్‌, మహేశ్వరం, రాజేంద్రనగర్‌, కుత్బుల్లాపూర్‌, మేడ్చల్‌, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో ఇలాంటి దావత్‌లు జోరుగా సాగుతున్నాయి. మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ స్థానాల్లో ఈ తరహా వ్యక్తులకు భారీ మొత్తంలో బహుమతులు అందిస్తున్నారు.

చేవేళ్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని రాజేంద్రనగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో కాలనీలు, వార్డుల్లో క్రియాశీలవ్యక్తులను భారీ సభలు నిర్వహించి పార్టీల్లో చేర్చుకుంటున్నారు. అదేవిధంగా యువతను ప్రభావితం చేసే యువ నాయకులకు పెద్దపీట వేస్తున్నారు.. వారి డిమాండ్లకు తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉదాహరణకు మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో.. ప్రధాన పార్టీ నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ ఆశించిన భంగపడిన నేత.. వేరేపార్టీ టికెట్‌ తెచ్చుకుని బరిలోదిగి పోటీ చేసి 20వేలకుపైగా ఓట్లు సాధించారు. ఆయన్ను ఆకర్షించేందుకు దాదాపు అన్ని పార్టీలూ ప్రయత్నించాయి. అయితే ఎక్కువ ప్యాకేజీ ప్రయత్నించిన ఎంపీ అభ్యర్థికి లోక్‌సభ ఎన్నికల్లో పూర్తిగా సహకరించేందుకు సదరునేత అంగీకరించారు. ఇలా నియోజకవర్గానికి ఒక్కరు దొరికినా ప్రచారంలో కొంత రిలీఫే కదా అనుకుంటున్నారు అభ్యర్థులు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....