Switch to English

ఇలాంటి కలెక్టర్లు ఉంటేనా..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,438FansLike
57,764FollowersFollow

స్వచ్ఛ గుడివాడలో భాగంగా – కృష్ణమ్మ జలశుద్ధి కార్యక్రమం ఈరోజు లాంఛనంగా గుడివాడ లో ప్రారంభమైంది. కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పిలుపు మేరకు గుడివాడ నియోజక వర్గంలో ని డ్రైనేజీలు, వాటర్ లైన్లు, పరిసరాల పరిశుభ్రతకు ఉద్దేశించిన స్వచ్ఛ గుడివాడ కార్యక్రమం ఈరోజు ఉదయం గుడివాడ లోని నెహ్రు చౌక్ వద్ద స్థానిక శాసన సభ్యుడు కొడాలి నాని ముఖ్య అతిధి గా పాల్గొని .. ప్రారంభించారు.

గుడివాడలోని 15 ప్రాంతాల్లో వరుసగా ప్రతి నెల మొదటి, ఆఖరి శనివారంనాడు ఈ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపడతామని, దీనిలో భాగంగా డ్రైనేజీల పూడికతీత, శుభ్రత, ప్రక్షాళన, పరిసరాల శుభ్రత, వాటర్ లైన్ల లీకేజీ ల పరిశీలన, పరిష్కారం, రహదారుల శుభ్రత వంటి కార్యక్రమాలు ఉంటాయని, మునిసిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజలు, స్వచ్చంద సంస్థలు పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ ఇంతియాజ్ పిలుపునిచ్చారు..

ముఖ్య అతిథి కొడాలి నాని మాట్లాడుతూ.. ప్రజలు ప్లాస్టిక్ వాడకం తగ్గించి, తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే.. చాలా సమస్యలు తీరతాయని సూచించారు. ఈ సందర్బంగా గుడివాడ పట్టణంలో ఉన్న సమస్యాత్మక డ్రైనేజీలు, వాటర్ లైన్ల గురించి… వాటి పరిష్కార మార్గాల గురించి తగిన అవగాహన ఉండటం వల్ల, మునిసిపల్ మాజీ చైర్మన్ లంక దాసరి ప్రసాదరావు అధికారులకు వివరించటం జరిగింది.

ఆ సందర్బంగా గుడివాడలో చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న రైల్వే ట్రాక్ కింద గల చింతల కాలువ పూడిక , వాటర్ పైప్ లైన్ల లీకేజీ సమస్య గురించి, వాటి పరిష్కారానికి ఏమేమి చేయవచ్చు అనే విషయాన్ని లంకదాసరి స్థానిక అధికారులకు వివరిస్తుండగా.. ఇలా చేయుటకు రైల్వే అధికారుల అనుమతి తీసుకోవాలని.. స్థానిక అధికారి ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పుడు అక్కడే ఉన్న కలెక్టర్ ఇంతియాజ్ “ఆ విషయం నేను చూస్తాను. మీరు ముందు ఆ పనులు చూడండి” అని సదరు అధికారి కి సూచించారు.. ఇది విన్న స్థానిక ప్రజలు , నాయకులు కలెక్టర్ స్పందనకు కృతజ్ఞతలు చెప్పి ప్రతిచోటా ఇలాంటి అధికారులు ఉంటే.. ప్రజల సమస్యలు చాలావరకు తీరతాయని చర్చించుకోవటం కనిపించింది.

ఈ కార్యక్రమంలో శాసన సభ్యడు కొడాలి నాని, కలెక్టర్ ఇంతియాజ్ , శిక్షణలో ఉన్న నూతన కలెక్టర్ తో పాటు.. ఆర్.డి. ఓ. జీ. సత్యవాణి, మునిసిపల్ కమిషనర్ డా. శామ్యూల్, గుడివాడ మునిసిపల్ మాజీ చైర్మన్ లంకదాసరి ప్రసాదరావు, మునిసిపల్ ఇతర అధికారులు, సిబ్బంది, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌...

రాజకీయం

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

ఎక్కువ చదివినవి

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...