Switch to English

శ్రీలక్ష్మి.. పడి లేచిన కెరటం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నది నానుడి. ప్రస్తుతం ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి చేస్తున్నది అదే. ఈమె గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేయక్కర్లేదు. చిన్న వయసులోనే ఐఏఎస్ కు ఎంపికైన శ్రీలక్ష్మి.. అనూహ్యంగా జైలుకెళ్లారు. జగన్ కేసుల్లో సీబీఐ ఆమెను అరెస్టు చేసి జైలులో పెట్టింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమంగా గనులు తవ్వకాలు జరిపిందని, ఇందుకు శ్రీలక్ష్మి అనుమతిచ్చి సహకరించారని ఆరోపిస్తూ సీబీఐ ఆమెను జైలుకు పంపించింది.

సమర్థవంతమైన ఐఏఎస్ అధికారిని జైలుకు పంపిన ఘనత జగన్ దే అంటూ విపక్షాలు ధ్వజమెత్తాయి. జగన్ కు సహకరిస్తే అంతే సంగతి అంటూ విమర్శలు గుప్పించాయి. ఏ ఐఏఎస్ అధికారి జగన్ వద్దకు వెళ్లినా వారికి జైలు జీవితం ఖాయమంటూ ప్రచారం చేశాయి. మరోవైపు జైలుకు వెళ్లిన శ్రీలక్ష్మి సైతం తీవ్రంగా కుంగిపోయారు. అనారోగ్యానికి గురై చాలా పోగొట్టుకున్నారు. జైలుకు వెళ్లిన కారణంగా ఆమె సస్పెండ్ అయ్యారు. 11 నెలలపాటు జైలులో ఉన్నారు. దాదాపు నాలుగున్నరేళ్లపాటు కష్టాలు అనుభవించారు. చివరకు ఆ కేసులో శ్రీలక్ష్మి నిర్దోషి అని తేలడంతో 2016లో ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేశారు.

మాతృరాష్ట్రం ఏపీ అయినప్పటికీ, చంద్రబాబు ప్రభుత్వంలో పనిచేయడం ఇష్టం లేకపోవడంతో ఆమె తెలంగాణను ఎంచుకున్నారు. దీంతో ఆమె తెలంగాణ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడంతో శ్రీలక్ష్మి అక్కడకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. జగన్ సీఎంగా విజయం సాధించిన తర్వాత ఆయన్ను కలిసి అభినందనలు తెలిపారు. జగన్ సైతం శ్రీలక్ష్మిని సాదరంగా ఆహ్వానించారు. అక్రమ కేసుల్లో ఆమె అనుభవించిన బాధ తెలిసి సానుభూతి ప్రదర్శించారు. తన ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు అప్పగిస్తానని హామీ ఇచ్చారు. దీంతో శ్రీలక్ష్మి తనను డిప్యుటేషన్ పై ఏపీకి పంపించాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.

జగన్ తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ వినతిపై సానుకూలంగానే స్పందించారు. ఇక కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ అనుమతి రావడం ఒక్కటే మిగిలి ఉంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ సుముఖంగా ఉన్నందున ఇది ఇక లాంఛనమే. జగన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నవరత్నాల పథకం అమలు బాధ్యతలను శ్రీలక్ష్మికి అప్పగించాలని భావిస్తున్నట్టు తెలిసింది. తద్వారా ఆమెకు గౌరవం ఇవ్వాలని జగన్ యోచిస్తున్నట్టు సమాచారం. ఎలాంటి తప్పూ చేయకపోయినా అక్రమ కేసులతో అనవసరంగా కష్టాలపడి జైలు జీవితం గడిపిన శ్రీలక్ష్మి.. మాతృ రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు తిరిగి వస్తుండటం హర్షణీయం.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

రాజకీయం

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఎక్కువ చదివినవి

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...