Switch to English

స్పెషల్ స్టోరీ: ఏపీ నేతల్లో టెన్షన్.. ఇదే కారణం..

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఒక విధంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్న వైకాపా మాత్రం కొంత ఆందోళన చెందుతున్నది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పటికే వైకాపా ఎంపిటిసి, జెడ్పీటిసి స్థానాలు అనేకం ఏకగ్రీవంగా గెలుచుకుంది. అధికారంలో ఉన్న పార్టీ సహజంగానే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుంది.

అయితే, వైకాపా నేతలు మిగతా వాళ్ళను నామినేషన్ దాఖలు చేయనీకుండా అడ్డుకున్నారని, దాడులు చేశారని తెలుగుదేశం పార్టీ నేతలు కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కంప్లైంట్ తో పాటుగా కరోనా ప్రభావం కూడా ఉండటంతో ఎన్నికలను వాయిదా వేశారు. మాచర్ల, తిరుపతి, పుంగనూరు ప్రాంతాల్లో మరలా ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచి చేపట్టే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే ఇప్పుడు ఆ పార్టీ నేతలను టెన్షన్ పెడుతున్నది.

ఎందుకంటే, ఎన్నికలు అంటేనే ఖర్చుతో కూడుకొని ఉంటాయి. ఎన్నికల్లో ప్రజల కోసం ఖర్చు పెట్టకపోయినా, కనీసం ఎన్నికల సమయంలో పక్కన ఉన్న కార్యకర్తల కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి. ఎన్నికల ప్రచారం కోసం డబ్బు ఖర్చు చేయాలి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యి ఎన్నికలు పూర్తయ్యే వరకు ఒక్కో అభ్యర్థి ఎన్నికల ప్రచారం కోసం భారీగా ఖర్చులు పెడుతుంటారు. గెలుస్తారో లేదో కూడా నమ్మకం ఉండదు.

స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవం అయినప్పటికీ హింసాత్మక సంఘటనలు జరిగిన ప్రాంతాల్లో ఎన్నికల మొదటినుంచి జరిగే అవకాశం ఉందనే సంకేతాలు వస్తుండటంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆలోచనలో పడిపోయారు. అధికార పార్టీ పరిస్థితే ఇలా ఉంటె, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇంకెలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ నుంచి డబ్బులు అందే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరి డబ్బులు వాళ్లే పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే అభ్యర్థులు ఎన్నికల కోసం చాలా ఖర్చు పెట్టారు. ఎన్నికలు వాయిదా పడటంతో వారంతా నిరాశా చెందుతున్నారు.

ఆరు వారాల తరువాత ఎన్నికలు జరిగితే, అప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంటుంది. రాజధాని ప్రభావం ఎక్కువగా ఉన్న గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలో ఎలాగైనా అధిక స్థానాల్లో విజయం సాధించాలని వైకాపా చూస్తున్నది. ఇది జరగాలి అంటే అభ్యర్థులంతా చురుగ్గా వ్యవహరించాలి. కార్యకర్తలకు చేతులు, జేబులు తడుపుతూనే ఉండాలి. ఇదంతా జరగాలి అంటే పోటీ చేస్తున్న అభ్యర్థుల వద్ద పుష్కలంగా డబ్బు ఉండాలి. అంతిమంగా డబ్బున్న వ్యక్తులే ఎన్నికల్లో విజయం సాధిస్తారు అని చెప్పడానికి ఏపీ ఎన్నికలు ఒక ఉదాహరణగా మారబోతున్నాయి.

సినిమా

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్...

రచయితపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు

ఎస్సీ ఎస్టీలను కించపర్చే విధంగా ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రాసిన పద్యం ఉంది అంటూ దళిత సంఘాల నేతలు మండి పడుతున్నారు. మడి కట్టుకుని ఉండటం...

మహేష్, పూరి మధ్య అంతా సమసిపోయిందా?

సాధారణంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు ఎవరైనా హిట్ అందిస్తే మళ్ళీ వాళ్లతో కలిసి పనిచేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తుంటాడు. కానీ దురదృష్టవశాత్తూ అలా...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

తెలంగాణలో మరిన్ని సడలింపులు.. రాత్రివేళా బస్సులు.!

‘‘కరోనా మహమ్మారిని ఎదుర్కొనేంత సాధన సంపత్తి మనదేశంలో లేవు. అందువల్ల లాక్ డౌన్ ముమ్మాటికీ పాటించాల్సిందే. మన తీసుకునే ముందు జాగ్రత్త చర్యలే మనకు శ్రీరామ రక్ష’’ – ఇటీవల పలు సందర్భాల్లో...

జనవరిలో జరిగిన వుహాన్ విందే నేటి అల్లకల్లోలానికి కారణమా..

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ వైరస్ పుట్టింది చైనాలోని వుహాన్ నగరంలోనే అయినా.. ఎలా పుట్టిందో.. ఎందుకు ఇంతగా వ్యాపించిందో ఇప్పటికీ సరైన సమాధానం లేదు....

కుల వివక్షలో వ్యక్తి హత్య.. తల మొండం వేరు చేసి ఆపై..

కుల వివక్షలో ఏకంగా ఓ వ్యక్తి తలను.. మొండాన్ని వేరు చేసి 35 కత్తిపోట్లు పొడిచిన దారుణ ఘటన తమిళనాడులో జరిగింది. తమిళనాడులోని తూత్తుకుడి ప్రాంతంలో జరిగిన ఈ దారుణ సంఘటనపై పోలీసులు...

డాక్టర్‌ బాబుకు మెగాస్టార్‌ తల్లి ఇచ్చిన గిఫ్ట్‌ ఏంటో తెలుసా?

తెలుగు బుల్లి తెరపై ఇప్పటి వరకు ఎన్నో వందల సీరియల్స్‌ వచ్చాయి. కాని కార్తీక దీపం సీరియల్‌కు వచ్చినంత ప్రజాధరణ ఏ సీరియల్‌కు రాలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కార్తీక దీపం...

మానవ తప్పిదం, నిర్లక్ష్యం వల్లే ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటన

విశాఖపట్నంలో ఇటీవల జరిగిన ఎల్టీ పాలిమన్స్‌ ప్రమాదం మానవ తప్పిదం మరియు నిర్లక్ష్యం వల్లే జరిగిందంటూ ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ తేల్చింది. జాతీయ హరిత ట్రైబ్యూనల్‌ ఈ సంఘటనపై సమగ్ర విచారణ...